వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీస్ కమిటీ మెంబర్.. ఏసీపీ, డీసీపీ, ఎస్పీనంటూ హల్‌చల్‌! చివరికి ఏం జరిగిందంటే?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోలీసుశాఖలో ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారిగా మిత్రులు, బంధువుల వద్ద చెప్పుకొంటూ.. ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మోసం చేస్తున్న ఓ సూడో పోలీస్ ఆట కట్టించారు హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.

న్యాయం కోసం వస్తే... మాయమాటలు చెప్పి రేప్ చేసిన పోలీసు అధికారి!న్యాయం కోసం వస్తే... మాయమాటలు చెప్పి రేప్ చేసిన పోలీసు అధికారి!

టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధా కిషన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన రాఘవేంద్ర సత్యపాల్‌ జార్ఖర్‌ ఓ ప్రైవేటు ఇనిస్టిట్యూట్‌లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసేవాడు.

ఇద్దరు బాలికలను రేప్ చేసి.. చెరో రూ.5 చేతిలో పెట్టాడుఇద్దరు బాలికలను రేప్ చేసి.. చెరో రూ.5 చేతిలో పెట్టాడు

పీస్ కమిటీలో మెంబర్‌గా చేరి...

పీస్ కమిటీలో మెంబర్‌గా చేరి...

రాఘవేంద్రకు చిన్నప్పటి నుంచి పోలీసు అధికారి కావాలనే కోరిక బలంగా ఉండేది. చుదువు అయిపోయిన తరువాత 1990, 1992లో పోలీస్‌ ఉద్యోగానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. 2004లో కాచిగూడ పోలీసులు ఏర్పాటు పీస్‌ కమిటీలో మెంబర్‌గా చేరాడు. పోలీసులకు నమ్మకంగా ఉంటూ సమాచారం చేరవేయడం పీస్‌ కమిటీ మెంబర్ల పని. ఆ విధంగా పోలీసులు నిర్వహించే అనేక కార్యక్రమాల్లో రాఘవేంద్ర చురుగ్గా పాల్గొనేవాడు. పోలీసు అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించేవాడు. పోలీసుల పనితీరును దగ్గరగా గమనిస్తూ.. పోలీస్‌ డిపార్టుమెంట్‌పై బాగా అవగాహన పెంచుకున్నాడు.

 సొంతగా యూనిఫాం, ఐడీ కార్డులు...

సొంతగా యూనిఫాం, ఐడీ కార్డులు...

2013లో రాఘవేంద్రకు పోలీస్‌ ఉన్నతాధికారి అవతారమెత్తి చెలామణీ కావాలనే ఆలోచన వచ్చింది. దీంతో ఎస్పీ స్థాయి యూనిఫాం, డీసీపీ స్థాయి యూనిఫాం కుట్టించాడు. అతని కారుపై పోలీసు ఉన్నతాధికారులు వాడే ఎర్రటి బుగ్గ సైరన్‌ కూడా బిగించాడు. కారుకు ఇరువెపులా పోలీస్‌ అని రాయించాడు. ఇంటి బయట పోలీస్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా రాయించుకొని.. ఇతరులకు లోనికి ప్రవేశం లేదు అని బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు. పోలీసు ఉన్నతాధికారి మాదిరిగా 4 ఐడీ కార్డులను తయారుచేసుకున్నాడు. ఒకటి డీసీపీ స్థాయి, రెండోది ఏసీపీ స్థాయి, మూడోది సీసీఎస్‌, నాలుగోది ఇన్‌స్పెక్టర్‌ స్థాయి ఐడీ కార్డులు తయారుచేయించాడు.

ఆలయాల్లో గౌరవం, వీఐపీ దర్శనం...

ఆలయాల్లో గౌరవం, వీఐపీ దర్శనం...

ఇలా సూడో పోలీస్ అవతారమెత్తిన రాఘవేంద్ర సత్యపాల్‌ జార్ఖర్‌ తన స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగువారిని నమ్మించాడు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని అధికారులను కూడా అతడు నమ్మించే వాడు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలకు వెళ్లి తన ఐడీ కార్డులను చూపించి గౌరవం, వీఐపీ దర్శన సేవలను పొందేవాడు. ఇక టోల్‌ప్లాజాల వద్ద అయితే హల్‌చల్ చేసేవాడు. తన వాహనం, ఐడీ కార్డులను చూపించి దర్జాగా వెళ్లిపోయేవాడు.

 ఇలా పట్టుబడ్డాడు...

ఇలా పట్టుబడ్డాడు...

సూర్యాపేట ఏసీపీగా చెప్పుకుంటూ రాఘవేంద్ర నగరంలో తన పనులు చేయించుకునేవాడు. పోలీస్‌ ఉన్నతాధికారిగా దర్జా వెలగబెడుతూ... ఇటీవల ఘట్కేసర్‌ మండలం యానంపేటలోని శ్రీనిధి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కాలేజీకి వెళ్లాడు. తాను రిటైర్డ్‌ పోలీస్‌ ఉన్నతాధికారినని, తనకు సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉద్యోగమిచ్చి.. నెలకు 40 వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే కాలేజీ యాజమాన్యానికి అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం అందించడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వచ్చి రాఘవేంద్ర సత్యపాల్‌ జార్ఖర్‌‌ను అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి ఒక కారు, రెండు బైక్‌లు, లాఠీలు, పోలీస్‌ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Task Force police arrested a pseudo cop who was cheating people by posing as DCP. The offender, Raghavendra Satyapal Jaurkar, 42, a security officer at Sreenidhi Institute of Science and Technology, unsuccessfully tried to become a police constable twice in the past. Subsequently he became a member of area peace committee in Kacheguda police station and during his interaction with the police, found out various details about functioning of the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X