హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఖిల్ ఎఫెక్ట్: క్రిమినల్ కేసులో హీరో నితిన్, సోదరి నిఖితా రెడ్డిలకు ఊరట

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో నటుడు నితిన్, ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం ఊరట లభించింది. నితిన్, ఆయన సోదరి నిఖితా రెడ్డిలపై మల్కాజిగిరి కోర్టులో ఉన్న క్రిమినల్ కేసును న్యాయస్థానం కొట్టివేసింది.

తప్పుచేశా, అందరికీ చెప్తా: కౌన్సెలింగ్ తర్వాత యాంకర్ ప్రదీప్, ఆ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరితప్పుచేశా, అందరికీ చెప్తా: కౌన్సెలింగ్ తర్వాత యాంకర్ ప్రదీప్, ఆ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

కేసును కొట్టివేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. అఖిల్‌ సినిమాకు సంబంధించిన హక్కులు ఇస్తామంటూ రూ.50 లక్షలు తీసుకుని, ఆ తర్వాత ఇవ్వకుండా మోసం చేశారని సికింద్రాబాద్‌కు చెందిన జి సత్యనారాయణ మల్కాజిగిరి కోర్టులో ఫిర్యాదు చేశారు.

 నితిన్, నిఖితా రెడ్డిలు నిందితులుగా

నితిన్, నిఖితా రెడ్డిలు నిందితులుగా

ఇందులో నితిన్‌తో పాటు ఆయన సోదరి నిఖితా రెడ్డి, తండ్రి సుధాకర్ రెడ్డిలను, శ్రేష్ఠ్‌ మూవీస్‌ను నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన ఇరవయ్యవ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది.

కేసు కొట్టివేయాలని వేర్వేరుగా

కేసు కొట్టివేయాలని వేర్వేరుగా

అయితే, ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ నితిన్‌, నిఖితా రెడ్డి తదితరులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారం చెక్కులకు సంబంధించిన సివిల్‌ వివాదమని, క్రిమినల్‌ కేసు పెట్టడం సరికాదన్నారు.

 నితిన్, నిఖితా రెడ్డిలు భాగస్వాములంటూ తప్పుగా

నితిన్, నిఖితా రెడ్డిలు భాగస్వాములంటూ తప్పుగా

అంతేకాకుండా, శ్రేష్ట మూవీస్ సంస్థలో నితిన్, నిఖితా రెడ్డిలు భాగస్వాములంటూ తప్పుగా పేర్కొని ఫిర్యాదు చేశారని, అందులో వారు భాగస్వాములు కాదని న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ వాదనను హైకోర్టు ఆమోదించి కేసును కొట్టివేసింది.

 2017లో ఈ కేసు నమోదు

2017లో ఈ కేసు నమోదు

సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురికి చెందిన సత్యనారాయణ 2017 సెప్టెంబర్ నెలలో ఈ కేసు వేశారు. శ్రేష్ట మూవీస్‌ను మొదటి, సుధాకర్ రెడ్డిని రెండు, నితిన్, నిఖితలను మూడు, నాలుగో నిందితులుగా పేర్కొన్నారు.

English summary
In a relief to actor Nithin and his family members, the Hyderabad High Court has recently quashed the case pending against Nithin, his father and producer Sudharkar Reddy and sister Nikitha Reddy before the II Additional junior civil judge and 20th Metropolitan Magistrate Court, Cyberabad relating to Telugu feature film
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X