వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిభక్త కవలల అవిశ్రాంత పోరాటం.. పదో తరగతి పరీక్షలకు వీణావాణీలు సిద్ధం

|
Google Oneindia TeluguNews

పదో తరగతి పరీక్షలు అవిభక్త కవలలు వీణా వాణీ లకు పెద్ద తలనొప్పిగా మారాయి. చదువుకోవాలనే ఆశ ఉన్నా , అవిభక్త కవలలుగా శారీరక ఇబ్బంది ఉన్నా తమ సమస్యను అధిగమించి చదువుకున్నా వారికి పదో తరగతి పరీక్ష రాయటం కత్తి మీద సాము అనే చెప్పాలి . తమ పరిస్థితి దృష్టిలో పట్టుకుని తాము పరీక్షలు రాయటానికి అనుమతి ఇవ్వాలని కోరిన వీణా వాణీ లకు పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు ఇచ్చి వారు పరీక్ష రాయటానికి ఏర్పాట్లు చేస్తుంది విద్యా శాఖ .

అవిభక్త కవలలు వీణావాణీలకు వేర్వేరు హాల్‌టిక్కెట్లు

అవిభక్త కవలలు వీణావాణీలకు వేర్వేరు హాల్‌టిక్కెట్లు

పదో తరగతి పరీక్షలకు సిద్ధపడుతున్న అవిభక్త కవలలు వీణావాణీలకు వేర్వేరు హాల్‌టిక్కెట్లు ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌, వెంగళ్‌రావునగర్‌ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వీణా వాణీలకు అదే సెంటర్‌లో పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు . చదువులో కూడా అవిభక్త కవలలు అయినప్పటికీ పరీక్ష రాసే సామర్ధ్యాలు వారికి ఉన్నాయని గుర్తించిన విద్యా శాఖ వారికి వేరు వేరుగా హాల్ టికెట్స్ కేటాయించింది.

వారు అడిగితే సహాయకులను కూడా ఏర్పాటు చేస్తామన్న విద్యా శాఖ

వారు అడిగితే సహాయకులను కూడా ఏర్పాటు చేస్తామన్న విద్యా శాఖ

ఇక వారు పరీక్ష రాయటానికి అవసరం అని వారు అడిగితే సహాయకులను కూడా ఏర్పాటు చేస్తామని విద్యా శాఖ చెప్తుంది. 2016 వరకు నిలోఫర్‌ ఆస్పత్రిలో ఉన్న వీణా వాణీలను 2017లో స్టేట్‌హౌంకు తరలించారు. వీణా వాణీలు అక్కడ ప్రత్యేక ఉపాధ్యాయుల పర్యవేక్షణలో చదువుతున్నారు. ఈ ఏడాది వారు పదోతరగతి పరీక్షలను రాయనున్నారు. ఇక ఇటీవల వీరు ఎస్‌ఎస్‌సీ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు.

వారి సామర్ధ్యాలను తెలుసుకునే రెండు హాల్ టికెట్లు

వారి సామర్ధ్యాలను తెలుసుకునే రెండు హాల్ టికెట్లు

ఇక ఇద్దరూ అవిభక్త కవలలు కాబట్టి ఇద్దరికీ కలిపి ఒకే హాల్‌టికెట్‌ ఇవ్వాలా? వేర్వేరుగా ఇవ్వాలా? అనే అంశంపై బోర్డు అధికారులు పలు మార్లు చర్చలు జరిపి వారి సామర్ధ్యాల గురించి అడిగి తెలుసుకుని ఎట్టకేలకు ఇద్దరికీ వేర్వేరుగా రెండు హాల్‌టికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు. మరో రెండు మూడు రోజుల్లో వీరికి హాల్‌ టికెట్లు అందజేసే అవకాశం ఉంది.
వీణా వాణీలు తలలు అతుక్కుని పుట్టిన వీరికి చిన్న నాటి నుండి పలు మార్లు ఆపరేషన్ చెయ్యాలని, వీరిని వేరు చెయ్యాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ విఫలం అయ్యాయి.

అవిభక్త కవలలుగా అనుక్షణం నరకం

అవిభక్త కవలలుగా అనుక్షణం నరకం

వైద్యులు ఆపరేషన్ చేస్తే ఒకరే బ్రతికే చాన్స్ ఉందని, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అన్న గ్యారెంటీ లేదని చెప్పటంతో ఆపరేషన్ ఆలోచన విరమించుకుంది. ఇక వారిద్దరూ పెరిగి పెద్ద వాళ్ళు అవుతున్నారు. ఇక వీరు అవిభక్త కవలలుగా అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు . వీరిలో ఒకరి ముఖం కింది వైపు చూస్తుంటే.. మరొకరిది పైకి చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ వీణా వాణీలు చదువును కొనసాగిస్తున్నారు.

Recommended Video

Melania Trump Planning To Implement Indian Students Skills In USA | Oneindia Telugu
 పట్టుదలతో పది పరీక్షలకు వీణావాణీలు

పట్టుదలతో పది పరీక్షలకు వీణావాణీలు


వారు కూర్చొని స్వయంగా పరీక్ష రాసే అవకాశం లేకున్నా పరీక్షలు రాయాలని సాహసం చేస్తున్నారు. వీణావాణీలు కోరితే ఇద్దరికీ స్క్రైబ్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. మరి ఈ విషయంలో వారు పరీక్షలు స్వయంగా రాస్తారా ? లేకా ఎవరైనా సహాయకుల ద్వారా చెప్పి రాయిస్తారా అనేది తెలియాల్సి ఉంది . శారీరక ఇబ్బంది ఉన్నా , పట్టుదలతో పదోతరగతి దాకా వచ్చి ఇప్పుడు పరీక్షలకు సిద్ధం అవుతున్న వీణా వాణీలకు హ్యాట్సాఫ్ చెబుదాం. పదోతరగతి పరీక్షల వేళ ఆల్ ది బెస్ట్ చెబుదాం .

English summary
The undivided twins, who are preparing for the tenth class examinations, will be given different hall tickets for Veena-vani, according to education officials. Veena-vani, who is studying in the 10th class of the government school in Hyderabad and Vengala Rao Nagar, is planning to take the tenth class examination at the same center. Recognizing that they have the ability to write exams even though they are undivided twins , the Department of Education allocated them hall tickets separately. they said if Veena-Vani asks for scribes they will provide .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X