ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ట్రయిల్‌రన్‌ విజయవంతం: రైతుల సంబరం

పాలేరు నియోజకవర్గంలో వర్షాధారంగా సాగయ్యే సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భక్త రామదాసు’ ఎత్తిపోతల పథకం గడువుకు 2నెలల మునుపే పనులు .

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: తీవ్ర వర్షాభావం ఒకవైపు..సాగునీటి వనరులు కానరాని స్థితి మరోవైపు.. ఈ పరిస్థితుల మధ్య దశాబ్దాలుగా బీళ్లుగా మారిన భూముల్లో ఎట్టకేలకు జల సవ్వడి వినిపించింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో వర్షాధారంగా సాగయ్యే సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'భక్త రామదాసు' ఎత్తిపోతల పథకం గడువుకు రెండు నెలల మునుపే పనులు పూర్తిచేసుకుంది.

సోమవారం పథకానికి ట్రయల్‌రన్‌ నిర్వహించారు. పాలేరు జలాశయం పంప్‌హౌస్‌ నుంచి నీటిని విడుదల చేయగా..16.50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్‌తండా సమీపంలో నిర్మించిన నీటి తొట్టిలోకి(డెలివరీ సిస్టర్న్‌) ఎలాంటి అవరోధాలు లేకుండా నీళ్లు చేరుకున్నాయి. అక్కణ్నుంచి..అనుసంధానించిన ఎస్సారెస్పీ డీబీఎం-60 కాలువలోకి నీళ్లు ప్రవహించాయి.

రూ.336 కోట్ల వ్యయంతో:
పాలేరు జలాశయం నీటి ఆధారంగా ఈ నియోజకవర్గంలోని కరవుపీడిత తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం గ్రామీణం, నేలకొండపల్లి మండలాల్లోని 27 గ్రామాల పరిధిలో దాదాపు 60 వేల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ భారీ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. పాలేరు నీటిని గొట్టాల ద్వారా తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్‌ తండా వరకు చేర్చి..అక్కణ్నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను కలుపుతూ తవ్వి నిరుపయోగంగా ఉన్న ఎస్సారెప్పీ కాలువల ద్వారా ఆయకట్టుకు నీరందించాలన్నది ఉద్దేశం.

Farmers celebrate trial run of Bhakta Ramadasu project

గత సంవత్సరం ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్‌ స్వయంగా శంకుస్థాపన చేసిన ఈ పథకం ఏడాదిలోపే పనులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. ఆదివారమే పాలేరు జలాశయం నుంచి పంప్‌హౌస్‌కు నీరు చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.పెంటారెడ్డి, సీఈ సుధాకర్‌ల ఆధ్వర్యంలో సోమవారం ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలోనే పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.

అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం: తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ ప్రభుత్వం గడిచిన రెండున్నరేళ్ల కాలంలో అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తోందని రహదారులు భవనాలశాఖ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మన్యం ప్రాంతంలో సోమవారం పర్యటించి రూ. కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు నిర్మాణాలకు అంకురార్పణ చేశారు.

వెంకటాపురం మండలం ఆలుబాకలో రూ. 1.20కోట్లతో నిర్మించిన విద్యుత్తు ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు కరెంటును సరఫరాకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు మరికాలలో రెండు పడకల ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఉగాది నాటిని నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపిస్తే ఉపేక్షించమన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని సూచించారు. వెంకటాపురం శివారులో రూ. 20 కోట్లతో మంజూరైన 132/33కేవీ విద్యుత్తు ఉప కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బంగారు తెలంగాణ కలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.

గ్రామీణ పల్లెలకు రవాణా సదుపాయం మెరుగుపర్చడం, విద్యా, వైద్యం, విద్యుత్తు వంటి సమస్యలను ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆయన వెంట భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీఎంఎస్‌ అధ్యక్షుడు ఎగ్గడి అంజయ్య, ఎంపీపీ ఎట్టి ఝాన్సీలక్ష్మీబాయి, డీసీసీడి డైరెక్టర్‌ గూడపాటి శ్రీనివాసరావు, సర్పంచులు పూజారి సమ్మయ్య, జజ్జరి నారాయణమ్మ, టిఆర్ఎస్ మండల అధ్యక్షకార్యదర్శులు వేల్పూరి లక్ష్మీనారాయణ, గంపా రాంబాబు, నాయకులు బాలసాని ముత్తయ్య, కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

English summary
Jubilation marked the successful trial run of the Bhakta Ramadasu Lift Irrigation (LI) scheme when 350 cusecs of water lifted from the Palair reservoir in Kusumanchi mandal reached the DBM-60 main canal of the SRSP stage-II in Tirumalayapalem mandal after traversing a distance of 16.5 km in less than one-and-a-half hours on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X