వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి పదవి ఇస్తానన్నారు..కేసీఆర్ మాట తప్పారు : నాయిని అసంతృప్తి పీక్..!!

|
Google Oneindia TeluguNews

టీఆర్‌ఎస్ లో మరో నేత తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు. మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహా రెడ్డి సీఎం కేసీఆర్‌పైన తన అభిప్రాయం..తన అసహనం వెల్ల గక్కారు. తెలంగాణ ముఖ్యమంత్రి తనకు మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ తన విషయంలో ఇచ్చిన హామీ ఏదీ నెరవేర్చలేదని.. మాట తప్పారని సీరియస్ అయ్యారు. తనకు ఆర్టీసి ఛైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం మీద స్పందించారు. తనకు అవసరం లేదని తేల్చి చెప్పారు. పార్టీలోని కిరాయిదార్లు ఎప్పటి వరకు ఉంటారో వారికే తెలియాలంటూ కామెంట్ చేసారు.

ప్లాస్టిక్ నిషేధానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలి : నరేంద్ర మోడీప్లాస్టిక్ నిషేధానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలి : నరేంద్ర మోడీ

టీఆర్‌ఎస్ లో మరో నేత అసంతృప్తి..
టీఆర్‌ఎస్ లో ఒకరి తరువాత మరొకరు తమ అసంతృప్తిని బయట పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఈటల రాజేందర్, తర్వాత రసమయి బాలకిషన్... తాజాగా మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహా రెడ్డి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన రోజునే నాయిని తన మనసులోని మాటలను బయట పెట్టారు. ఇప్పటి వరకు మనసులో ఉన్న అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు. వెళ్లగక్కారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నానని, అయితే కౌన్సిల్‌లో ఉండమని కేసీఆర్ అన్నారని తన అసంతృప్తిని బహిర్గతం చేసారు. అంతేకాకుండా మంత్రి పదవి కూడా ఇస్తానన్నారని, దాంతో పాటు మా అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. నాయినికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారంటున్న వ్యాఖ్యలపై నాయిని స్పందించారు. ఆ పదవి తనకు వద్దని, అందులో రసం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ మా ఇంటికి పెద్దఅని, తామంతా ఓనర్లమని అన్నారు. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్లిష్టమని నాయని స్పష్టం చేశారు.

Ex minister naini Narasimha Reddy serious comments on CM KCR regarding cabinet Expansion

కేసీఆర్ తో నాయినిది సుదీర్ఘ బంధం...
నాయిని నర్సింహారెడ్డి తొలి నుండి పార్టీలో అధినేత కేసీఆర్ కు అత్యంత ఆప్తులు. కేసీఆర్ ఉద్యమ సమయం నుండి ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించారు. అందులో భాగంగానే నాయినికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొలి ప్రభుత్వంలో హోం మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఎన్ని విమర్శలు వచ్చినా..ఆయన్ను మార్చలేదు. పార్టీలోనూ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో నాయిని తాను లేదా తన అల్లుడుకు ముషీరాబాద్ అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరారు. చివరి నిమిషం వరకు పెండింగ్ పెట్టి..చివర్లో సీటు ఇవ్వలేదు. ఆ సమయంలో నాయినికి మంత్రిగా..ఆయన అల్లుడికి ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే, తాజాగా కేబినెట్ లో ఉన్న ఆరు స్థానాలను కేసీఆర్ భర్తీ చేయటంతో తనకు మంత్రి పదవి ఇక ఇప్పట్లో రాదనే విషయం నాయినికి అర్దమై పోయింది. దీంతో ..ఆయన తన అసంతృప్తి బయట పెట్టేసారు. అదే సమయంలో కేసీఆర్ తమ ఇంటి పెద్ద అంటూ గౌరవం ఇచ్చారు. ఏది ఉన్నా ఓపెన్ గా మాట్లాడే నాయిని ఇప్పుడు ముఖ్యమంత్రి మాట తప్పారంటూ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంలో..పార్టీలో కలకలం రేపుతున్నాయి.

English summary
Ex minister naini Narasimha Reddy serious comments on CM KCR regarding cabinet Expansion. Nayini says CM KCR failed on his promise to give him ministry. He Rejected RTC Chairman post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X