వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ కు పిజేఆర్ తనయుడు విష్ణు గుడ్ బై..!! బీజేపీలో చేరికకు రంగం సిద్దం..!

|
Google Oneindia TeluguNews

కష్టాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్. కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించి..ప్రతిపక్ష నేతగా పని చేసిన దివంగత నేత పి. జనార్ధన్ రెడ్డి కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో కొనసాగటం కంటే పార్టీ మారటమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ నెలలోనే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఆయన సమక్షంలోనే విష్ణు తన అనుచరులతో కలిసి బీజేపీ లో చేరుతారని ప్రచారం సాగుతోంది. అయితే, దీని పైన విష్ణు మాత్రం అధికారికంగా స్పందించ లేదు. పార్టీ నేతలు మాత్రం విష్ణును బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు.

జీవ వైవిధ్యాన్ని దెబ్బతీయొద్దు: వీహెచ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్, ఏం చెప్పారంటే..?జీవ వైవిధ్యాన్ని దెబ్బతీయొద్దు: వీహెచ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్, ఏం చెప్పారంటే..?

కాంగ్రెస్ కు విష్ణు గుడ్ బై..!!
కాంగ్రెస్ దివంగత నేత పి. జనార్ధన్ రెడ్డి కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన కీలకనేతలతో విష్ణు చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఈ చేరికపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకూ విష్ణుగానీ.. ఆయన సన్నిహితులు దీన్ని ఖండించలేదు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డిని బుజ్జగించడానికి కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే, విష్ణు గతంలో జూబ్లీహిల్స్ నుండి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. గత రెండు సార్లుగా ఎన్నికల్లో ఓడిపోయారు. 2014లో టీడీపీ .. 2018లో టీఆర్ యస్ అభ్యర్ధులు జూబ్లీహిల్స్ నుండి గెలిచారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లోనూ అంత యాక్టివ్ గా పాల్గొనటం లేదు. పి జనార్ధన రెడ్డితో సన్నిహితంగా మెలిగిన మరో నేత మర్రి శశిధర్ రెడ్డి ద్వారా ఇప్పుడు విష్ణును పార్టీ మారకుండా నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ పరిధిలో నేతలంతా దాదాపు దూరమయ్యారు. మిగిలిన నేతలు కార్యకర్తల అంచనాలకు తగినట్లుగా నడుచుకోవటం లేదనే అభిప్రాయం ఉంది. దీంతో..ఇప్పుడు విష్ణు సైతం పార్టీలో పరిస్థితులు చూసిన తరువాత పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా ఆయన బీజేపీలో చేరటం ఖాయమనే ప్రచారం సాగుతోంది.

Famous congress leader lated PJR son vishnu may leave Congress and join in BJP shortly

బీజేపీలోకి చేరిఖ ఖాయమేనా
విష్ణు కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరితే భవిష్యత్ రాజకీయాల పైన అంచనాలు వేస్తున్నారు. పీజేఆర్ కాంగ్రెస్ నేతగా పేదల మనసుల్లో చెరగని ముద్ర వేసారు. శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నేతగా..ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఖైరతాబాద్ బస్తీల్లో ఆయన కు మంచి పేరు ఉంది. కరుడు గట్టిన కాంగ్రెస్ నేతగా ఆయన పార్టీ కార్యక్రమాలను లీడ్ చేసే వారు. ఆయన తరువాత నగరంలో కాంగ్రెస్ నేతలుగా.. మంత్రులుగా పని చేసిన వారు సైతం పీజేఆర్ అనుచరులుగా పని చేసిన వారే. ఇక, పీజేఆర్ మరణం తరువాత ఆయన తనయుడు విష్ణు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసారు. ఇక, రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీలో చేరటం ద్వారా..ఆయనకు ఎటువంటి హామీలు ఇస్తారనేది ఆసక్తి కరంగా మారింది. భవిష్యత్ పొత్తులు.. సమీకరణాలు వచ్చే ఎన్నికల్లోనూ కీలకం కానున్నాయి. దీంతో..విష్ణు రాజకీయంగా ఎటువంటి అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.

English summary
Famous congress leader lated PJR son vishnu may leave Congress and join in BJP shortly. He worked as MLa form congress two times. Bjp leaders touch with Vishnu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X