హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారణం ఇదీ: సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్సలు బంద్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మోహిదీపట్నంలోని సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో వరుసగా నాల్గవ రోజు కూడా శస్త్రచికిత్సలు జరగలేదు. దీంతో ఆసుపత్రిలోని నీటి సరఫరాపై అధికారులు ఆరా తీశారు. ఆసుపత్రిలోని నీటి నమూనాలను వాటర్ బోర్డు అధికారులు సేకరించారు. నీటి సరఫరాకు

అంతరాయం ఏర్పడటంతో గత మూడు రోజులుగా ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులు అవస్థలు పడుతున్నారు. రంగుమారిన నీరు సరఫరా కావడంతో నీటి నమూనాలను పరీక్షల కోసం పంపించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వినోద్ కుమార్ చెప్పారు. ఆపరేషన్లు జరిపే సమయంలో పరికరాలకు స్టెరిలైజేషన్ లేకపోవడం వల్ల రోగులకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి.

నీటి పరీక్షల రిపోర్టు రాగానే, ఆపరేషన్లు నిర్వహిస్తామని చెప్పారు. సోమవారం నుంచి యాథావిధిగా శస్త్రచికిత్సలు జరిపేందుకు ప్రయత్నిస్తామన్నారు. కంటి ఆపరేషన్ల విషయమై సోమవారం తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు ప్రకటించడంతో రోగులు ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టారు.

కారణం ఇదీ: సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్సలు బంద్

కారణం ఇదీ: సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్సలు బంద్

నీటి సరఫరా కాకపోవడంతో శనివారం సైతం శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో ప్రతి రోజు దాదాపు 60 ఆపరేషన్లు జరుగుతాయి. వీటిలో 50 శుక్లాల చికిత్సలు కాగా, 10 వరకు ఇతర శస్త్రచికిత్సలు ఉంటాయి.

కారణం ఇదీ: సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్సలు బంద్

కారణం ఇదీ: సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్సలు బంద్

ఈ ఆసుపత్రికి ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్స్ నుంచి నీటి సరఫరా జరుగుతుంది. మంగళవారం ఫిల్టర్ బెడ్స్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ సమాచారం ఆసుపత్రి వర్గాలకు తెలియదు.

కారణం ఇదీ: సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్సలు బంద్

కారణం ఇదీ: సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్సలు బంద్

బుధవారం ఉదయం రోగులకు ఆపరేషన్లు కోసం సిద్ధం చేసిన నైద్యులు, నీరు అందుబాటులో లేకపోవడంతో శస్త్రచికిత్సలు జరగవని అప్పటికప్పుడు వైద్యలు ప్రకటించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కారణం ఇదీ: సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్సలు బంద్

కారణం ఇదీ: సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్సలు బంద్

గురువారం జలమండలి అధికారులు నీటి సరఫరాను పునరుద్ధరించినా రంగు మారిన నీరు రావడంతో శస్త్రచికిత్సలు జరగలేదు. శుక్రవారం సరఫరా అయిన నీరు రంగు మారి ఉండటంతో ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు జరపడం సాధ్యం కాదని వైద్యులు ప్రకటించారు. దీంతో ఈ నెల 7 నుంచి ఆపరేషన్ల కోసం ఆసుపత్రిలో ఉన్న రోగులు వారి సహాయకులు ఇంటి ముఖం పట్టారు.

English summary
Eye operations cancel in Sarojini devi eye hospital at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X