వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నీ అడిగారు, కానీ..: ఇవాంక ఫలక్‌నుమా విందుపై నిజాం మనవడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంక ఫలక్‌నుమా విందు వ్యవహారంపై నిజాం పాలకులలో చివరివాడైన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనువడు నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు

తన వారసత్వ సంపద అయిన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇవాంకాతోపాటు ఇతర ప్రతినిధులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన విందుకు తనను ఆహ్వానించకపోవడంపై ఆయన నిరాశ చెందారు. ఫలక్‌నుమా ప్యాలెస్ హైదరాబాద్‌తోపాటు తమ కుటుంబ సంస్కృతికి గుర్తింపు సూచకమని ఆయన అన్నారు.

అలాంటి ప్రదేశంలో...

అలాంటి ప్రదేశంలో...

అలాంటి ప్రదేశంలో జరిగిన విందుకు తనను ఆహ్వానించకపోవడం ఏమిటని నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ ప్రశ్నించారు. ఈ విందులో పలువురు వ్యాపారవేత్తలు, ప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొన్నారు. తమ సంస్కృతి, సంప్రదాయంలో జరిగినా తమను మాత్రం ఆహ్వానించలేదని చెప్పారు.

అన్నీ అడిగారు, కానీ...

అన్నీ అడిగారు, కానీ...

ఫలక్‌నుమాలో విందు నిర్వాహణ కోసం నీతి ఆయోగ్ అధికారులు గత పది రోజులుగా తనను సంప్రదించారని, ఇవాంకా కోసం నిజాం గది కూడా బుక్ చేశారని, కానీ విందుకు తనను ఆహ్వానించలేదని నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ అన్నారు.

అ తరహాలో ఆహ్వానం...

అ తరహాలో ఆహ్వానం...

నిజాం పాలకుల విధానంలో ఇవాంకాకు స్వాగతం పలికారని, విందు కోసం ఆహార పదార్థాలను కూడా అదే రీతిలో తయారు చేశారని, కానీ తమ కుటుంబాన్ని ఆహ్వానించలేదని న అసంతృప్తి వ్యక్తం చేశారు.

నిజాం

నిజాం

నిజాం హైదరాబాద్ రాజ్యాన్ని పాలించాడు. తాజ్ గ్రూప్ పునరుద్ధరించిన తర్వాత ఫలక్‌నుమా ప్యాలెస్‌ను స్టార్ హోటల్‌గా మార్చారు. హైదరాబాద్ చరిత్రలో దానికి అత్యంత ప్రధానమైన చోటు ఉంది.

English summary
Narendra Modi is hosting a dinner at Taj Falaknuma for Ivanka Trump, daughter and advisor of US President Donald Trump and other delegates attending Global Entrepreneurship Summit (GES) in Hyderabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X