హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎందుకిలా: సాప్ట్‌వేర్ ఉద్యోగాలు వదిలేసి ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లుగా..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పల్లెటూర్లలో ఎక్కువగా వినిపించే సామెత 'చదువుకున్న వాడికంటే చదువులేనోడే నయం'. కానీ ఇప్పుడు మాత్రం కార్పోరేట్ ఉద్యోగం కన్నా క్యాబ్ డ్రైవర్ ఉద్యోగమే మేలంటున్నారు కార్పోరేట్ ఉద్యోగాలు చేసేవారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.

కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్స్ తమ ఉద్యోగాలను వదిలేసి మరీ ఓలా, ఉబెర్ లాంటి సంస్ధల కారు డ్రైవర్ పోస్టుల కోసం ఎగబడుతున్నారు. అయితే మీు మొహిత్ గురించి తెలుసుకోవాల్సిందే. బ్రిటన్‌లోని లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ నుంచి మొహిత్ కార్పొరేట్ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశాడు. అనంతరం బెంగుళూరులోని సీమెన్స్, హెచ్ఎస్‌బీసీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశాడు.

గత ఏప్రిల్‌లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఉద్యోగానికి రాజీనామా చేసి 'ఉబెర్' క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు. ఈ 28 ఏళ్ల మొహిత్ ఇప్పుడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడతను నెలకు కూ. 80 వేలకు సంపాదిస్తున్నానని తెలిపాడు.

Executives quit top jobs, join Uber and Ola as drivers

కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం వదిలేసేందుకు తానేమీ బాధ పడడం లేదని ఏదోక రోజు సొంతంగా స్టార్టప్ కంపెనీ ప్రారంభిస్తానని దీమాగా చెబుతున్నాడు. చాలా మంది కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను వదిలేసి ఈ వృత్తినే ఎంచుకుంటుంటే మరికొంత మంది పార్ట్ టైమ్‌గా ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు.

యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ సేవలు అందుబాటులోకి రావడంతో ఈ రంగంలో చాలా మంది నెలకు లక్ష రూపాయలకు వరకు సంపాదిస్తున్నారు. ఓ సాప్ట్‌వేర్ సంస్ధలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న రఘునాథ్ ఆర్ వారానికి మూడు రోజుల పాటు ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం గురుంచి రఘనాథ్ మాట్లాడుతూ తనకు ఇష్టమైన సమయంలో డ్రైవర్ అవతారం ఎత్తుతానని, తన గౌరవానికి ఎటువంటి భంగం కలగడం లేదని అంటున్నారు. తన సొంత చెవర్లెట్ ఆప్ర్టా మాగ్నమ్ కారునే ఉబెర్ భాగస్వామ్యంతో డ్రైవ్ చేస్తున్నట్టు తెలిపారు.

బెంగుళూరులోని హెచ్‌పీ కెంపనీలో ఎనిమిదేళ్లు టెక్నికల్ ఇంజనీర్ గా పనిచేసిన దీపక్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఏడాది క్రితం ఓలా డ్రైవర్‌గా చేరాడు. 33 ఏళ్ల దీపక్ మాట్లాడుతూ భారత్‌కు చెందిన కంపెనీలో పనిచేయాలన్న ఉద్దేశంతో ఓలాను ఎంచుకున్నట్టు తెలిపారు. తన కారులో వై-పై ఉందని తెలిపాడు.

జియోగ్రఫీ, రిమోట్ సెన్సింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన అరుణ్ కుమార్ యాదవ్ ఓలా డ్రైవర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 40 వేలు సంపాదిస్తున్నాడు. తాను క్యాబ్ డ్రైవర్ అవుతానని తెలిస్తే తన చదువుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే వాడిని కాదని తన తండ్రి జోక్ చేస్తుంటారని యాదవ్ తెలిపాడు.

ఇలా చాలా మంది కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్‌లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరి ఈ క్యాబ్ డ్రైవర్ల వృత్తిని ఎంచుకుంటున్నారు. ఈ క్యాబ్ డ్రైవర్ వృత్తిని ఎంచుకోవడానికి ముఖ్య కారణం మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకపోవడమేనని అంటున్నారు.

English summary
Mohit R is an MBA in corporate finance from Leeds Metropolitan University, UK. He began his corporate career in Siemens, moved to HSBC and his last stint was with Ernst & Young in their project management team in Bengaluru. In April, he quit E&Y to become a driver on taxi-hailing app Uber's platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X