వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌లో భయం మొదలైంది.. అందుకే అలా..: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఎద్దేవా

తెలంగాణ సీఎం కేసీఆర్ తన స్థాయికి తగినట్టు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారం పోతుందేమోనన్న భయం ముఖ్యమంత్రిలో మొదలైందని, నిన్నటి సమావేశంలో అది కని

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నిన్న ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల్లో బెదిరింపు ధోరణి, అహంకారం స్పష్టంగా కన్పించాయని తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

గురువారం ఉత్తమ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం తన స్థాయికి తగినట్టు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. అధికారం పోతుందేమోనన్న భయం ముఖ్యమంత్రిలో మొదలైందని, నిన్నటి సమావేశంలో అది ప్రస్ఫుటంగా కనిపించిందన్నారు.

uttam-kcr

అందుకే ఆయన అడ్డగోలుగా, అర్థరహితంగా పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై కేసు వేసింది తెలంగాణ జాగృతి సభ్యులేనన్నారు.

అస్పష్టమైన జీవోలతో తెరాస ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు ఇస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగ ప్రకటనలు, జీవోల్లో తప్పిదాల వల్లే కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Congress Telangana Chief Uttam Kumar Reddy told here on Hyderabad on Thursday that fear started in CM KCR and that was shown in yesterday's media conference at Pragathi Bhawan. Issues are continuing in the courts due to the mistakes in the GOs, he added. Uttam also said that congress not filed court cases on Singareni Employees Jobs, infact the case was filed by the members of Telangana Jagruthi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X