వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కక్ష తీర్చుకొన్న తండ్రి, సెంటిమెంట్ తో ప్రియుడిని మట్టుబెట్టాడిలా.....

తన కూతురిని ప్రేమ పేనుతో మోసం చేసి,.ఆమె మరణానికి కారణమైన రాజేష్ అనే వ్యక్తిని హత్య చేశాడు తండ్రి. అయితే హత్య చేసిన వ్యక్తి సైదాబాద్ కు చెందిన టిడిపి నాయకుడు శ్యాం సుందర్ రెడ్డిగా గుర్తించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:తన కూతురిని ప్రేమ పేనుతో మోసం చేసి,.ఆమె మరణానికి కారణమైన రాజేష్ అనే వ్యక్తిని హత్య చేశాడు తండ్రి. అయితే హత్య చేసిన వ్యక్తి సైదాబాద్ కు చెందిన టిడిపి నాయకుడు శ్యాం సుందర్ రెడ్డిగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

సైదాబాద్ కు చెందిన టిఆర్ఎస్ నాయకుడు శ్యాంసుందర్ రెడ్డి రాజేష్ అనే వ్యక్తిని సోమవారం రాత్రి తుర్కయంజాల్ లోని మిత్ర బార్ వద్ద కత్తితో పొడిచి చంపాడు.

శ్యాంసుందర్ రెడ్డి కూతురు అనూష రెడ్డిని రాజేష్ ప్రేమ పేరుతో మోసం చేశాడు. అనూష రెడ్డిని రాజేష్ 2014లో ఎల్ బి నగర్ లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో వివాహం చేసుకొన్నాడు. అప్పటికే రాజేష్ కు వివాహమైంది. అనూష రెడ్డి బొటిక్ నిర్వహించేది.

Father avenges girl's death, kills man who cheated her

అయితే రాజేష్ కు అప్పటికే వివాహమైందనే విషయం తెలిసింది.దీంతో అనూషరెడ్డి రాజేష్ ను దూరం పెట్టింది.రాజేష్ పై అనూషరెడ్డిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారనే 2015 మార్చిలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

దీంతో రాజేష్ వ్యవహరశైలితో అనూష తీవ్రంగా మనస్థాపానికి గురైంది. దీంతో అనూషరెడ్డిని ఈ వాతావరణానికి దూరంగా ఉంచాలని కుటుంబసభ్యులు భావించారు. ఈ మేరకు 2015 మార్చిలో రాజేష్ ను పోలీసులు అరెస్టు చేయగానే అనూషరెడ్డిని కుటుంబసభ్యులు పిక్నిక్ కు తీసుకెళ్ళారు.

అయితే నాగార్జునసాగర్ వద్ద అనూషరెడ్డి ఆత్మహత్య చేసుకొంది.రాజేష్ పై పలు కేసులున్నాయి. అమ్మాయిలను వేధించన కేసులతో పాటు భూముల కేసులు కూడ ఉన్నాయి. అనూష మరణం తర్వాత రాజేష్ పై పిడి యాక్ట్ నమోదు చేశారు పోలీసులు.ఏడాది పాటు రాజేష్ జైలులోనే గడిపాడు.

2016 జూన్ లో రాజేష్ జైలు నుండి విడులయ్యాడు..అయితే సమయం కోసం ఎదురుచూస్తున్నాడు శ్యాం సుందర్ రెడ్డి. రాజేష్ అతని స్నేహితుడు యుగంధర్ లు మిత్రా బార్ లో మద్యం తాగి బయటకు వచ్చారు. అయితే శ్యాంసుందర్ తో పాటుగా అయన సన్నిహితులు కత్తులతో రాజేష్ పై దాడి చేశారు. దీంతో రాజేష్ అక్కడికక్కడే మరణించారు. అయితే పోలీసులు శ్యాంసుందర్ తో పాటు ఆయన అనుచరులను అరెస్టు చేశారు.నిందితులపై ఐిపిసి 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు ఇబ్రహీం పట్నం ఎసిపి.

కూతురు ఇంటి నుండి వెళ్ళిన రోజే సెంటిమెంట్

శ్యాంసుందర్ రెడ్డి కూతురు 2015 ఫిబ్రవరి 27వ, తేదిన రాజేష్ తో కలిసి ఇంటి నుండి పారిపోయింది. ఏడు రాష్ట్రాల్లో తిరిగారు. అయితే చివరకు హైద్రాబాద్ కు వచ్చారు.అయితే జైలు నుండి రాజేష్ వచ్చిన తర్వాత రాజేష్ కదలికలపై నిఘాను ఉంచిని శ్యాంసుందర్ రెడ్డి వారం రోజులుగా ఆయనపై రెక్కీ నిర్వహిస్తున్నాడు. తన కూతురు తన ఇంటి పారిపోయిన రోజునే రాజేష్ ను చంపాలని భావించాడు. ఈ మేరకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.గత నెల 27వ, తేదిన రాత్రి యుగంధర్ తో కలిసి మిత్ర బార్ లో మద్యం సేవించి బయటకు వచ్చిన రాజేష్ ను శ్యాంసుందర్ రెడ్డి అతని అనుచరులు కత్తితో పొడిచారు. సెంటిమంట్ ను శ్యాంసుందర్ రెడ్డి ఈ రకంగా ఉపయోగించుకొన్నాడు.

English summary
The Adibhatla police arrested a Telangana Rashtra Samiti leader for allegedly stabbing a man who had been earlier arrested for sexually exploiting the former's daughter. The incident took place at Mitra bar in Turkayamzal on Monday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X