వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాముడి పేరుతో శఠగోపం: భద్రాద్రి రామయ్య నకిలీ వెబ్‌సైట్, ఆన్‌లైన్ పూజల పేరుతో నగదు వసూల్

|
Google Oneindia TeluguNews

ఇది కలికలం. నీతి, న్యాయం లేదు, మంచి అనే మాట వినపడదు. ఎప్పుడూ ఒకరిని ఎలా మోసం చేయాలని చూస్తున్నారు కొందరు. అయితే ఒక ఘనుడు మాత్రం దేవుడి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. భద్రాద్రి రాముడి పేరుతో నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసి.. పూజల పేరుతో డబ్బులు గుంజుతున్నాడు. అయితే అతని పాపం ఓ భక్తుడి రూపంలో పండింది. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. నకిలీ వెబ్‌సైట్ బాగోతం ప్రపంచానికి తెలిసింది.

ఇంటిదొంగల పనే: ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక వెబ్‌సైట్ హ్యాక్ అయ్యిందా..? ఇంటిదొంగల పనే: ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక వెబ్‌సైట్ హ్యాక్ అయ్యిందా..?

ఫేక్ వెబ్‌సైట్

ఫేక్ వెబ్‌సైట్

వరంగల్‌కు చెందిన విజయ్ కుమార్.. భద్రాచలం రాములోరిని దర్శించుకుందామని అనుకొన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా ఆన్‌లైన్‌లో పూజ చేయిద్దామని భావించాడు. గూగుల్‌లో సెర్చ్ చేయగా వెబ్ సైట్ కనిపించింది. అదీ ఆలయానికి సంబంధించినదేనని అనుకొని.. పూజ చేయించాలని డిసైడయ్యాడు. గూగుల్ పే ద్వారా పూజ కోసం రూ.500 నగదు ట్రాన్స్ ఫర్ చేశాడు. క్యాష్ బదిలీ అయ్యాక.. ఐఎఫ్ఎస్‌సీ జనగామ జిల్లా పాలకుర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అని తెలిసింది. దీంతో విజయ్ కుమార్‌కు అనుమానం వచ్చింది.

 మొబైల్ నంబర్ ఆధారంగా

మొబైల్ నంబర్ ఆధారంగా

తనకు తెలిసిన పోలీసు అధికారి సాయంతో అతనెవరో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. తర్వాత పాలకుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేశారు. మొబైల్ నంబర్ ఆధారంగా యువకుడు అని గుర్తించారు. తనలాగా మరెందరినో అతను మోసం చేశాడని విజయ్ కుమార్ భావించాడు. విషయాన్ని భద్రాచల ఆలయం ఈవో గదరాజు నర్సింహులు దృష్టికి తీసుకొచ్చారు. విషయాన్ని ఈవో కూడా సీరియస్‌గా తీసుకున్నారు. భక్తుడు ట్రాన్స్ ఫర్ చేసిన నగదు, ఇంతకుముందు కొందరి నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్న దానికి సంబంధించి ఆధారాలతో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈవో ఫిర్యాదు మేరకు ఫేక్ వెబ్ సైట్‌పై విచారణ జరుపుతున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.

Recommended Video

Telangana Elections 2018 : కేసీఆర్ ప్రచార సభలకు సంబంధించిన షెడ్యూల్ | Oneindia Telugu
దేవుడి పేరుతో

దేవుడి పేరుతో

ఓ యువకుడు ఏకంగా రాముడి పేరుతో నకిలీ వెబ్ సైట్ సృష్టించి.. దోచుకుంటున్నాడు. విజయ్ కుమార్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ గుర్తించి.. అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే వదిలేసుంటే మరి ఎంతమంది నుంచి డబ్బులు గుంజేవాడోనని అనుమానం కలుగుతోంది. కానీ అతను కంప్లైంట్ చేయడంతో యువకుడి బండారం బయటపడింది

English summary
fake website titled by bhadradri lord rama in jangaon district palakurthi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X