• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇండియా చరిత్ర, సంస్కృతి చాలా ఇష్టం, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఇవాంకా ట్రంప్

By Narsimha
|

హైదరాబాద్:భారత్‌ చరిత్ర, సంస్కృతి అంటే తనకు ఎంతో ఇష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ చెప్పారు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2017లో పాల్గొనేందుకు మంగళవారం తెల్లవారుజామున ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్‌ చేరుకొన్నారు.

  GES 2017 Hyderabad Specialities : focusing on women Entrepreneurs

  ఇవాంకా టూర్: జీఈఎస్ సమ్మిట్‌‌లో 10 దేశాల నుండి మహిళలే, ప్రత్యేకతలివే

  జీఈఎస్ 2017 సమ్మిట్‌ను ఇవాంకా ట్రంప్ , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్ఐసిసిలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో ప్రపంచంలోని 1600 మంది ప్రతినిధులు హజరుకానున్నారు.

  ఇవాంకా టూర్: హైద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, ఈ ప్రాంతాల్లో వెళ్తే ఇబ్బందులే

  ఈ సదస్సుకు హజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంది.మరో వైపు ఈ సదస్సుకు హజరైన ఇవాంకా ట్రంప్ ఓ ఆంగ్ల జాతీయ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. జీఈఎస్ 2017 సమ్మిట్‌ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.

  ఇవాంకా టూర్: 1883లోనే టెలిఫోన్, విద్యుత్, ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రత్యేకతలివే!

  రెండు చోట్లే ఇవాంకా టూర్, హెలికాప్టర్‌లోనే మోడీ పర్యటన, ఎందుకంటే?

   భారత్ చరిత్ర, సంస్కృతి ఇష్టం

  భారత్ చరిత్ర, సంస్కృతి ఇష్టం

  భారత్‌ చరిత్ర, సంస్కృతి అంటే తనకు ఎంతో ఇష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన ఇండియా, అమెరికా కలిసి సాగితే ఎంతో చేయగలం. ఆర్థిక వృద్ధి, సంస్కరణలను ప్రోత్సహించడం, ఉగ్రవాదంపై పోరాడటం, భద్రత సహకారాన్ని పెంపొందించుకోవడం వంటి విషయమాల్లో మన ప్రాధాన్యాలు ఉమ్మడివని ఆమె అభిప్రాయపడ్డారు.

   సుష్మాస్వరాజ్‌తో చర్చించా

  సుష్మాస్వరాజ్‌తో చర్చించా

  గత సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యాను. నాకు . ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాల్లో పురోగతి విషయమై నా ఆశయాలను ఆమెతో పంచుకున్నాను.భారత్‌ పర్యటన పట్ల ఎంతో ఎక్సైటింగ్‌గా ఉన్నానని అని ఆమె అభిప్రాయపడ్డారు.

   మహిళల ప్రగతి కోసం కృషి

  మహిళల ప్రగతి కోసం కృషి

  భారత్‌, అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అవకాశాలను సృష్టించడం, పౌరులందరికీ ఆర్థిక స్వావలంబన కల్పించడం అతిపెద్ద సవాలు. ఇటు అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌, అటు భారత్‌లో నరేంద్రమోదీ పౌరులకు ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల ప్రగతి కోసం కృషి చేస్తున్నారని ఇవాంకా ట్రంప్ అభిప్రాయపడ్డారు.

  మహిళలు రాణిస్తే దేశాల అభివృద్ది

  మహిళలు రాణిస్తే దేశాల అభివృద్ది

  మహిళలు రాణిస్తే సమాజాలు, దేశాలు అభివృద్ది చెందుతాయని ఇవాంకా ట్రంప్ అభిప్రాయపడ్డారు. తొలిసారి ఈ సదస్సులో పాల్గొంటున్న వారిలో 50శాతం మంది మహిళలు ఉన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల సాధికారిత ఆవశ్యకతను చాటిచెప్పేందుకు ఈ సదస్సు ఓ అంతర్జాతీయ వేడుకగా నిలుస్తుందని నేను భావిస్తున్నానని ఇవాంకా ట్రంప్ చెప్పారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  On the eve of her visit to India, US President Donald Trump's daughter and adviser Ivanka Trump has told The Times of India that "as the world's largest democracies... there is much we can and should do together. We share common priorities, including promoting economic growth and reform, fighting terrorism, and expanding security cooperation."
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more