వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందులో నిజం లేదు: దేశపతిని ఘెరావ్ చేయలేదు, వాదన మాత్రమే!

ఈ వాగ్వాదాన్ని ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమానికి ముడిపెట్టి చూడటం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

సిద్దిపేట: బీసీ కమిషన్ సభ్యుడు జూలూరీ గౌరీ శంకర్ సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెలంగాణ సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైనట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. రెడ్డి సామాజిక వర్గం మీద దేశపతి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంతో కొంతమంది స్థానికులు ఆయన్ను ఘెరావ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

డామిట్ కథ అడ్డం తిరిగింది: కేసీఆర్‌కు ఊహించని దెబ్బ, టారెత్తిపోయిన దేశపతి? డామిట్ కథ అడ్డం తిరిగింది: కేసీఆర్‌కు ఊహించని దెబ్బ, టారెత్తిపోయిన దేశపతి?

అయితే వ్యక్తిగత విబేధాల కారణంగా ఒకరిద్దరు వ్యక్తులు ఆయనతో వాగ్వాదానికి దిగారు తప్పితే.. ఆయన్ను ఘెరావ్ చేయలేదని స్థానికులు చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు దీనికి సంబంధం లేదంటున్నారు. అంతేకాదు!, దేశపతికి 'రెడ్డి' సెగ తగలగానే బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్ కార్యక్రమానికి డుమ్మా కొట్టేశారన్న ప్రచారంలోను నిజం లేదన్నారు.

false allegations on CM OSD desapati srinivas

కార్యక్రమంలో దేవీ ప్రసాద్ పాల్గొన్నట్లు స్థానికులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం వీ6లో జరిగిన ఒక చర్చా కార్యక్రమం రెడ్డి సామాజికవర్గంలో కొంత అసంతృప్తిని రాజేయడం.. ఇలాంటి తరుణంలో దేశపతి శ్రీనివాస్ తో రెడ్డి సామాజికవర్గానికి చెందిన కొంతమంది వాగ్వాదానికి దిగడం.. రెండింటిని ముడిపెట్టి చూసే అంశంగా కనిపించింది. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని సిద్దిపేట ప్రజానీకం చెబుతుండటం గమనార్హం. దేశపతి శ్రీనివాస్ కూడా వన్ ఇండియా పోర్టల్‌కు ఇదే వివరణ ఇచ్చారు.

English summary
It is the reality behind Desapati Srinivas bad experience with reddy community people in Siddipet. Locals saying these are false allegations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X