హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మన మెట్రో ఘనతలు: ఎన్నో అవార్డులు, ఆదాయమూ భారీగానే!

ప్రారంభానికి ముందే మన మెట్రో ఎన్నో ఘనతలను సొంతం చేసుకుంటోంది. అతిపెద్ద మెట్రోగా రికార్డులకెక్కిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇప్పటికే ఎన్నో అవార్డులు వరించాయి.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Metro Rail Operations On November 28th | Oneindia Telugu

హైదరాబాద్: ప్రారంభానికి ముందే మన మెట్రో ఎన్నో ఘనతలను సొంతం చేసుకుంటోంది. అతిపెద్ద మెట్రోగా రికార్డులకెక్కిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇప్పటికే ఎన్నో అవార్డులు వరించాయి. అంతేగాక, ఇప్పటికే మెట్రోకు ప్రకటనల ద్వారా ఆదాయం వస్తుండటం గమనార్హం. తాజాగా, ఈ నవంబర్ నెలలోనే ప్రారంభం కానుండటంతో నగరానికి కొత్త కళ రానుంది.

 సుందరంగానే కాదు..

సుందరంగానే కాదు..

రహదారి మధ్యలో మెట్రో స్తంభాలు 2 మీటర్ల వైశాల్యంలో అందంగా నిర్మించారు. అయితే, డివైడర్ల మధ్యలో ఉండటంతో ప్రమాదవశాత్తూ వాహనాలు మెట్రో స్తంభాలను ఢీకొంటున్నాయి. కాగా, నిర్మాణ సమయంలోనే ఇలాంటి ప్రమాదాలను పసిగట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. వంద టన్నుల బరువున్న వాహనాలు ఢీకొట్టినా నిర్మాణానికి రవ్వంత ప్రమాదం లేకుండా ఉండేలా డిజైన్‌ చేశారు. భారీ వాహనాలు ఏవైనా ఢీకొట్టినా స్తంభంపై దాని ప్రభావం పడకుండా క్రాష్‌ బారియర్‌ను స్తంభం కింది భాగంలో నిర్మించారు. దీనికి స్తంభానికి మధ్య కొంత ఖాళీ ఉంటుంది. 2.5 మీటర్ల వైశాల్యంలో డిజైనింగ్‌ను బట్టి స్తంభం మందంలో మార్పులు ఉంటాయి. వాటికి అనుగుణంగా క్రాష్‌ బారియర్‌ ఉంటుంది. కొన్నిచోట్ల కేవలం థర్మకోల్‌ షీట్‌ పట్టేంత ఖాళీ ఉంటుంది. స్తంభాలు దగ్గర దగ్గరగా ఉండేచోట మందం తక్కువ ఉంటుంది. అప్పుడు స్తంభం, క్రాష్‌ బారియర్‌ మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది. దీన్ని భర్తీ చేసేందుకు గోడ కట్టారు. వాహనాలు ఢీకొట్టినప్పుడు క్రాష్‌ బారియర్‌ అంటే మొదటి గోడవరకు నష్టం ఉంటుంది. రెండింటిపైన ఒకేసారి ఒత్తిడి పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. స్తంభాలకు మధ్యలో మొక్కలు పెట్టే ఏర్పాటు కూడా చేస్తున్నారు.

28న మియాపూర్‌లో మెట్రో ప్రారంభం: ప్రధాని ప్రయాణం స్వల్పమే!28న మియాపూర్‌లో మెట్రో ప్రారంభం: ప్రధాని ప్రయాణం స్వల్పమే!

 ఆదాయం పెంచుకోనుందిలా..

ఆదాయం పెంచుకోనుందిలా..

మెట్రో స్టేషన్లలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించగానే ఆదాయం భారీగా వచ్చే అవకాశం ఉంది. కాగా, మెట్రో రైలు ఫైనాన్షియల్‌ మోడల్‌లో ఐదు శాతం ఆదాయం ప్రకటనల ద్వారా సమకూర్చుకోవాలనేది ప్రణాళిక. మెట్రోస్తంభాలు, పోర్టల్స్‌, వయాడక్ట్స్‌, పిట్టగోడలు, ఆబ్లిగేటరీ స్పాన్స్‌, స్టేషన్‌ బయట ప్రకటనలన్నీ సెంట్రల్‌ డివైడర్‌ కిందనే నిర్వచనంతో ప్రకటనలకు అనుమతి ఇచ్చారు. అయితే, ప్రస్తుతం స్తంభాల వరకే ప్రకటనలు ప్రారంభమయ్యాయి.

 అందరి దృష్టిని ఆకర్షించిందిలా..

అందరి దృష్టిని ఆకర్షించిందిలా..

