వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బు కోసం దారితప్పిన ఉపాధ్యాయుడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : చేసేది పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి . చేసేది మాత్రం అందుకు విరుద్దమైన పనులు. భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన టీచర్ వృత్తిలో ఉండి డబ్బుల కోసం అడ్డదారులు తొక్కి చివరకు పోలీసులకు చిక్కిన ఉపాధ్యాయుడి ఉదంతమిది.

వికారాబాద్ జిల్లాకు చెందిన వాత్యాశంకర్ ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.ఈ యన బిహెచ్ ఇ ఎల్ లో నివాసం ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు.ఈ కష్టాల నుండి బయటపడేందుకు గాను దొంగనోట్ల మార్పిడి తరుణోపాయమని అతని స్నేహితుడు మెగావత్ ప్రకాష్ చెప్పాడు.ఈ కష్టాల నుండి గట్టెక్కెందుకు ఇదే సరైన మార్గమని శంకర్ కూడ నమ్మాడు.

fake money,governament teacher arrested

మాల్దా, హౌరాల్లో నకిలీ నోట్లు విక్రయించే ముఠా సభ్యులను ప్రకాష్ ఫరిచయం చేశాడు. 5 లక్షల నకిలీ కరెన్సీ కావాలని శంకర్ మాల్దా నుండి నగరనికి తెచ్చుకొన్నాడు.ఐదు లక్షల నకిలీ నోట్లకు గాను 2 లక్షల అసలు కరెన్సీని ఇచ్చాడు శంకర్.ఈ నకిలీ నోట్లను నగరంలో మార్పిడి చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

ఈ నకిలీ నోట్లను సంగారెడ్డి జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రంలో మార్పిడి చేయాలని పథకం రచించాడు.రేతి బౌలి బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తోన్న శంకర్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశాడు నిందితుల నుండి వెయ్యి, ఐదువందల నోట్ల కట్టలు సుమారు నాలుగున్నర లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు.

English summary
shanker governament teacher. he has some financial crises .fake currency is the plan to escape this financial crises said his friend .from westbengal he got 5 lakhs worth fake currency police arrest shanker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X