హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇంటర్ విద్యార్థుల పేరెంట్స్ దీక్షలో వీహెచ్ , నగేష్ ఫైటింగ్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

అసలు కుర్చీలను వదిలి ఖాలీ కూర్చీల కో్సం కాంగ్రేస్ నేతలు భాహభహికి దిగారు. స్టేజీపైనే ఇద్దరు అగ్రనేతలు కుమ్ములాడుకున్నారు. ఒకరినొకరు తోసుకున్నారు. చొక్కాలు పట్టుకుని గుంజుకున్నారు. . ఇందిరాపార్క్ వేదికగా కాంగ్రెస్ నేతలైన వీ.హనుమంతరావు మరోనేత నగేశ్ ముదిరాజ్ ల మధ్య ఈ ఘర్షన నెలకొంది. దీంతో ఒక్కసారిగా అవక్కాయిన నేతలు కోదండరాం , అంజన్ కుమార్ యాదవ్, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు రమణ తోపాటు,మందక్రిష్ణ మాదిగలు పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ఇద్దరి మధ్య గొడవకు సాక్ష్యులయ్యారు.

ఇంటర్ విద్యార్థులకు సంఘీభావంగా సమావేశం...

ఇంటర్ విద్యార్థులకు సంఘీభావంగా సమావేశం...

ఇటివల తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయం నేపథ్యంలో వారికి సంఘీభావంగా ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి నిరసన దీక్షను చేపట్టాయి. ఇందులో టీఆర్ఎస్ యెతర పార్టీలైన కాంగ్రెస్ ,టీడీపీ లతో కమ్యునిస్టు పార్టీల నేతలు, ప్రో.కొదండరాంలు ఇతర ప్రజా సంఘాల నాయకులు ఆ సంఘీభావ దీక్షలో పాల్డోన్నారు. ఈసంధర్భంలోనే కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు, మరోనేత అయిన నగేష్ ముదిరాజ్ ల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఒకరి కొకరు నెట్టుకున్నారు. క్రిందపడి కుమ్ములాడుకున్నారు.

వీహెచ్ మాట్లాడుతున్న సమయంలో ఘర్షణ

నిరసన దీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావు స్టేజీపై మాట్లాడుతున్నారు. అప్పటికే ఆ స్టేజీపై నాయకులు కూర్చోని ఉన్నారు. అయితే హనుమంతరావు మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ అయిన కుంతియా అక్కడికి చేరుకున్నారు. దీంతో అది గమనించిన పార్టీ కార్యదర్శి నగేష్ కుంతియాకు కూర్చి ఇచ్చేందుకు పక్కనే ఉన్న ఖాలీ కుర్చీని ముందుగు లాగాడు. అయితే కూర్చీ గుంజడంతోపాటు కుంతియా వస్తున్నసంధర్బంలో అక్కడ సందడి నెలకొంది.

వీహెచ్ పై చేయి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నేత

వీహెచ్ పై చేయి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నేత

ఈనేపథ్యంలోనే వీహచ్ నగేష్ పై ఫైర్ అయ్యారు. మాట్లాడుతున్న సమయంలో డిస్ట్ర్రబ్ చేస్తున్నావంటూ సీరియస్ అయ్యారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆవేశంలో నగేశ్ ముందుగా వీహెచ్‌ను నెట్టివేశాడు. వీహెచ్ సైతం ఆయన పై చేయిచేసుకున్నాడు. ఇద్దరి తోపులాట జరిగింది. అసలు స్టేజీపై ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దీంతో అప్పుడే వచ్చిన పార్టీ ఇంచార్జ్ కుంతీయా వారిని వారించారు. అక్కడ ఉన్న నగేష్ ను బయటకు తీసుకుని వెళ్లారు. ఈనేపథ్యంలోనే పలువురు నేతలు పోయి గాంధిభవన్ లో కొట్టుకోండంటూ వారించారు. నగెష్ బయటికి వెళ్లిన తర్వాత తిరిగి హనుమంతరావు తన ప్రసంగాన్ని కొనసాగించారు.

విద్యార్థి కుటుంభాలకు కోటి రుపాయల ఎక్స్‌గ్రేషియా డిమాండ్

విద్యార్థి కుటుంభాలకు కోటి రుపాయల ఎక్స్‌గ్రేషియా డిమాండ్

అనంతరం మృతి చెందిన ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు కోటి రుపాయాల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలే అంటూ దుయ్యబట్టారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 26 మంది విద్యార్థులు చనిపోయిన ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని పలువురు నేతలు విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.

English summary
Fight between congress leaders at indirapark, congress leader v hanumataa rao attaked another congress leader nagesh .meeting were conducted for inter students suicide. in this meeting congress , tdp, cpim, cpm parties were participated
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X