ప్రారంభానికి ముందే హైదరాబాద్‌ మెట్రోరైలు కోచ్‌లపై ప్రకటనలతో ఎల్‌అంట్‌టీ మెట్రో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం.

అంతేగాక, మన మెట్రో లోపల కూడా ఎల్‌సీడీ తెరలు ఉంటాయి. వాటిలోనూ ప్రకటనలకు అవకాశం కల్పిస్తోంది. స్టేషన్‌కు పేరు పెట్టుకోవచ్చు. ఇటీవలనే బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.13 కోట్లతో ఐదేళ్ల ఒప్పందానికి రెండు స్టేషన్లకు ఒప్పందం చేసుకుంది. మొబైల్‌ సంస్థలు, బహుళ జాతి సంస్థలు వీటిపై ఆసక్తి కనబరుస్తున్నాయి.

ఆదాయం ఇలా కూడా..

ఆదాయం ఇలా కూడా..

ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన స్మార్ట్‌ కార్డుపైనా ప్రకటనల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తోంది. స్టేషన్‌లో శీతల పానీయాలు విక్రయిస్తారు. మెట్రోతో ఒప్పందం చేసుకున్న సంస్థకు చెందిన పానీయాలే అమ్మాల్సి ఉంటుంది. కోక్‌తో ఒప్పందం దృష్ట్యా స్టేషన్లలోని రిటైల్‌ దుకాణాల్లో ఇవి మాత్రమే అందుబాటులో ఉంటాయి. స్టేషన్‌ లోపల ప్రసార హక్కులను విక్రయిస్తున్నారు.

 ఒప్పందాలతో భారీగా ఆదాయం

ఒప్పందాలతో భారీగా ఆదాయం

హైదరాబాద్‌ నెక్ట్స్‌ పేరుతో స్టేషన్లలోని రిటైల్‌ దుకాణాలను ఎల్‌అండ్‌టీ సంస్థ అద్దెకిస్తోంది. వీటిలో స్థలం తీసుకోవాలంటే చట్టబద్దంగా అన్నిరకాల అనుమతులతో వచ్చిన వారితో ఒప్పందం చేసుకుంటుంది. ఒప్పంద సమయంలో ఒక నెల అద్దె అడ్వాన్స్‌గా చెల్లించాలి. మెట్రో రైలు ప్రారంభానికి మూడు నెలల ముందు మరో మూడు నెలల అడ్వాన్స్‌ ఇవ్వాలి. ప్రారంభానికి మరో వారం గడువు ఉందనగా మరో రెండు నెలల అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆరునెలల అద్దెను అడ్వాన్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. మాల్స్‌లో అద్దె తక్కువ కాగా.. స్టేషన్లలో ఎక్కువగా ఉండటం గమనార్హం.

 సినిమాల చిత్రీకరణ ద్వారా కూడా..

సినిమాల చిత్రీకరణ ద్వారా కూడా..

మెట్రో స్టేషన్లలో సినిమా షూటింగ్‌లకు అనుమతివ్వడం ద్వారా కూడా మన మెట్రో ఆదాయం సమకూర్చుకోనుంది. ఇప్పటికే పలు తెలుగు సినిమాలు మెట్రో మార్గాల్లో చిత్రీకరణ జరుపుకున్నాయి. అక్కినేని అఖిల్‌ నటిస్తున్న రెండో సినిమా మెట్రో మార్గంపై చిత్రీకరణ చేశారు. అంతకు ముందు అల్లరి నరేశ్‌తో పాటూ పలువురు హీరోల సినిమాలు షూటింగ్‌ జరుపుకొన్నాయి. తద్వారా కూడా కొంత ఆదాయం మెట్రో రైలు సమకూర్చుకుంటోంది. వీటి ద్వారా ఆదాయం బాగా వస్తే ప్రయాణికుల మీద భారం తక్కువగా ఉండే అవకాశం ఉంది.

మెట్రోకు రూ.1000 కోట్ల రుణం..

మెట్రోకు రూ.1000 కోట్ల రుణం..

