కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? సీఎం కేసీఆర్‌కు పొన్నం బహిరంగ లేఖ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కేసీఆర్ .. సుద్దులు చెప్తారని మండిపడ్డారు. రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివరించాలని సవాల్ విసిరారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను వివరించేందుకు తాను సిద్దమని స్పష్టంచేశారు.

సీఎం కేసీఆర్‌కు పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మీ హయంలో ఎంత అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో అనే అంశంపై డిస్కస్ చేద్దామన్నారు. వేదికపై తమ జిల్లా నుంచి 9 మంది సభ్యులు చర్చలో పాల్గొంటారని ఆ లేఖలో పేర్కొన్నారు.

ex mp ponnam prabhakar wrote letter to cm kcr

ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు, చేసిన పనులపై చర్చించేందుకు ఎప్పుడూ సిద్ధమని .. ప్లేస్, టైం చెప్పాలని అందులో కోరారు. కేసీఆర్ కరీంనగర్‌కు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆయనవి మాటలే కానీ చేతలు ఉండవని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని స్పస్టంచేశారు. రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్‌కు ప్రజల బాగోగులు పట్టవన్నారు. తన కుటుంబానికి పదవులు అప్పగించే కేసీఆర్ .. ప్రజ సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

English summary
ex MP Ponnam Prabhakar Firm on CM KCR. KCR .. can not fulfill the promises given. He made it clear that he was ready to explain the work of the Congress party in the common state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X