వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ నేతల బరితెగింపు... మహిళ అధికారిపై కర్రలతో దాడి...! (వీడియో)

|
Google Oneindia TeluguNews

కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో అటవీ శాఖ అధికారులపై రైతులు దాడి చేశారు. రైతులు దున్నుకుంటున్న భూమి అటవీ శాఖది కావడంతో భూమిని దున్నేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై కాగజ్ నగర్ మండలం సార్‌సాల గ్రామరైతులు మూకుమ్మడిగా దాడి చేశారు..అయితే సిబ్బందిపై దాడిలో స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు జడ్పీ వైస్ చైర్మన్ అయిన కోనేరు క్రిష్ణ స్వయంగా పాల్గోని, అటవి సిబ్బందిపై దాడి చేశాడు..దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది..ఇక వీడియో తీస్తున్న మీడీయా సిబ్బందిని కూడా వారు అడ్డుకున్నారు...

అటవీ భూముల దున్నడంతో అడ్డుకున్న రైతులు...

కాగజ్‌నగర్ మండలం, సార్సాలలో అటవీ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీరణ పనులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భూములను చదును చేసేందుకు ట్రాక్టర్లతో పాటు అటవి సిబ్బంది అక్కడికి చేరుకున్నారు..అనంతరం భూములను దున్నేందుకు ప్రయత్నాలు చేశారు. విషయం తెలుసుకున్న జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ.. ఘటనాస్థలికి వచ్చారు. అటవీ అధికారులను అడ్డగించారు. ఈ క్రమంలో అధికారులు, కృష్ణ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మహిళా ఎఫ్ఆర్ఓపై ఎమ్మెల్యే తమ్ముడు దాడి

మహిళా ఎఫ్ఆర్ఓపై ఎమ్మెల్యే తమ్ముడు దాడి

ఈ నేపథ్యంలోనే జడ్పీ వైస్ చైర్‌పర్సన్ క్రిష్ణా నేరుగా అధికారులపై దాడికి దిగారు..భూములను దున్నేందుకు స్వయంగా ట్రాక్టర్ ఎక్కిన ఫారెస్ట్ ఆధికారిని అనితపై కర్రతో దాడి చేశారు..మరోవైపు గ్రామస్థులు సైతం సిబ్బందిని అడ్డుకుని కర్రలతో దాడులకు పాల్పడ్డారు..అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది వారించినా...సార్సా రైతులు మాత్రం కర్రలతో ట్రాక్టర్లను కొడుతూ అధికారులను, పోలీసులను భయ బ్రాంతులకు గురిచేశారు..దీంతో ఎఫ్ఆర్ఓ అనితకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు..ఇక ఎమ్మెల్యే తమ్ముడు, జడ్పీ వైస్ చైర్మన్ క్రిష్ణతోపాటు మరికొందరు గ్రామస్థులు తమ పై దాడి చేశారని ఆమే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫారెస్ట్ అధికారులే దాడులకు దిగారు...

ఫారెస్ట్ అధికారులే దాడులకు దిగారు...

ఇక ఫారెస్ట్ ఫారెస్ట్ సిబ్బందిపై దాడిని జడ్పీ వైఎస్ చైర్మన్ కోనేరు కృష్ణ సమర్థించుకున్నారు. ఫారెస్ట్ అధికారులే దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ ఎదురుదాడికి దిగారు. విత్తనాలు వేసిన భూముల్లోకి అటవీ అధికారులు రావడంతో గ్రామస్థులు ఆగ్రహించారని మండిపడ్డారు. పట్టా భూముల్లో దున్నుతుంటే అడ్డుకున్నామని కృష్ణ చెప్పుకొచ్చారు. అధికారులు రైతులను వేధింపులకు గురిచేయడంతో సహనం కోల్పోయారని, వారిపై దాడికి పాల్పడ్డారని అన్నారు. తాను ఎవరిపైనా దాడి చేయలేదని పేర్కొన్నారు.

English summary
Farmers attacked forest officials in Asifabad in Kumuram Bhim district. when forest land was plowing by the tractors,Farmers stopped.However, the brother of local MLA Koneru Konappa, who was the vice-chairman of the zp, attacked the staff.Koneru Krishna himself attacked on the FRO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X