మెట్రో రైలు కారిడార్లలో సుందరీకరణ పనులు సరికొత్త మార్పు దిశగా అడుగులేస్తున్నాయి. విశాలమైన కాలిబాటలు, పిల్లలు, పెద్దలు సేదదీరేందుకు స్ట్రీట్‌ ఫర్నీచర్‌, ప్రయాణికులు రహదారిపైకి రాకుండా బ్యారికేడ్లు, స్కైవాక్‌, సైకిల్‌ ట్రాక్‌ వంటివి ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతున్నారు. తొలి దశలో ప్రారంభమయ్యే 24 స్టేషన్లలో 700 మీటర్ల పరిధిలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుతున్నాయి. ఈ తరహాలోనే మెట్రోకారిడార్లతో పాటూ నగరంలోని అన్ని ప్రాంతాలను నవీకరించనున్నారు. ఇందుకు భారీ మొత్తం ఖర్చు చేయబోతున్నారు. మెట్రో కారిడార్‌లో మోడల్‌గా హెచ్‌ఎంఆర్‌ పనులు చేపట్టింది. మిగతా ప్రాంతాల్లో ఈ బాధ్యతను జీహెచ్‌ఎంసీ తీసుకోనుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున అవసరమయ్యే నిధులను ప్రభుత్వం జర్మనీకి చెందిన అభివృద్ధి బ్యాంకు ‘కేఎఫ్‌డబ్యూ' నుంచి సమకూర్చుకోనుంది. రూ.1000 కోట్ల రుణం ఇవ్వాల్సిందిగా ఇప్పటికే కోరింది. 0-1 శాతం వడ్డీ లోపే దీర్ఘకాలానికి రుణం ఇచ్చే ఈ బ్యాంకు ప్రతినిధులు శనివారం మియాపూర్‌ స్టేషన్‌ వద్ద సుందరీకరణ పనులు పరిశీలించారు. మెట్రో పనుల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

 ప్రతిష్టాత్మక అవార్డులు

ప్రతిష్టాత్మక అవార్డులు

ప్రారంభానికి ముందే దేశవిదేశాలకు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ రంగ సంస్థలు గత ఐదేళ్లుగా వివిధ అంశాల్లో మన మెట్రో ప్రాజెక్టుకు అవార్డులను ప్రదానం చేయడం విశేషం. మెట్రో స్టేషన్ల పరిసరాలను మూడు భాగాలుగా విభజించి రహదారి మార్గంలో చేపట్టిన సుందరీకరణ, హరిత తోరణం.. మొజాయిక్‌టైల్స్, స్ట్రీట్‌ఫర్నీచర్‌, మియాపూర్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన ప్రజోపయోగ స్థలాలకు ఇటీవల ఐజీబీసీ సంస్థ ప్లాటినం రేటింగ్‌ సైతం ఇచ్చిన విషయం విదితమే. అంతేకాదు..మన మెట్రోకు ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 15 అవార్డులు మెట్రో కీర్తికిరీటంలో కలికితురాయిల్లా భాసిల్లుతుండడం విశేషం. ఇందులో న్యూయార్క్‌కు చెందిన ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫోరం,రాయల్‌సొఐటీ ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ యాక్సిడెంట్‌ గోల్డ్‌లు సైతం ఉన్నాయి.

 మెట్రోను వరించిన అవార్డులివే..

మెట్రోను వరించిన అవార్డులివే..

మన మెంట్రోకు ఇప్పటికే చాలా సంస్థలు అవార్డలు ప్రకటించాయి. వాటిలో..

గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌(2013) న్యూయార్క్‌కు చెందిన ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫోరం ప్రధానం చేసిన అవార్డు. 2013, 14,15: రాయల్‌ సొసైటీ ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ యాక్సిడెంట్‌ గోల్డ్‌ అవార్డులు మూడు పర్యాయాలు వరుసగా దక్కాయి. నిర్మాణ సమయంలో అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను పాటించినందుకు యూకెకు చెందిన గ్లాస్కో సంస్థ ప్రధానం చేసిన సేఫ్టీ అండ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అవార్డులు దక్కాయి. 2013,14: బెస్ట్‌ మెట్రో ప్రాజెక్ట్‌ అవార్డ్‌. 2015,17: బెస్ట్‌ అప్‌కమింగ్‌ మెట్రో అవార్డు.(కన్‌స్ట్రక్షన్‌ వీక్‌ ఆఫ్‌ ఇండియా-ముంబై). అమెరికన్‌ కాంక్రీట్‌ ఇన్సిట్యూట్‌(ఏసీఐ అవార్డ్‌)-2013-ముంబై. ఇంటర్నేషనల్‌ సేఫ్టీ, క్వాలిటీ, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డ్‌-2015 యూకెకు చెందిన ఐఎస్‌క్యూఈఎం సంస్థ. ప్లాటినం అవార్డ్‌-2016,
బెస్ట్‌ అప్‌కమింగ్‌ మెట్రోరైల్‌-ఐటీపీ పబ్లిషింగ్‌ గ్రూప్‌-న్యూఢిల్లీ, ఐజీబీసీ ప్లాటినం రేటింగ్‌(మెట్రో స్టేషన్లకు)-2017 ఉన్నాయి. కాగా, ఇన్నో విశేషాలు కలిగిన హైదరాబాద్ మెట్రోను నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అయితే, ప్రారంభోత్సవానికి సేఫ్టీ కమిషన్ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది.

English summary
As the Commissioner of Metro Rail Safety (CMRS) is yet to issue safety clearance for the launch of Metro Rail operations on November 28, the state government is working on alternative plans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X