హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సొంత టెలిఫోన్ ఎక్స్ఛేంజీ: వందలాది నకిలీ క్రెడిట్ కార్డులు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సైబరాబాద్‌లో నకిలీ ఓటర్‌ ఐడీ, పాన్‌ కార్డులు తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంగళవారం పోలీసులు దాడులు చేసి ముఠా నుంచి భారీగా నకిలీ ఓటర్‌ ఐడీ, పాన్‌ కార్డులు స్వాధీనం చేసుకుని, ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సహా 12 మంది అరెస్ట్ చేశారు.

సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ ఆ వివరాలను వెల్లడించారు. ఈ నకిలీ కార్డులను ఉపయోగించి బ్యాంకుల నుంచి వందల సంఖ్యలో క్రెడిట్ కార్డులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్‌రెడ్డి ముఠాకు సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Fake cards manufacturing gang nabbed

నకిలీ కార్డులను తయారు చేయడానికి పేర్లు, ఫొటోలను సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్లలో సేకరించి, ప్రత్యేక టెలిఫోన్‌ ఎక్స్చైంజ్‌ తయారు చేసుకుని ఈ నకిలీ దందా నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫేస్‌బుక్‌ల నుంచి ఫొటోలు తీసుకుని నకిలీ క్రెడిట్ కార్డులను సృష్టించినట్లు పోలీసులు కనిపెట్టారు

ఇదిలావుంటే, కరీంనగర్‌, హైదరాబాద్‌లలో పలు దొంగతనాలకు పాల్పడిన ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. వేములవాడకు చెందిన నామాల నరేందర్‌ను అరెస్టు చేసి, ఆయన వద్ద నుంచి 13 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏడు బైక్‌లు, అయిదు తులాల బంగారం, ఒక బొలేరో, ఒక మారుతీకారును స్వాధీనం చేసుకున్నారు.

English summary
Cyberabad police arrested fake credit cards and voter Id cards manufacturing gang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X