వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాహేతర బంధం: రూ.40లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తే ప్రాణం తీశాడు

|
Google Oneindia TeluguNews

సూర్యాపేట: అదనపు కట్నానికి మరో మహిళ బలైంది. పెళ్లి సమయంలోనే భారీగా కట్నకానుకలు ఇచ్చి వివాహం చేసినా.. ఆ కట్న పిశాచులకు చాలా లేదు. దీంతో ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేసి చివరకు ప్రాణాలు తీశారు. పెళ్లైన ఏడాదికే ఈ వార్త విన్న ఆమె తల్లిదంత్రులకు కన్నీరే మిగిలింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా జార్జిగూడెంలో చోటు చేసుకుంది.

భారీ కట్నం ఇచ్చి పెళ్లి..

భారీ కట్నం ఇచ్చి పెళ్లి..

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన శంకర్ తన కుమారై భవానిని సూర్యాపేట జిల్లా జార్జిరెడ్డిగూడెంకు చెందిన కుంకుడుపాలెం కిరణ్‌కు ఇచ్చి ఆరునెలల క్రితం వివాహం చేశారు. సూర్యాపేట ఎస్పీ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కిరణ్‌కు భారీ(రూ.40లక్షలు)గా కట్నం ఇచ్చారు.

 అడిగినవన్నీ ఇచ్చారు..

అడిగినవన్నీ ఇచ్చారు..

పెళ్లి సమయంలో కట్నం, లాంఛానలే కాకుండా ఈ ఆరునెలల్లో అడిగినవన్నీ ఇచ్చారు భవాని తల్లిదండ్రులు. ఈ మధ్యే తమ కూతురు తల్లి కాబోతుందనే వార్తతో వారి ఆనందానికి అవధుల్లేవు. కిరణ్, భవాని సూర్యాపేట ఏరియా ఆసుపత్రి సమీపంలో అద్దెకు ఉంటున్నారు.

 మరో మహిళతో సంబంధం..

మరో మహిళతో సంబంధం..

మరొక మహిళతో సంబంధం పెట్టుకున్న కిరణ్ భార్య భవానిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడని.. మరో ఇద్దరితో కలిసి తమ బిడ్డను చంపారని భవాని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఘటనాస్థలంలో దొరికిన కిరణ్ స్నేహితుడి సెల్‌ఫోనే సాక్ష్యమని చెప్పారు.

 చంపేసి..

చంపేసి..

భవాని మృతికి కొన్ని గంటల ముందు ఆమె దగ్గరే ఉన్నామని, తాము అక్కడి నుంచి భవనగిరి బయలుదేరాక దిండుతో నొక్కి చంపారని బాధితురాలి తల్లిదండ్రులు వాపోతున్నారు. భవానీని చంపి తర్వాత మద్యం సేవించేందుకు డబ్బులు కావాలని కిరణ్ మెసేజ్ పెట్టాడని చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A man killed his wife due to his extramarital affair, in Suryapet district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X