హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభిమానులకు శుభవార్త!: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం? గందరగోళానికి చెక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తారా, చేయరా అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఆయన తెలంగాణ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా సినిమాలపై మరోసారి స్పందించారు. సినిమాలకు స్వస్తీ చెబుతున్నానని చెప్పారు.

Recommended Video

జై తెలంగాణ అంటూ పవన్ ఉద్వేగం : తెలంగాణ కోసం నా రక్తం ఇస్తా !

చిరంజీవే ఉన్నాడు, అవసరమైతే గొడవ పెట్టుకుంటా: విజయశాంతికి పవన్ కళ్యాణ్ కౌంటర్!చిరంజీవే ఉన్నాడు, అవసరమైతే గొడవ పెట్టుకుంటా: విజయశాంతికి పవన్ కళ్యాణ్ కౌంటర్!

అంతేకాదు, పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీసేందుకు కొందరు నిర్మాతలు ఆయనకు అడ్వాన్స్‌లు ఇచ్చారు. వాటిని కూడా ఆయన తిరిగి ఇచ్చారని ఇప్పటికే అంటున్నారు. అయితే, సినిమాల నుంచి విరమిస్తానని పవన్ తీసుకున్న నిర్ణయం తాత్కాలికమా.. శాశ్వతమా అనే చర్చ సాగుతోంది.

అది ముఖ్యం కాదు, ఫ్యాన్స్‌కు ఝలక్: పవన్ లక్ష్యం 2019 కాదు, మరో 30 ఏళ్లుఅది ముఖ్యం కాదు, ఫ్యాన్స్‌కు ఝలక్: పవన్ లక్ష్యం 2019 కాదు, మరో 30 ఏళ్లు

పవన్ చేతిలో రెండు సినిమాలు, కానీ

పవన్ చేతిలో రెండు సినిమాలు, కానీ

అజ్ఞాతవాసి తర్వాత పవన్‌ నటించే సినిమా ఏదన్నది ఇంత వరకూ తేలలేదు. పవన్‌ చేతిలో రెండు సినిమాలున్నాయి. అయితే వాటిలో ఏది ముందు పట్టాలెక్కుతుందో తెలీక అభిమానులు గందరగోళానికి గురవుతున్నారని తెలుస్తోంది. అంతలోనే తాను సినిమాలు చేయనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అడ్వాన్స్ వెనక్కి ఇచ్చారనే ప్రచారం సాగుతోంది.

పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

పవన్‌ కళ్యాణ్ తన కెరీర్‌కి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని పవన్ భావిస్తున్నారట. ప్రస్తుతం జనసేన పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజలలోకి వెళ్లేందుకు పవన్‌ సన్నాహాలు చేస్తున్నారు. అందుకే సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు.

 2019 లక్ష్యంగా, దృష్టి పెట్టలేనని

2019 లక్ష్యంగా, దృష్టి పెట్టలేనని

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలపై దృష్టి పెట్టలేనని, పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నానని, కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటానని అంటున్నారు సన్నిహితుల వద్ద చెబుతున్నారని తెలుస్తోంది. ఈ విరామం తాత్కాలికమా? శాశ్వతమా? తెలియక ఫ్యాన్స్, నిర్మాతలు అయోమయానికి గురవుతున్నారట.

సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు

సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు

2019 ఎన్నికలు పూర్తయ్యే వరకూ పవన్‌ కళ్యాణ్ సినిమాలు చేయరని, ఆ తర్వాత మాత్రం రెండేళ్లకు ఓ సినిమా చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారని తెలుస్తోంది. ఇది అభిమానులకు సంతోషాన్ని ఇచ్చే విషయమే.

 రాజకీయాలు, సినిమాలు

రాజకీయాలు, సినిమాలు

పవన్ తెలంగాణ పర్యటనలో మాట్లాడుతూ.. 2019 లక్ష్యం కాదని, మార్పు కోసం మరో 25, 30 ఏళ్లయినా పోరాడుతానని, అందుకు అభిమానులు సిద్ధమా అని ప్రశ్నించారు. అయితే 2019 వరకు సినిమాలు తీయకుండా ఆ తర్వాత మాత్రం రాజకీయాలపై దృష్టి పెడుతూ సినిమాలు తీస్తారని అంటున్నారు.

English summary
Pawan Kalyan’s recent release Agnyaathavaasi has not done much good for the makers and distributors as the movie turned out to be a disaster at the box office. Not just that, they might also be sued by Jerome Stalle, who directed the French film Largo Winch for plagiarism. Pawan Kalyan has, however, not made any comments regarding the same. The Jana Sena party chief is gearing up for the upcoming assembly elections in Telangana and Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X