వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్పంచులకు అదనపు బాద్యతలు..! కరెంటు బిల్లు కట్టకపోతే వేటు తప్పదన్న సీఎం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 'తెలంగాణ పురోభివృద్ధిలో విద్యుత్ సంస్థలది చాలా కీలకమైన పాత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండేది. నేడు తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇందులో విద్యుత్ అధికారులు, ఉద్యోగుల శ్రమ, చిత్తశుద్ధి ఉంది. నేడు తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందించుకోగలుగుతున్నాము. మెరుగైన విద్యుత్ వల్ల పారిశ్రామికాభివృద్ధి జరిగింది. విద్యుత్ సంస్థలు మరింతగా వృద్ది చెందాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవద్దు. అదే సమయంలో తెలంగాణలో కనురెప్పపాటు కూడా కరెంటు పోవద్దు. అందుకోసం ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తాం' అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

గ్రామ సౌభాగ్యం సర్పంచులదే..! అదనపు బాద్యతలు అప్పజెప్పిన సీఎం..!!

గ్రామ సౌభాగ్యం సర్పంచులదే..! అదనపు బాద్యతలు అప్పజెప్పిన సీఎం..!!

అంతే కాకుండా 'గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పెద్ద మొత్తంలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడం దారుణం. వాడిన కరెంటుకు తప్పక బిల్లు చెల్లించాలి. ఇప్పటి నుంచి ప్రతీ నెలా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.బీ తప్పక బిల్లులు చెల్లించాలి. సకాలంలో కరెంటు బిల్లు కట్టకపోతే గ్రామాల్లో అయితే సర్పంచ్, గ్రామ కార్యదర్శి, మున్సిపాలిటీ అయితే చైర్ పర్సన్, కమిషనర్లపై వేటు తప్పదు. ఇంతకుముందు పేరుకుపోయిన పాత బకాయిలను ఒన్ టైమ్ సెటిల్మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. విద్యుత్ సంస్థల బకాయిలను జీరో సైజుకు తెస్తాం. గ్రామాలు, పట్టణాల్లో వీధి లైట్ల వాడకంలో కూడా క్రమశిక్షణ రావాలి. పగలు కూడా లైట్లు వెలగకుండా చూసుకోవాలి' అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఆదాయం పడిపోకూడదు.. ఖర్చులు పెరిగిపోకూడదు..! దిశానిర్ధేశం చేసిన కేసీఆర్..!!

ఆదాయం పడిపోకూడదు.. ఖర్చులు పెరిగిపోకూడదు..! దిశానిర్ధేశం చేసిన కేసీఆర్..!!

కాగా 'ప్రభుత్వ శాఖల్లో కూడా క్రమశిక్షణ రావాలి. అనేక ప్రభుత్వ శాఖలు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. ఇకపై ప్రభుత్వ శాఖల బిల్లులను ఆయా శాఖలకు కేటాయించే బడ్జెట్ నుంచి ఆర్థిక శాఖే నేరుగా చెల్లిస్తుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వాడే విద్యుత్ కోసం ప్రీ పెయిడ్ మీటర్లను అమర్చాలి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందివ్వడానికి, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం బడ్జెట్లోనే ప్రత్యేక గ్రాంటు కేటాయించి, ప్రతీ నెలా విధిగా విద్యుత్ సంస్థలకు అందిస్తుంది. విద్యుత్ సంస్థలు తమ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి వీలుగా నిధులు సమకూర్చుకోవడానికి అవసరమైన చోట ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది' అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఆదర్శంగా ఉంగాలి..! అప్పుడే గౌరవం ఉంటుందని అదికారులకు సీఎం సూచనలు..!!

ఆదర్శంగా ఉంగాలి..! అప్పుడే గౌరవం ఉంటుందని అదికారులకు సీఎం సూచనలు..!!

ఇదిలా ఉండగా 'గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తక్షణం చేయాల్సిన పనులకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నది. 60 రోజుల పాటు అమలయ్యే కార్యాచరణలో ఏడు రోజుల పాటు 'పవర్ వీక్' కూడా ఉంటుంది. ఆ సమయంలో వంగిన స్తంబాలను సరిచేయడం, లైన్లను సరిచేయడం, బిల్లులు పెండింగులో లేకుండా చేయడం తదితర పనులను నిర్వహిస్తాం. అదే సందర్భంలో సదరు గ్రామానికి, పట్టణానికి వీధిలైట్ల కోసం ఎంత కరెంటు అవసరమవుతుందీ, ఎంత బిల్లు వస్తుందీ అనే విషయాలను శాస్త్రీయంగా మదింపు చేయాలి' అని ముఖ్యమంత్రి చెప్పారు. 'హైదరాబాద్ తో పాటు ఇతర పట్టణాల్లో సబ్ స్టేషన్లు పెట్టడానికి, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికోసం పట్టణాలు, నగరాల్లో చేసే లే అవుట్లలో ఖచ్చితంగా విద్యుత్ అవసరాలకు తగిన స్థలం కేటాయించేలా ప్రభుత్వం విధానం తెస్తుంది' అని సిఎం చంద్రశేఖర్ రావు వెల్లడించారు.

విద్యుత్ బిల్లులు ఆపొద్దు..! సర్పంచులు చొరవ చూపకపోతే కఠిన నిర్ణయాలన్న గులాబీ బాస్..!!

విద్యుత్ బిల్లులు ఆపొద్దు..! సర్పంచులు చొరవ చూపకపోతే కఠిన నిర్ణయాలన్న గులాబీ బాస్..!!

ఎత్తిపోతల పథకాలకు ఏ సమయంలో ఎంత విద్యుత్ అవసరం? దాన్ని ఎలా సమకూర్చాలి? అనే విషయంపై నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై సరైన అంచనాలతో ముందుకుపోవాలని సిఎం చంద్రశేఖర్ రావు చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు ఏర్పడిన డిమాండును తట్టుకునేందుకు, తక్కువ ధరకు లభ్యమయ్యే సోలార్ విద్యుత్ సమకూర్చుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి, ప్రస్తుతం వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం టెండర్లు పిలవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖకు ఎప్పుడు అవసరం ఏర్పడినా తీర్చగలిగే ఆర్థిక విధానం రూపొందించాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కోరారు.

English summary
Chief Minister Chandrasekhar Rao conducted a high-level review on the power department at Pragati Bhavan. Do not face financial difficulties under any circumstances. Telangana at the same time do not even blink. We will do everything we can to do it in government terms, ”Chief Minister Chandrasekhar Rao said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X