• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కన్నతండ్రే కాలయముడయ్యాడు .. నాలుగేళ్ల కొడుకుని కర్కశంగా కొరికి , గొంతు నులిమి చంపేశాడు

|

మానవ సంబంధాలు రోజురోజుకీ మృగ్యంగా మారుతున్నాయి. తల్లిదండ్రులను పిల్లలు, పిల్లల్ని తల్లిదండ్రులు అర్ధం లేని కారణాలతో కదతెరుస్తున్నారు. పేగు పాశాన్ని మరచిపోయి మరీ హతమార్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఒక కొడుకు తల్లిని నడి రోడ్ మీదకు ఈడ్చి గొడ్డలితో నరికి , తల మొండెం వేరు చేసి తలను చిద్రం చేసి రోడ్ మీద వీరంగం వేస్తే తాజాగా ఒక తండ్రి అన్నే పున్నెం ఎరుగని పసివాడిని, కన్నా కొడుకుని చిత్ర హింసలు పెట్టి మరీ చంపేశాడు. పాశవికంగా, క్రూరంగా జరుగుతున్న ఈ దారుణాలు రక్త సంబంధాలకు అర్ధం లేకుండా చేస్తున్నాయి.

జగన్ సీఎం అయితే వెంటనే కలవాలా ? పృధ్వీ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన రాజేంద్రప్రసాద్

నల్గొండ జిల్లాలో దారుణం .. భార్యపై కోపంతో నాలుగేళ్ల కొడుకును చంపిన తండ్రి

నల్గొండ జిల్లాలో దారుణం .. భార్యపై కోపంతో నాలుగేళ్ల కొడుకును చంపిన తండ్రి

ఇక అసలు విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. నాన్నగా నీడనివ్వాల్సిన వాడు నరరూప రాక్షసుడిగా మారి నాలుగేళ్ల కొడుకు ఊపిరి తీశాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్నకొడుకును కడతేర్చాడు. తాగిన మైకంలో , భార్యపై కోపంతో ఏమ చేస్తున్నాడో తెలీనంత విచక్షణ మరచి పశువులా ప్రవర్తించాడు. నిద్రిస్తున్న కొడుకును గొంతు కొరికి , పిన్నీసుతో గొంతుపై గుచ్చి చిత్ర హింసలు పెట్టాడు. తనలో ఉన్న పాశవికత అంతా అభం శుభం తెలీని పసివాడి మీద చూపించాడు . గొంతు నులిమి, కొరికి, మెడపై పిన్నీసుతో గుచ్చి గాయపరిచి కర్కశంగా హత్య చేశాడు.

 భార్యాభర్తల మధ్య ఘర్షణ .. నెల రోజులుగా కొడుకుతో ఉంటున్న తండ్రి

భార్యాభర్తల మధ్య ఘర్షణ .. నెల రోజులుగా కొడుకుతో ఉంటున్న తండ్రి

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన చింతల కనకయ్య, స్వప్న దంపతులకు ఆరేళ్ళ వయసున్న కుమార్తె అక్షిత, నాలుగేళ్ల కుమారుడు అక్షయ్‌ ఉన్నారు. బతుకుదెరువు కోసం పిల్లలతో కలిసి కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొంత కాలంగా గొడవలు పడుతున్న భార్యాభర్తలు నెల క్రితం విడిపోయారు .దీంతో కనకయ్య కుమారుడు అక్షియ్ ను తీసుకొని నల్గొండ జిల్లా శౌలిగౌరారం మండలం తిర్మలరాయినిగూడెంలోని తన పెదనాన్న చింతల రాములు ఇంటికి వెళ్లాడు. కూలి పనులకు వెళ్తూ నెల రోజులుగా అక్కడే ఉంటున్నాడు.

కుమారుడు భార్య దగ్గరకు వెళ్ళవద్దని కన్నా కొడుకునే కర్కశంగా హతమార్చిన తండ్రి

కుమారుడు భార్య దగ్గరకు వెళ్ళవద్దని కన్నా కొడుకునే కర్కశంగా హతమార్చిన తండ్రి

అయితే అక్షయ్‌ బాగోగులు చూడటానికి ఇబ్బందిగా ఉందని, వచ్చి కొడుకును కూడా తనతో తీసుకెళ్ళమని కనకయ్య పెదనాన్న చింతల రాములు కుటుంబ సభ్యులు స్వప్నకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆమె అందుకు అంగీకరించి రెండు, మూడు రోజుల్లో వచ్చి తీసుకెళ్తానని చెప్పింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న కనకయ్య ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో బోనాల పండుగ రోజు కావడంతో రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన కనకయ్య భార్య మీద కోపంతో అర్ధరాత్రి తన పక్కన నిద్రిస్తున్న కుమారుడు అక్షయ్‌ను గొంతు నులమడంతోపాటు శరీరంపై పలుచోట్ల కొరికి, మెడపై పిన్నీసుతో గుచ్చి కిరాతకంగా హత్య చేశాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు భార్యకు దక్కకూడదనే దురుద్దేశంతోనే ఇలాంటి దారుణానికి పాల్పడి ఉంటాడని శాలిగౌరారం సీఐ క్యాస్ట్రోరెడ్డి భావిస్తున్నారు. ఈ దిశగా కేసు దర్యాప్తు చేపట్టారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man was arrested for the brutal killing of his four-year-old son on Friday here at Thirmalaraini Gudem of Shali Gouraram mandal of Nalgonda district.Kanakaiah got separated from his wife Swapna and is staying with his son Akshay (4) at Thirmalaraini Gudem. "Kanakaiah was not interested to send his son with wife and killed him," said the police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more