• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాజేంద్రనగర్‌లో దారుణం... కన్నతండ్రే కాటేశాడు... కుమార్తెపై 15 రోజులుగా అత్యాచారం...

|

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దారుణం వెలుగుచూసింది. కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.గత 15 రోజులుగా కూతురిపై అతను అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు స్థానికులు గుర్తించారు. అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.తండ్రి అత్యాచారం విషయాన్ని బాధిత యువతే మొదట స్థానికులకు చెప్పినట్లు తెలుస్తోంది.దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడిపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహా రెండు వేర్వేరు ఘటనలు వెలుగుచూశాయి. విజయవాడ అజిత్ సింగ్ నగర్‌కు చెందిన 35 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్ 13 సంవత్సరాల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఏడాది మార్చి నెల నుంచి కన్నబిడ్డపై అతను అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు.భార్య నిద్రపోయిన తర్వాత పక్కనే పడుకున్న కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. భార్య ఇంట్లో లేని సమయం చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ విషయం తల్లికి చెప్పలేక, తండ్రి ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురై తనలో తానే కుమిలిపోయింది.

 father rapes his own daughter at rajendernagar in hyderabad

ఈ నెల 8,10 తేదీల్లో కుమార్తెపై అతను అత్యాచారానికి పాల్పడటంతో... ఆమె తమ నానమ్మ ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ నానమ్మకు జరిగిన విషయం చెప్పింది.తండ్రి ఏడాదిన్నరగా తనపై చేస్తున్న రాక్షస కృత్యాన్ని బాలిక నానమ్మకు చెప్పగా ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీసులు పోక్సో చట్టం కింద తండ్రిపై కేసు నమోదు చేసి కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు బదలాయించారు.ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.

అంతకుముందు,మరో ఘటనలో విజయవాడ నగరంలోని స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌ ఇనిస్టిట్యూట్‌తో పాటు మరో ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.కొన్నేళ్ల క్రితం అతను ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐదేళ్ల పాప ఉంది.అయితే, కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ తండ్రి.. అత్యంత నీచపు పనికి ఒడిగట్టాడు. కన్న కూతురిపైనే కన్నేసిన ఆ నీచుడు భార్య ఇంట్లో లేని సమయంలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుషం తర్వాత చిన్నారి తీవ్ర బాధతో విలవిల్లాడిపోతుండటంతో తల్లికి అనుమానం వచ్చింది. తర్వాత, ఈ కీచక తండ్రిని నిలదీయడంతో అతడు చేసిన నీచపు పని బయటపడింది.

  సింగరేణి కాలనీ బాలిక అత్యచారం పట్ల భగ్గుమంటున్న స్ధానిక మహిళలు

  ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడటాన్ని ఆ మహిళ జీర్ణించుకోలేకపోయింది. భర్త అకృత్యంపై సదరు మహిళ దిశ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆ తండ్రిపై పొక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.తండ్రి చేతిలో లైంగిక దాడికి గురైన చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే భర్తపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని చిన్నారి తల్లికి బెదిరింపులు రావడం గమనార్హం. అయినప్పటికీ ఆమె తన కూతురికి జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో నిందితుడు చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు కూడా యత్నించాడు. దిశ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

  English summary
  In a shocking incident,a father raped his own daughter,in Rajendranagar,Hyderabad. For the last 15 days he was raping the girl, the locals have found that he has been abusing his daughter. He was handed over to the police.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X