వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ కు షాక్ .. నేడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న వివేక్ ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమిత్ షా సమక్షంలో BJPలో చేరనున్న మాజీ MP జి.వివేక్ | Former MP Vivek Finally Decided To Join The BJP

పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వనున్నారు . టీఆర్ఎస్ పార్టీకి రాజేనామా చేసి గత కొంత కాలంగా ఆయన టిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు చాలా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే..తనకు టికెట్ కేటాయించకపోవటం తో మనస్తాపం చెందిన ఆయన గులాబీ పార్టీకి రాజీనామా చేశారు . గత ఎన్నికల ముందు సోదరుడైన వినోద్ కు టిక్కెట్ ఇవ్వని నాటినుండి నెలకొన్న వివాదం చిలికిచిలికి గాలివానైంది. దీంతో పార్టీకి గుడ్ బై చెప్పిన వివేక్ ఏకంగా పార్టీ కి రాజీనామా చేశారు .

నేడు అమిత్ షా ను కలవనున్న వివేక్ ... బీజేపీ లో చేరే అవకాశం

నేడు అమిత్ షా ను కలవనున్న వివేక్ ... బీజేపీ లో చేరే అవకాశం

ఇక తాజాగా వివేక్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు.ఈనెల 23న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవనున్నారు వివేక్. అక్కడ అమిత్ షా సమక్షంలోనే వివేక్ బీజేపీలో చేరనున్నారని సమాచారం. అయితే వివేక్ తో పాటే నల్లగొండ జిల్లాకు చెందిన మరికొందరు నేతలు కూడా బీజేపీ లో చేరనున్నారని సమాచారం.మాజీ ఎంపీ వివేక్ తండ్రి కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ మంచి పేరున్న వ్యాపారవేత్త.

గతః ఎన్నికల ముందు వరుస వివాదాలు... టీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పిన వివేక్

గతః ఎన్నికల ముందు వరుస వివాదాలు... టీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పిన వివేక్

అయితే ఎంపీ వివేక్ గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున 2009 నుంచి 2014 వరకు ఎంపీగా పనిచేశారు.2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన మళ్లీ హస్తం గూటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన వివేక్ మరోమారు టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఎన్నికల నాటి నుండి చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వివేక్ కి టికెట్ వస్తుందని అందరు కూడా భావించినప్పటికీ టిఆర్ఎస్ అధిష్టానం మాత్రం వివేక్ కి టికెట్ ఇవ్వలేదు. అందుకనే మనస్తాపం చెందిన వివేక్ టీఆర్ఎస్ ప్రభుత్వం తనకు ఇచ్చిన ప్రభుత్వ సలహాదారు పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

టీఆర్ఎస్ కు షాక్ .... ప్రతీకారం తీర్చుకునే పనిలో బీజేపీలో చేరుతున్న వివేక్

టీఆర్ఎస్ కు షాక్ .... ప్రతీకారం తీర్చుకునే పనిలో బీజేపీలో చేరుతున్న వివేక్

ఇప్పుడు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే వివేక్ నిర్ణయంతో టిఆర్ఎస్ నేతలు షాక్ తిన్నారు.ఇక తనకు టికెట్ ఇస్తానని మోసం చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై గతంలోనే నిప్పులు చెరిగిన వివేక్ తనకు జరిగిన అవమానానానికి ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డారు. కేసీఆర్ తనని నమ్మించి మోసం చేశారని గత కొన్ని రోజులుగా మండిపడుతున్న వివేక్ ప్రభుత్వంపై పోరాటం సాగించేందుకు సిద్ధం అయ్యారు. ఇక అందుకోసం బీజేపీ బాట పట్టారు.

English summary
Migration into the Bharatiya Janata Party(BJP) has gained momentum. Former TRS MP Vivek has finally decided to join the BJP. With the invitation from the BJP to join the party, he is ready to join the party, it is learned. According to the reports, Vivek was denied Peddapalli MP ticket in the Lok Sabha election by CM KCR. This has angered him and he resigned TRS. After holding talks with BJP central and state leadership, Vivek has reportedly made up his mind to join BJP tomorrow in the presence of party president Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X