ప్రియుడినే భర్త అని చెప్పి మకాం పెట్టింది.. చివరకు భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కింది
హైదరాబాద్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. భార్య లేదా భర్తకు ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధాలు దారుణాలకు దారితీస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. దీంతో భార్యపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ప్రియుడినే భర్త అంటూ అద్దెకు దిగింది..
హైదరాబాద్ నగరంలోని రహమత్‌నగర్ పరిధిలో ఉంటున్న జవాన్ భార్య అద్దె ఇంట్లో ఉంటోంది. అయితే, ప్రియుడినే భర్తగా పనిచయం చేసి ఇల్లు అద్దెకు తీసుకోవడం గమనార్హం. భర్త ఆర్మీలో ఉద్యోగం కావడంతో ఎప్పుడో వస్తాడులే.. అప్పుడు ఏదో ఒకటి చేద్దాం అన్నట్లుగా ఆమె.. ప్రియుడితో తన అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోంది.

ఏకాంతంగా ప్రియుడితో.. భర్తకు రెడ్ హ్యాడెడ్‌గా చిక్కింది
అయితే, ఆకస్మాత్తుగా ఇంటికొచ్చిన జవాన్.. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్లను ఇంట్లోనే ఉంచి తాళం వేసిన జవాన్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జవాన్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. జవాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రియురాలి కోసం మైనర్‌పై కత్తితో దాడి చేసి వీడియో.. చివరకు
తన ప్రేమికురాలిని ఇబ్బందిపెడుతన్నావంటూ ఓ మైనర్ బాలుడిపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేశాడు. అంతేగాక, సెల్ఫీ వీడియో తీసి ప్రియురాలికి పంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్ సింగ్ నగర్లో నివసించే ఓ బాలుడు(16) స్థానికంగా ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి కొద్ది రోజులుగా అదే ప్రాంతానికి చెందిన బాలిక(16) వెంటపడుతున్నాడు. కాగా, ఆ విద్యార్థిని లంగర్‌హౌస్ సమీపంలోని ప్రశాంత్ నగర్లో నివసించే ఇంటర్ విద్యార్థి రోహన్(19)తో ప్రేమాయణం సాగిస్తోంది.
తన ప్రేమికురాలిని వేధిస్తున్నాడని తెలిసి ఆగ్రహానికి గురైన రోహన్ తన స్నేహితులు సంజయ్, అభిషేక్, నరేష్ లతో కలిసి పదో తరగతి విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. ఓ వైపు రక్తం కారుతున్నా అతనితో తాను ఇంకెప్పుడు అలా ప్రవర్తించనని చెప్పించి.. ఫొటోలు, వీడియోలు తీశాడు. దాడి విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులు రోహన్, సంజయ్‌లపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.