వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రివ‌ర్గ విస్థ‌ర‌ణపై ఉత్కంఠ‌..! ఎన్టీఆర్ రికార్టును బ‌ద్ద‌లు కొట్టిన కేసీఆర్..?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ అఖండ విజ‌యం సొంతం చేసుకుంది. ప్ర‌త్య‌ర్ధి రాజ‌కీయ పార్టీల కుయుక్తుల‌ను తోసిరాజంటూ అత్య‌దిక సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. తెలంగాణ‌లో అత్య‌దిక స్థానాలు సాధించుకున్న ఏకైక పార్టీగా రికార్డు నెల‌కొల్పింది. దొర‌ల‌పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడి ప్ర‌జాస్వామ్య పాల‌న‌కు స్వాగ‌తం ప‌ల‌కాల‌న్న ప్ర‌తిప‌క్ష పార్టీల విజ్ఞ‌ప్తిని ప్ర‌జ‌లు నిర్ద‌ధ్వంగా తిర‌స్క‌రించి మ‌ళ్లీ గులాబీ పార్టీకే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. దీంతో తెలంగాణ‌లో తిరుగులేని పార్టీగా తెలంగాణ రాష్ట్ర స‌మితి మ‌రో సారి రుజువుచేసుకుంది.

 మంత్రి వ‌ర్గ విస్థ‌ర‌ణ‌లో ప్ర‌తిష్టంభన‌..! న‌రాలు తెగే ఉత్కంఠ‌లో ఆశావ‌హులు..!

మంత్రి వ‌ర్గ విస్థ‌ర‌ణ‌లో ప్ర‌తిష్టంభన‌..! న‌రాలు తెగే ఉత్కంఠ‌లో ఆశావ‌హులు..!

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాలు సాధించింది టీఆర్ఎస్ పార్టీ ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌ను విజ‌య‌వంతంగా తిప్పికొట్టింది. ప్ర‌భుత్వ విధానాల ప‌ట్ల తెలంగాణ ప్ర‌జానికంలో అస‌హ‌నం చోటుచేసుంద‌ని ప్ర‌తిప‌క్షాలు ప‌దేప‌దే చెప్ప‌డాన్ని అదికార గులాబీ పార్టీ జీర్ణించుకోలేక పోయింది. దీంతో ప్ర‌జా క్షేత్రంలోనే తేల్చ‌కుందామ‌ని నిర్ణ‌యం తీసుకున్న టీఆర్ ఎస్ సాహ‌సోపేతంగా అడుగులు వేసింది.

గులాబీ పార్టీకి ఫుల్ మెజారిటీ..! మంత్రి వ‌ర్గానికి కుద‌ర‌ని ముహూర్తం..!!

గులాబీ పార్టీకి ఫుల్ మెజారిటీ..! మంత్రి వ‌ర్గానికి కుద‌ర‌ని ముహూర్తం..!!

అనుకున్న‌ట్టే ఎన్నిక‌ల రూపంలో ప్ర‌జాక్షేత్రంలోకి వెళ్లి ఊహించ‌ని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఎవ‌రి స‌హాకారం లేకుండా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసే ఆదిఖ్యాన్ని సంపాదించుకుంది. దీంతో అదికార పార్టీ విధానాల‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్న ప్ర‌తిప‌క్షాల‌కు ఒక్క‌సారిగా చెక్ పెట్టింది గులాబీ పార్టీ. ఇక్క‌డి వ‌ర‌కు క‌థ సుఖాంతంగా ఉన్నా అపలు ట్విస్టు ఇక్కడే మొదలౌతోంది. అన్నీ అనుకూలిస్తున్నా మంత్రి వర్గ విస్థరణలో ముఖ్యమంత్రి ఎందుకు తాత్సారం చేస్తురనే అంశం అందరిలో ఉత్కంఠ నెలకొంది.

 అదే విస్త‌ర‌ణ ఆల‌స్యానికి కార‌ణ‌మా..? ఇంకా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం..!

అదే విస్త‌ర‌ణ ఆల‌స్యానికి కార‌ణ‌మా..? ఇంకా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం..!

మంత్రి వర్గ విస్థరణ ఆలస్యం అవుతుండడంతో ఆశావహులు నిరాశకు గురౌతున్నట్టు తెలుస్తోంది. మొదటి సారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కని వారు ఆ పదవులకోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి సారి కొన్ని త్యాగాలకు చేసినప్పటికి ఈసారి మాత్రం ఎట్టకేలకు తమకు మంత్రి పదవి కావాల్సిందేనని పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ మంత్రి మర్గ విస్తరణకు ఎందుకు ముహూర్తం కుదరడం లేదు..? ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మదిలో ఏముంది..?

 ఎన్టీఆర్ రికార్టును తిర‌గ‌రాస్తున్న కేసీఆర్..! వ‌చ్చే నెల‌లోనే విస్త‌ర‌ణ‌..!!

ఎన్టీఆర్ రికార్టును తిర‌గ‌రాస్తున్న కేసీఆర్..! వ‌చ్చే నెల‌లోనే విస్త‌ర‌ణ‌..!!

ఆనాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు నంద‌మూరి తార‌క రామారావు మొద‌టిసారి ముఖ్య‌మంత్రి ఐన సంద‌ర్బంలో చిన్న చిన్న లోపాల‌ను అదిగ‌ద‌మించ‌లేక‌పోయారు. అదే సంద‌ర్బంలో కొన్ని అంత‌ర్గ‌త విభేదాలు పార్టీలో గుప్పుమ‌న్నాయి. అప్ప‌ట్లో ప్ర‌భుత్వంలో ఏర్ప‌డిన అవ‌రోదాల‌ను అదిగ‌మించ‌డానికి మంత్రి వ‌ర్గాన్ని ఉన్న‌ప‌ళంగా ర‌ద్దు చేసారు ఆనాటి ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్. ర‌ద్దు చేసిన త‌ర్వాత సుమారు 18రోజుల వ‌ర‌కు మ‌ళ్లీ క్యాబినెట్ ను విస్థ‌రించ‌లేదు. అన్ని అవాంత‌రాల‌ను అదిగ‌మించిన త‌ర్వాత మ‌ళ్లీ క్యాబినెట్ ను పున‌రుద్ద‌రించారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎలాంటి అంత‌ర్గ‌త విభేదాలు లేక‌పోయిన‌ప్ప‌టికి, మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించ‌కుండా ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఆనాటి ఎన్టీఆర్ రికిర్డును తిర‌గ‌రాస్తున్నార‌నే అభిప్రాయాన్ని కొంత‌మంది నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఐతే అప్పుడు ముఖ్య‌మంత్రిగా ఒక్క రామారావు త‌ప్ప ఎవ‌రూ క్యాబినెట్ లో లేరు. కాని ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో పాటు హోం మంత్రి కూడా ప్ర‌మాణ స్వీకారం చేసారు. దీంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ పూర్తిగా లేద‌ని కూడా చెప్ప‌లేని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఏదేమైనా మంత్రివ‌ర్గ విస్థ‌ర‌ణ‌లో ఆనాటి ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు రికార్డును నేటి తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేక‌ర్ రావు తిర‌గ‌రాసారా అంటే అవున‌ని, ఏమో అనే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.

English summary
The Chief Minister late NTR was dismissed by the Cabinet due to internal deputes. After the cancellation, the cabinet has not been restored for nearly 18 days. While there are no internal differences in Telangana, some leaders are expressing the view that Chief Minister Chandrasekhar Rao is turning back the NTR Record from expanding the ministerial category.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X