హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘వర్మ అరెస్ట్ ఖాయం! అకున్‌ సబర్వాల్‌పై కించపరిచే వ్యాఖ్యలా?’

రాంగోపాల్ వర్మ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దర్శకుడు రాంగోపాల్ వర్మ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వర్మ వ్యాఖ్యలపై రిటైర్డ్ ఎక్సైజ్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విధి నిర్వహణలో ఆటంకం కలిగించేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది.

అకున్ 'బాహుబలి3', డ్రగ్స్ కేసుపై వర్మ సంచలనం: చంద్రవదన్ స్ట్రాంగ్ వార్నింగ్అకున్ 'బాహుబలి3', డ్రగ్స్ కేసుపై వర్మ సంచలనం: చంద్రవదన్ స్ట్రాంగ్ వార్నింగ్

డీజీఐ స్థాయి అధికారిని కించపరుస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, వర్మ చేసిన వ్యాఖ్యలు విచారణ అధికారులను బెదిరింపులకు గురిచేసేలా ఉన్నాయని ఎక్సైజ్ రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ ఒకరు తెలిపారు. రాంగోపాల్ వర్మపై కేసు వేస్తామని, అతని అరెస్ట్ ఖామని స్పష్టం చేశారు. ఎంతో సీరియస్‌గా కొనసాగుతున్న డ్రగ్ కేసును వర్మ తన వ్యాఖ్యలతో వక్రీకరిస్తున్నారని అన్నారు.

Excise officials association fires at Ram Gopal Varma

సిట్‌ను, ఎక్సైజ్ అధికారులను కించపరిచే విధంగా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. సెక్షన్ 50కింద వర్మపై తాము కేసు వేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసును విచారిస్తున్న కీలక అధికారిపై బాహుబలి3 సినిమా తీయాలంటూ అభ్యంతరకంగా రీతిలో వర్మ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడిందని అన్నారు.

కాగా, అకున్ సబర్వాల్ మానత్వం లేని మనిషి అని, డ్రగ్స్ కేసుల్లో ఉన్నవారి పేర్లు మీడియాకు లీక్ అయినందుకు ఆయనే బాధ్యత వహించాలంటూ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

టీఆర్ఎస్ నేతలున్నా వదిలేదు

Recommended Video

Subba Raju Reveals Star Family's Name In SIT Investigation

డ్రగ్స్ కేసులో విషయంలో స్పందించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.. డ్రగ్స్ కేసులో ఎంత పెద్దవారున్నా వదిలేదని అన్నారు. ఒక వేళ టీఆర్ఎస్ నేతలున్నా వదిలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ అధినేత వారసుల స్నేహితులే డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారని ఇటీవల డిగ్గీ ఆరోపించిన విషయం తెలిసిందే.

చట్ట ప్రకారమే వెళుతున్నాం: అకున్ సబర్వాల్

అతి ఏమీ చేయడం లేదని, డ్రగ్స్ కేసులో తాము చట్ట ప్రకారమే వెళుతున్నామని అకున్ సబర్వాల్ తెలిపారు. సినిమా రంగాన్ని టార్గెట్ చేశారనడం సరికాదన్నారు. ముందు ముందు అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. ఆధారాలుంటే ఎవరినైనా విచారిస్తామని అకున్ తెలిపారు.

నేనే వస్తా: పద్మారావు

డ్రగ్స్ వాడుతున్నట్లు తెలిస్తే పబ్బులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు హెచ్చరించారు. అవసరమైతే తానే స్వయంగా పబ్బుల్లో తనిఖీలు చేపడతానని స్పష్టం చేశారు.

పెద్దలెక్కడపోయారు: పొంగులేటి

డ్రగ్స్ వ్యవహారాన్ని తీవ్రవాదంగా చూడాలని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఎంత పెద్దవారినైనా వదలొద్దని అన్నారు. దర్యాప్తు తీరులో అనుమానం కలుగుతోందని.. బడా నిర్మాతలు, వారి పిల్లలు ఎక్కడపోయారని ఆయన ప్రశ్నించారు.

English summary
Excise officials association fires at Ram Gopal Varma for his comments on Akun Sabharwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X