హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చేయి దాటిపోతుంది: రోహిత్ ఆత్మహత్య మోడీకి ఫరూఖ్ హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

జమ్మూ: దళిత విద్యార్తి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో సంభవించిన పరిణామాలను చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలని, లేదంటే పరిస్థితి చేతులు దాటిపోతుందని నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరించారు.

అది విషాదకరమైన సంఘటన అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలోనైనా, తాము కోరుకున్న స్థాయిలోనైనా సంఘటనపై విచారణ జరిపించాలని ఆయన అన్నారు. సత్వరమే విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా యువ విద్యార్థులు అశాంతికి గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Farooq Abdullah asks Modi govt to probe Dalit student's suicide in Hyderabad

సమస్యను పరిష్కరించకపోతే నిరసనలు ప్రమాద స్థాయికి చేరుకుంటాయని, అప్పుడు నియంత్రించడం కష్టమవుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 17వ తేదీన వేముల రోహిత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

English summary
National Conference patron Farooq Abdullah on Wednesday asked the Modi government to deal with the situation arising out of suicide by a Dalit scholar at Hyderabad Central University "at once" and warned that otherwise the situation could become difficult to control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X