• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అరెస్టులు: పామాయిల్‌తో నెయ్యి తయారీ, మీటర్ల ట్యాంపరింగ్(పిక్చర్స్)

|

హైదరాబాద్: కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారనే సమాచారంతో నల్లకుంట పోలీసులు అడిక్‌మెట్‌లోని ఓ ఇంటిపై దాడి చేశారు. నిర్వాహకులను అరెస్ట్ చేసి, కల్తీ నెయ్యి డబ్బాలు, ఇందుకోసం ఉపయోగించే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

సీఐ యాదగిరిరెడ్డి, ఎస్సై మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు కొయంబత్తూరుకు చెందిన గోవిందరాజన్‌ అతడి కుటుంబంతో కలిసి రాంనగర్‌గుండు ప్రాంతంలో నివాసముంటున్నాడు. సుమారు దశాబ్దన్నరగా అతడి కుమారుడు గోవిందబాలకృష్ణతో కలిసి ఇంట్లోనే కల్తీ నెయ్యి తయారు చేస్తూ తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

ఈ విషయమై స్థానికుల నుంచి సమాచారం అందగా ఎస్సైలు మహేందర్‌రెడ్డి, గణేష్‌లతో కలిసి దాడి చేసినట్లు సీఐ వివరించారు. తండ్రి కుమారుణ్ని అదుపులోకి తీసుకోగా వారి నుంచి సుమారు 76 కిలోల కల్తీనెయ్యి, 30 కిలోల పామాయిల్‌, 15కిలోల వనస్పతి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్

మద్యం మత్తులో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్‌బీ ఠాణాలో సోమవారం ఏసీపీ భుజంగరావు, కేపీహెచ్‌బీ సీఐ కుశాల్కర్‌ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

గాగిల్లాపూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి, కేపీహెచ్‌బీకి చెందిన రౌడీషీటర్‌ అంకాల శ్రీరాములు కలిసి కేపీహెచ్‌బీలో బిర్యానీ సెంటర్‌ ప్రారంభించారు. గుంటూరు నుంచి వంటమనిషిని తీసుకొచ్చారు.అతనితో అతని స్నేహితుడు పెదకూరపాడుకు చెందిన రౌడీషీటర్‌ జాబీర్‌ వచ్చాడు. జులై 13న కేపీహెచ్‌బీలోని ఓ హోటల్‌లో వీరంతా విందు చేసుకున్నారు.

రవీందర్‌రెడ్డికి సోదరుడయ్యే ప్రవీణ్‌రెడ్డితో జాబీర్‌ గొడవపడ్డాడు. దీంతో రవీందర్‌రెడ్డి ఇమ్రాన్‌, సయ్యద్‌తో కలిసి జాబీర్‌ను తీవ్రంగా కొట్టారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మద్యం తాగి బస్సు ఎక్కుతూ కిందపడిపోయాడని తెలిపారు.

చికిత్సపొందుతూ జాబీర్‌ 14న చనిపోయాడు. కాగా మూడో ఫేజ్‌లోని ఓ ఖాళీ ప్రదేశంలో జాబీర్‌ను కొట్టారని గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంమేరకు పోలీసులు కేసు ఛేదించారు. రవీందర్‌రెడ్డి, ఇమ్రాన్‌, సయ్యద్‌, అంకాల శ్రీరాములు, నళినికాంత్‌, సంతోష్‌కు ఘటనలో పాత్ర ఉన్నట్లు తేల్చారు. సయ్యాద్‌ మినహా మిగిలిన ఐదుగురిని అరెస్ట్‌ చేశామని ఏసీపీ చెప్పారు.

కల్తీ నెయ్యి నిందితులు

కల్తీ నెయ్యి నిందితులు

కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారనే సమాచారంతో నల్లకుంట పోలీసులు అడిక్‌మెట్‌లోని ఓ ఇంటిపై దాడి చేశారు. నిర్వాహకులను అరెస్ట్ చేసి, కల్తీ నెయ్యి డబ్బాలు, ఇందుకోసం ఉపయోగించే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

కల్తీ నెయ్యి నిందితులు

కల్తీ నెయ్యి నిందితులు

సీఐ యాదగిరిరెడ్డి, ఎస్సై మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు కొయంబత్తూరుకు చెందిన గోవిందరాజన్‌ అతడి కుటుంబంతో కలిసి రాంనగర్‌గుండు ప్రాంతంలో నివాసముంటున్నాడు. సుమారు దశాబ్దన్నరగా అతడి కుమారుడు గోవిందబాలకృష్ణతో కలిసి ఇంట్లోనే కల్తీ నెయ్యి తయారు చేస్తూ తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

మీటర్ల ట్యాంపిరంగ్

మీటర్ల ట్యాంపిరంగ్

మీటర్ల ట్యాంపరింగ్‌కు పాల్పడుతూ.. విద్యుత శాఖకు నష్టం కలిగిస్తున్న టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ అధీకృత గుత్తేదారును ఆ సంస్థ విజిలెన్స్‌, ఏపీటీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.

మీటర్ల ట్యాంపరింగ్

మీటర్ల ట్యాంపరింగ్

బోరు బావులకున్న మీటర్లను ట్యాంపరింగ్‌ చేయించుకుని విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్న 8మంది రైతులపైనా కేసులను నమోదు చేశారు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్

హత్య కేసులో నిందితుల అరెస్ట్

మద్యం మత్తులో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్‌బీ ఠాణాలో సోమవారం ఏసీపీ భుజంగరావు, కేపీహెచ్‌బీ సీఐ కుశాల్కర్‌ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

English summary
Fake Ghee Factory Busted and two arrested By Nallakunta Police in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X