వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతుకమ్మ థీమ్‌తో ఫొటోగ్రఫీ పోటీలు, విజేతలకు బహుమతులు ప్రదానం

|
Google Oneindia TeluguNews

ఫొటోగ్రఫీ ప్రమాణాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలని మాజీ ఎంపీ కవిత సూచించారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గురువారం రవీంద్రభారతీలో తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతనుల అందజేశారు. అంతకుముందు ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి, హాన్స్ ఇండియా ఎడిటర్ రాము శర్మ, తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ థీమ్

బతుకమ్మ థీమ్

బతుకమ్మ థీమ్‌తో కాంపిటిషిషన్ నిర్వహించడం గొప్ప విషయమని కవిత అన్నారు. ఇందుకు చొరవ చూపిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్‌కు అభినందనలు తెలిపారు. ఫొటో జర్నలిస్టుల సృజనాత్మకత ఆయా ఫొటోలు కనిపిస్తోందని చెప్పారు. ఆయా ఫోటోలను చూస్తుంటే బతుకమ్మ పండగ మళ్లీ వచ్చిందా అనే అనుమానం కలుగుతుందన్నారు.

భావితరాలకు..

భావితరాలకు..

ఆయా ఫోటోలను భవిష్యత్ తరాలకు అందించాలని కవిత అభిప్రాయపడ్డారు. ఇదివరకు బతుకమ్మ ఎలా నిర్వహించేవారే వారు చూసు తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఫొటో జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కవిత్ స్పష్టంచేశారు.

ఆదర్శప్రాయం..

ఆదర్శప్రాయం..

ప్రముఖ ఫొటోగ్రాఫర్ రాజా దీన్‌దయాళ్ గురించి ప్రస్తావించారు. ఆయన గురించి మనం ఎలా మాట్లాడుకుంటున్నామో భవిష్యత్‌లో ఫొటో జర్నలిస్టుల గురించి మాట్లాడుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రతీ ఒక్కరు సమస్య కోణాలను ఫొటోల్లో ఆవిష్కతృమయ్యేట్టు చూడాలని కోరారు.

హ్యపీ టు షేర్...

హ్యపీ టు షేర్...

రవీంద్రభారతీలో జరిగిన ఫొటో జర్నలిస్టుల అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మాజీ ఎంపీ కవిత అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

English summary
ex mp kavitha present awards to photography Competition winners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X