వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Exit polls 2018: తెలంగాణలో కేసీఆర్ నిలబడతారా? ఈ ఐదు రాష్ట్రాల్లో ఎవరు?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11వ తేదీన రానున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్‌లు వరుసగా మూడుసార్లు గెలిచి, నాలుగోసారి ప్రజా తీర్పు కోరుతున్నారు. రాజస్థాన్‌లో వసుంధరా రాజే రెండోసారి ప్రజా తీర్పు కోరుతున్నారు. తెలంగాణ వచ్చిన మొదటిసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఆయన మళ్లీ ప్రజా తీర్పు కోరుతున్నారు.

Newest First Oldest First
4:09 PM, 7 Dec

ఎన్నికలకు ముందు ప్రీ పోల్ సర్వే ఫలితాలు ఎంతో ఆసక్తిని రేపుతాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు అంటే ప్రజల్లో మరింత ఆసక్తి. ఎగ్జిట్ పోల్ సర్వేలను ఆధారంగా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో చాలామంది అంచనా వేసుకుంటారు.
4:08 PM, 7 Dec

ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాంలలో ఎన్నికలు ముగిశాయి. తెలంగాణ, రాజస్థాన్‌లలో ఈ రోజు (7-12-2018) సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ప్రారంభమవుతాయి.

తెలంగాణ: తెలంగాణలో 119 అసెంబ్లీ, 17 లోకసభ నియోజకవర్గాలకు గాను 2014లో తెరాస 11 లోకసభ స్థానాలు, 63 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. 2014 జూన్ 2వ తేదీన కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88 జనరల్, 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వ్.

Exit polls 2018 live updates: Who will rule the five state assemblies?

మధ్యప్రదేశ్: గత నవంబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్ ఎన్నికలు జరిగాయి. 75 శాతం పోలింగ్ నమోదయింది. 230 స్థానాలకు గాను బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ 229 స్థానాల్లో బరిలో నిలిచింది. మరో స్థానంలో శరద్ యాదవ్ లోక్ తంత్రిక్ పార్టీకి కేటాయించింది. ఇక్కడ మేజిక్ ఫిగర్ 116. 230 అసెంబ్లీ స్థానాలకు గాను 82 జనరల్, 35 ఎస్సీ, 47 ఎస్టీ రిజర్వ్.

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో గత నవంబర్ నెల 12, 20వ తేదీలలో రెండు రోజుల పాటు పోలింగ్ నిర్వహించారు. 70 శాతం పోలింగ్ నమోదయింది. మొదటి ఫేజ్‌లో 8 జిల్లాల్లోని 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ మొత్తం 72 సీట్లలో పోటీ చేసింది. 2003 నుంచి ఇక్కడ బీజేపీనే అధికారంలో ఉంది. 2013లో 77.40 శాతం నమోదయింది. ఇప్పుడు 2018లో ఒక శాతం తగ్గింది.

మిజోరాం: మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాలకు గాను నవంబర్ 28వ తేదీన ఎన్నికలు జరిగాయి. మిజోరాంలో 7.68 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 7.68 లక్షల ఓటర్లలో 3.93 లక్షల మంది మహిళలు, 3.74 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 2008 నుంచి ఇక్కడ కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు తదుపరి ప్రభుత్వంలో జోరమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 80 శాతం ఓటింగ్ నమోదయింది. 2013లో ఇక్కడ 82.35 శాతం ఓటింగ్ నమోదయింది.

రాజస్థాన్: రాజస్థాన్‌లో వసుంధరా రాజే ప్రభుత్వం విషమ పరీక్షను ఎదుర్కొంటోంది. ఇక్కడ ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రెండోసారి గెలుపు కోసం బీజేపీ ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ గెలుపుపై ధీమాగా ఉంది. ఇక్కడ ప్రతి అయిదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంది.

English summary
Counting of votes for all the five assembly states will be held on December 11. BJP leaders, Shivraj Singh Chauhan and Raman Singh seeking mandate for the fourth term in Madhya Pradesh and tribal-state Chhattisgarh. In Rajasthan, Vasundhara Raje Scindia government seeking a mandate for the second consecutive term and for the third term overall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X