వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్ పోల్ ఫలితాలు: తెలంగాణలో కేసీఆర్‌కు షాక్! బీజేపీకి 1-2 స్థానాలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. తెలంగాణలో కేసీఆర్‌కు షాక్..!! | Oneindia Telugu

హైదరాబాద్: CNN న్యూస్ 18-IPSOS ఎగ్జిట్ పోల్ సర్వేలో తెలంగాణ లోకసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిదే హవా అని తేలింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 1, కాంగ్రెస్ - టీడీపీ కూటమి 21 సీట్లు గెలిచింది. ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య సెంచరీ దాటింది. దీంతో తెరాస సులువుగా 16 సీట్లు గెలుచుకుంటుందని భావించారు.

అయితే CNN న్యూస్ 18-IPSOS ఎగ్జిట్ పోల్ సర్వేలో తెరాసకు 12-14 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 1-2, బీజేపీకి 1-2 సీట్లు వచ్చాయి. మజ్లిస్ పార్టీ ఒక స్థానంలో (హైదరాబాద్) గెలవనుంది. కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లలోని నాలుగు స్థానాల్లో ఏవైనా రెండు స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని మొదటి నుంచి భావిస్తున్నారు. మల్కాజ్‌గిరి, ఖమ్మం తదితర స్థానాలపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.

ఏపీలో వైసీపీ, టీడీపీ హోరాహోరీ: TDP 10-12 సీట్లు, YSRCP 13-14 సీట్లు, అసెంబ్లీ స్థానాలు...ఏపీలో వైసీపీ, టీడీపీ హోరాహోరీ: TDP 10-12 సీట్లు, YSRCP 13-14 సీట్లు, అసెంబ్లీ స్థానాలు...

Exit Polls 2019: TRS expected to win 12-14 seats, BJP may win 2

ఆర్జీ ఫ్లాష్‌ టీం తెరాసకు 14-16, కాంగ్రెస్‌కు 0-2, మజ్లిస్‌కు 1, బీజేపీకి 0, న్యూస్ 18 తెరాసకు 12-14, కాంగ్రెస్‌కు 1-2, మజ్లిస్‌కు 1, బీజేపీకి 1-2, ఎన్డీటీవీ తెరాసకు 12, కాంగ్రెస్‌కు 2, మజ్లిస్ పార్టీ 1, బీజేపీకి 1, ఇండియా టుడే తెరాసకు 10-12, కాంగ్రెస్‌కు 1-3, మజ్లిస్‌కు 1, బీజేపీకి 1, సీ ఓటర్‌ తెరాసకు 14, కాంగ్రెస్‌కు 1, మజ్లిస్‌కు 1, బీజేపీకి 1, టైమ్స్ నౌ తెరాసకు 13, కాంగ్రెస్‌కు 2, మజ్లిస్‌కు 1, బీజేపీకి 1, టుడేస్‌ చాణక్య తెరాసకు 12-16, కాంగ్రెస్‌కు 1-2, మజ్లిస్‌కు 1, బీజేపీకి 1 సీటు గెలుస్తాయని చెప్పింది.

English summary
K Chandrashekar Rao-led Telangana Rashtra Samiti is expected to win 12-14 out of the 17 constituencies in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X