వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భైంసాలో నువ్వా నేనా ... బీజేపీ వర్సెస్ ఎంఐఎం

|
Google Oneindia TeluguNews

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల బలాబలాలు తెలియజేసే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి . ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల్లో అధికార టీఆర్‌ఎస్‌ దూసుకుపోతోంది. అయితే భైంసాలో మాత్రం బీజేపీ వర్సెస్ ఎంఐఎం హోరాహోరీ పోరు కొనసాగుతుంది.

మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన బీజేపీ .. ఆమన్ గల్ లో కమల వికాసంమున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన బీజేపీ .. ఆమన్ గల్ లో కమల వికాసం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని తేలిపోయింది. కారు జోరు ముందు ప్రత్యర్ధులు నిలవలేకపోతున్నారు . కానీ అందుకు భిన్నంగా పలు చోట్ల కారుకు షాక్ ఇస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బైంసాలో మాత్రం కారు జోరుకు బ్రేకులు వేసింది బీజేపీ . మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి అక్కడి పరిస్థితి భిన్నంగానే కనిపిస్తోంది. మొత్తం 26 వార్డులున్న ఈ మున్సిపాలిటీపై ఏ పార్టీ జెండా ఎగురుతుందో అన్న టెన్షన్ నెలకొంది.

fierce fight in Bhainsa ... BJP vs MIM

ప్రస్తుతం అక్కడ బీజేపీ హవా కొనసాగుతోంది. అయితే కమలం పార్టీకి ఎంఐఎం గట్టి పోటీ నిస్తోంది. 8 స్థానాల్లో బీజేపీ సత్తా చాటింది. ఏడు స్థానాల్లో ఎంఐఎం విజయఢంకా మోగించింది.
ఇటీవల భైంసాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే . ఇక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా దళాలు భారీగా మోహరించారు. సుమారు 1000 మందితో పోలీసులు బందోబస్తు మరింత పటిష్టం చేశారు.పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ర్యాపిడ్‌యాక్షన్‌ ఫోర్స్, ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్, కర్ఫ్యూ ఎత్తివేసినా పట్టణంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ఇక తాజా పరిణామాల నేపధ్యంలో భైంసా ఎవరి ఖాతాలో పడుతుంది అన్న ఉత్కంఠ నెలకొంది.

English summary
In bhainsa The situation has been different since the municipal election notification was issued . There is tension as to which party flag is flying over this municipality with a total of 26 wards. The BJP is still in lead . MIM, however, is fiercely contested for the bjp. The BJP has been consistently ranked in 8 places. MIM won in seven positions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X