వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్‌బీఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్.!లోన్ల పేరుతో ఘరానా మోసం.!14మంది కేటుగాళ్ల అరెస్ట్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రజలను మోసం చేసేందుకు ఉన్న మార్గాలపై కేటుగాళ్లు రీసెర్చ్ చేస్తున్నారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. అంత లోతుగా ఆలోచించి అమాయకులను మోసం చేస్తున్నారు మోసగాళ్లు. రోజుకో రూపంలో, పూటకో వేశంలో ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని కొత్త కొత్త మార్గాలను అణ్వేషిస్తున్నారు పోరంబోకు యెదవలు. ఉన్నత చదువులు చదుకున్న వారు కూడా షార్ట్ రూట్ లో డబ్బులు సంపాదించొచ్చని తమ సాంకేతిక నైపుణ్యాన్ని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. అచ్చం ఇలాంటి మోసాన్ని బట్టబయలు చేసారు సైబరాబాద్ పోలీసులు.

ఎస్‌బీఐ బ్యాంకు లోన్ల నకిలీ దందా.. ఆన్ లైన్ మోసగాళ్లను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు

ఎస్‌బీఐ బ్యాంకు లోన్ల నకిలీ దందా.. ఆన్ లైన్ మోసగాళ్లను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు

ఎస్‌బీఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ నుంచి ఎస్‌బీఐ బ్యాంక్ ఉద్యోగులమంటూ అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెట్టి కోట్లు దండుకుంటున్న14 మంది ఘరానా ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. కొందరు వ్యక్తులు ఢిల్లీ కేంద్రంగా నగరంలో ఎస్‌బిఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్నారనే పక్క సమాచారం తెలుసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రైడ్ చేసి 14 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టు.. 14మంది ఘరానా ముఠా అరెస్ట్..

సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టు.. 14మంది ఘరానా ముఠా అరెస్ట్..

అనంతరం కాల్ సెంటర్‌ ఖాతాల్లోని లక్షల రూపాయల నగదును ఫ్రీజ్ చేశారు. దేశంలోనే అతిపెద్ద సైబర్‌ మోసాన్ని ఛేదించినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఎస్‌బీఐ ధనీ బజార్‌, ద లోన్ ఇండియా, లోన్‌ బజార్ పేర్లతో నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. స్ఫూపింగ్‌ యాప్‌ ద్వారా ఎస్‌బీఐ అసలైన కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. ఓ ముఠా ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఎస్‌బీఐ నకిలీ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.

అచ్చం కస్టమర్ కేర్ ప్రతినిదుల్లా కాల్.. అమాయక ప్రజలకు కుచ్చుటోపి

అచ్చం కస్టమర్ కేర్ ప్రతినిదుల్లా కాల్.. అమాయక ప్రజలకు కుచ్చుటోపి

ఈ కాల్‌సెంటర్‌ నుంచి దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 33 వేల కాల్స్ చేసి కోట్ల రూపాయలు కాజేసినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదైనట్లు స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఎస్‌బీఐ ఏజెంట్ల నుంచి ఖాతాదారుల వివరాల తీసుకొని క్రెడిట్‌కార్డు దారుల నుంచి ముఠా డబ్బులు కాజేస్తున్నట్లు చెప్పారు. అసలైన ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ వచ్చినట్లు భ్రమింప జేసేందుకు స్ఫూఫింగ్‌ యాప్‌ వాడుతున్నారని, ఈ యాప్‌ వాడకంలో ఫర్మాన్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడని సీపీ తెలిపారు. 1860 180 1290 అనే నంబరును స్ఫూపింగ్ చేస్తున్నట్లు వివరించారు. 14 మంది నిందితులను అరెస్టు చేసి 30సెల్‌ఫోన్లు, 3ల్యాప్‌టాప్‌లు, కారు, బైకు, 1 రూటర్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

మోసపోవద్దంటున్నసీపి స్టీఫెన్ రవీంద్ర.. అనుమానం వస్తే సైబర్ క్రైం సెంటర్ కి కాల్ చేయాలన్ని సీపి

మోసపోవద్దంటున్నసీపి స్టీఫెన్ రవీంద్ర.. అనుమానం వస్తే సైబర్ క్రైం సెంటర్ కి కాల్ చేయాలన్ని సీపి

ఇదిలా ఉండగా ధనీ లోన్‌ బజార్‌ పేరుతో రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అభిషేక్ మిశ్రా నకిలీ యాప్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. నకిలీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యాక వ్యక్తిగత వివరాలు తీసుకొని ఆ తర్వాత రుణం మంజూరైనట్లు చెబుతారని, ప్రొసెసింగ్‌ ఫీజు పేరిట అధిక మొత్తంలో నగదు తీసుకుంటున్నారని వివరించారు. నిందితుల వద్ద నుంచి 17 స్మార్ట్ ఫోన్లు, 20 బేసిక్ ఫోన్లు, 3ల్యాప్‌టాప్‌లు, 5సిమ్‌కార్డులు, 3ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్155260 కు కానీ, 100 కానీ, 9490617310 సైబరాబాద్ సైబర్ క్రైమ్ వాట్సాప్ నంబర్ కు వాట్స్అప్ చేయవలసిందిగా స్టీఫెన్‌ రవీంద్ర కోరారు.

English summary
Cyberabad police have arrested a 14-member Gharana gang for allegedly defrauding innocent people like SBI Bank employees from a fake call center in the name of SBI Bank and pushing them behind bars.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X