• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ‌హిష్క్రుత ఎమ్మెల్యేల విష‌యంలో కాంగ్రెస్ లో క‌ద‌లిక‌..

|

తెలంగాణ కాంగ్రేస్ పార్టీ నేత‌లు ఎట్ట‌కేల‌కు అదికార పార్టీని ప్ర‌శ్నించారు. అసెంబ్లీ నుండి బ‌హిష్కరించిన త‌మ ఎమ్మెల్యేల త‌రుపున గ‌ళం విప్పేందుకు తెలంగాణ శాస‌న‌స‌భ‌కు వ‌చ్చారు. అదికూడా ప్ర‌తిప‌క్ష నేత జానారెడ్డి నేత్రుత్వంలో ఎమ్మెల్యేలంద‌రూ స్పీక‌ర్ మ‌ధుసూద‌నా చారిని సంప్ర‌దించారు. బ‌హిష్క్రుత ఎంఎల్యేల అంశంలో కోర్టు ఆదేశాల‌ను కూడా ఎందుకు ఉల్లంఘిస్తున్నార‌ని స్పీక‌ర్ ను ప్ర‌శ్నించారు. ఒక్క ఎమ్మెల్యేల విష‌యంలోనే కాకుండా ఇత‌ర ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ఇదే త‌ర‌హాలో స‌మిష్టిగా పోరాడితే ఫ‌లితాలు అన‌పుకూలంగా ఉంటాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

 ఎట్ట కేల‌కు పెద‌వి విప్పిన సీఎల్పీ నేత జానారెడ్డి.

ఎట్ట కేల‌కు పెద‌వి విప్పిన సీఎల్పీ నేత జానారెడ్డి.

అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైన ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నాయకత్వం ఇన్ని రోజులు పట్టించుకోలేదు. కోర్టులు అండగా నిలిచినప్పటికి సిఎల్పీ మాత్రం దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలైంది. బాదిత ఎమ్మెల్యేలకు అండగా నిలవాలన్న ఆలోచన నాయకుల్లో లేకపోవడంతో ఈ విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేక పోయారు.నిజానికి హైకోర్టు తీర్పుతో కేసీఆర్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రిట్ పిటిషన్ ను కొట్టేయడంతో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. టీఆర్ఎస్ చర్యను కోర్టు తప్పుపట్టినట్లైంది. అయిన్పటికి కాంగ్రెస్ లో చలనం లేదు. మీడియా సమావేశాలు పెట్టి గంభీరమైన డైలాగ్ లు చెప్పడం తప్ప కార్యాచరణ లేదు.

కోర్టు ఆదేశాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నా క్యాష్ చేసుకునే ప‌రిస్థితిలు లేవు..

కోర్టు ఆదేశాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నా క్యాష్ చేసుకునే ప‌రిస్థితిలు లేవు..

ఆంధ్రప్రదేశ్ లో తన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తు జగన్ ఏకంగా అసెంబ్లీనే బహిష్కరించారు. మళ్ళీ ఎన్నికల వరకు ఆ పార్టీ అసెంబ్లీకి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. కాని తెలంగాణ లో కాంగ్రెస్ కు ఏ మాత్రం సీరియస్ నెస్ లేదు. తమ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పటికి ఆ పార్టీ స్పందించిన తీరు నామమాత్రంగా ఉంది. ఫిరాయింపు పిటిషన్ల పైన స్పీకర్ మధుసుదనాచారి వైఖరీని ప్రశ్నించడంలో కాంగ్రెస్ బాగా వెనకపడింది. తాజాగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్ రావు బహిరంగంగానే గులాబీ కండువా కప్పేశారు. కాంగ్రెస్ మెతకవైఖరీ కారణంగా ఫిరాయింపుల పర్వం కొనసాగుతూనే ఉంది.

 అదికార పార్టీని ప్ర‌శ్నించ‌డంలో వెన‌క‌డుగు వేస్తున్న టీ కాంగ్రెస్..

అదికార పార్టీని ప్ర‌శ్నించ‌డంలో వెన‌క‌డుగు వేస్తున్న టీ కాంగ్రెస్..

కాంగ్రెస్ నాయ‌కులు స్పీకర్ ను నిలదీసే విషయంలో సిఎల్పీ నీళ్లు నములుతున్న తీరు టీఆర్ఎస్ కు మరింత స్వేచ్ఛనిస్తోంది. అయితే కోమటిరెడ్డి, సంపత్ వ్యవహారం కాంగ్రెస్ కు మంచి అవకాశాన్ని ఇచ్చింది. కాని సమయానుకులంగా వినియోగించుకోవడంతో విఫలం కావడంతో జనంలో చర్చ లేకుండా పోయింది. ఆ ఇద్దరి వాదనలు ఆరణ్యరోదనలుగానే మారిపోయాయి. అయితే ఎట్టకేలకు జానారెడ్డి కదిలి స్పీకర్ ఛాంబర్ వరకు రాగల్గారు. కోర్టు ఆదేశాలను అనుసరించి కోమటిరెడ్డి,సంపత్ లను ఎమ్మెల్యేలుగా గుర్తించాలని ఆయన నాయకత్వంలోని ఎమ్మెల్యేలు సభాపతి మధుసుదనాచారిని కోరారు.

రేవంత్ రెడ్డి లాంటి నేత‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్న క్యాడ‌ర్

రేవంత్ రెడ్డి లాంటి నేత‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్న క్యాడ‌ర్

అయితే స్పీకర్ ను నిలదీయడంతో వారు విఫలమయ్యారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి మాత్రం సభాపతిని గట్టిగా నిలదీసి కడిగేసే ప్రయత్నం చేశారు. ఎందుకు కోర్టు ఆదేశాలను పాటించడం లేదని స్పీకర్ ను ఆయన పదే పదే నిలదీశారు. దీంతో సభాపతి తన కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారని సమాచారం. రేవంత్ రెడ్డి ఇలాగే మాట్లాడితే తాను ఉండనని ఆయన తేల్చి చెప్పారట. ఈ స్థాయిలో స్పీకర్ ఒత్తిడి తెచ్చే వారు కాంగ్రెస్ లో కరవు కావడం విశేషం. జానారెడ్డి లాంటి సీనియర్ నేత నోరు తెరిస్తే సభాపతి మధుసుదనాచారి ఆత్మరక్షణలో పడటం ఖాయం. కాని ఆయన సంయమనంతోనే వ్యవహరిస్తున్నారు.దీని వల్ల జానారెడ్డికి హుందాతనం పెరుగుతుందే తప్ప రాజకీయంగా వచ్చేది మాత్రం శూన్యం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana congress leaders showed their unity. they went to telangana assembly to question regarding suspended mla's. clp leader jana reddy taken the key role to met speaker. jana reddy asked the speaker that why the government denying the court verdicts. the speaker promised the congress leaders that after discussing the issue with the government will know the details..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more