వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు మ్యారేజ్ బ్యూరో ... అక్కడ పెళ్లి సంబంధాలు రైతులకు మాత్రమే.. ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

పెళ్లి సంబంధాలు అనగానే... బోలెడన్ని మ్యాట్రిమోనీలు గుర్తొస్తాయి. ప్రతి కులానికి వందల సంఖ్యలో మాట్రిమోనీలు వధూవరులను ఎంపిక చేసుకొని వివాహ వేడుకలు జరిపించడానికి, కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇటీవల రోజుల్లో చూస్తే ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసేవారినో ,లేదా ఇతర దేశాలలో సెటిల్ అయిన వారినో , ఇలా తమ తమ ప్రాధాన్యతల మేరకు వివాహాలకు ఎంచుకుంటున్నారు. అయితే అన్నం పెట్టే రైతన్న విషయంలో మాత్రం పెళ్లి సంబంధాలకు కూడా ఎవరూ మొగ్గు చూపడం లేదు. వ్యవసాయం చేస్తారు అంటే చిన్నచూపు చూస్తున్న పరిస్థితి నేటి సమాజంలో కనిపిస్తోంది.

మోత బరువు తగ్గించే ప్లాన్ లో రైల్వే .. దేశంలో తొలిసారి ..ఇది నిజంగా గుడ్ న్యూస్మోత బరువు తగ్గించే ప్లాన్ లో రైల్వే .. దేశంలో తొలిసారి ..ఇది నిజంగా గుడ్ న్యూస్

రైతుల పెళ్లి కష్టాలకు చెక్ .. కరీంనగర్ లో రైతు మ్యాట్రిమొనీ

రైతుల పెళ్లి కష్టాలకు చెక్ .. కరీంనగర్ లో రైతు మ్యాట్రిమొనీ

రైతులకు పెళ్లి సంబంధాలు దొరకడం చాలా కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో రైతుల కోసం సంబంధాలను చూడడానికి కొత్త ఆలోచన చేసిన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో ఉండే ఓ రైతు, రైతు మ్యారేజ్ బ్యూరో ను ప్రారంభించారు. కేవలం రైతులకు మాత్రమే పెళ్లి సంబంధాలు చూస్తామని ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న రైతులు, వ్యవసాయ అనుబంధ ఉద్యోగుల పెళ్లి సంబంధాలకు తమను సంప్రదించాలని, వ్యవసాయం చేసే యువతీ, యువకులు మాత్రమే సంప్రదించండి అంటూ కేతిరెడ్డి అంజి రెడ్డి అనే రైతు, రైతు మ్యారేజ్ బ్యూరో ను ప్రారంభించారు.

 10 ఎకరాల ఆసామైనా సరే.. రైతులకు కష్టంగా మారిన పెళ్లి సంబంధాలు

10 ఎకరాల ఆసామైనా సరే.. రైతులకు కష్టంగా మారిన పెళ్లి సంబంధాలు

రైతులతో సంబంధాలు కుడుర్చుకోవటానికి చాలామంది వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో, రైతులు సంబంధాలను చూసుకోవడం కష్టంగా మారిందని, అందుకే రైతుల కోసం తాను మ్యారేజ్ బ్యూరో ని స్టార్ట్ చేసినట్లుగా ఆయన చెబుతున్నారు. రైతు కుటుంబాలు అంటే పిల్లలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని, ఐదు నుండి పది ఎకరాల భూమి ఉన్న వ్యవసాయం చేసుకునే వారికి కూడా పిల్లను ఇవ్వడం లేదని అంజి రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ అవమానం తనకు ఎదురైన కారణంగానే రైతు మ్యారేజ్ బ్యూరో ని ప్రారంభించానని ఆయన చెప్పారు.

 ఉద్యోగాలు ఉన్నవారికే పిల్లనివ్వటానికి మొగ్గు .. అందుకే రైతు మ్యారేజ్ బ్యూరో

ఉద్యోగాలు ఉన్నవారికే పిల్లనివ్వటానికి మొగ్గు .. అందుకే రైతు మ్యారేజ్ బ్యూరో

ఉద్యోగాలు ఉంటేనే పిల్లను ఇస్తామన్న భావన నుండి ప్రజల దృష్టి మరల్చాలి అని, సమాజంలో రైతులకు సరైన ప్రాధాన్యత తీసుకురావాలన్న ఉద్దేశంతోనే రైతు మ్యారేజ్ బ్యూరో పెట్టానని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను జనాలు గుర్తించలేకపోవడం అన్యాయమన్నారు. రైతు కుటుంబంలో ఉన్న పెళ్లికాని పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అన్న బ్యూరో నిర్వాహకుడు అయిన ఆ రైతు తన దగ్గరకు సంబంధాల కోసం వచ్చే వారి దగ్గర నుండి కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు కింద 500 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాం అని చెప్పారు.

Recommended Video

Vishakapatnam : A Ship Drifted On To The Shore At Tenneti Park In Vizag | Oneindia Telugu
ప్రజల మనసులో రైతులపై ఆలోచనలో మార్పు రావాలి

ప్రజల మనసులో రైతులపై ఆలోచనలో మార్పు రావాలి

రైతు కుటుంబాలలో వారికి కూడా పిల్లల్ని ఇవ్వాలన్నదే తన ప్రధాన ఉద్దేశమని బ్యూరో నిర్వాహకులు పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ రైతు దేశానికి వెన్నెముక, రైతే రాజు..అలాంటి రైతు కుటుంబంలో సంబంధం అంటే చాలామంది వెనుకడుగు వేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ చదువులు, ఉద్యోగాలు చేసిన వారినే కావాలని కోరుకుంటున్నారు . అయితే ఆ ఆలోచనా దృక్పథం మారాలి. కేవలం చదువును,ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకొని పెళ్లి సంబంధాలను వెతకకుండా, తగిన సంబంధమని భావిస్తే రైతు కుటుంబం అయినా పిల్లలు సంతోషంగా ఉంటారు అని గుర్తించాల్సిన అవసరం ఉంది.

English summary
A farmer in Karimnagar district, Thimmappur, has set up a farmer marriage bureau. This opportunity is only for young men and women who are engaged in agriculture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X