వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరీశ్ కూడా స్టార్ క్యాంపెయినర్ అయిండు. మీడియా వార్తలతో సంతోష్ స్థానంలో నియామకం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎట్టకేలకు టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో హరీశ్‌రావుకు చోటు దక్కింది. ఇటీవల ప్రకటించిన 20 మందితో కూడిన జాబితాలో ట్రబుల్ షూటర్‌ను పక్కనపెట్టారు. దీంతో మీడియాలో రకరకాలుగా వార్తలొచ్చాయి. దీంతో స్పందించిన టీఆర్ఎస్ .. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎంపీ సంతోష్‌కుమార్ స్థానంలో హరీశ్‌ను నియమించి నష్టనివారణ చర్యలు తీసుకుంది.

ఈయన యాక్టర్.. ఆయన డైరెక్టర్: దర్శకుడు చెప్పిందే చేస్తున్నారు: పవన్ పై ఘాటు విమర్శలు ఈయన యాక్టర్.. ఆయన డైరెక్టర్: దర్శకుడు చెప్పిందే చేస్తున్నారు: పవన్ పై ఘాటు విమర్శలు

మీడియాలో వార్తలు .. దిగొచ్చిన గులాబీ దళపతి

మీడియాలో వార్తలు .. దిగొచ్చిన గులాబీ దళపతి

అసెంబ్లీ ఎన్నికల తర్వాత హరీశ్‌రావును ఒంటరి చేస్తున్నారనే ప్రచారం జరిగింది. పార్టీలో సిద్దిపేట నియోజకవర్గానికే పరిమితం చేస్తున్న పరిస్థితి కనిపించింది. పార్టీ హైకమాండ్ చర్యలతో హరీశ్ కూడా మిన్నకుండిపోయారు. మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో హరీశ్ రావు పరిస్థితి ఏంటీ ? జూనియర్లకు స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో చోటు కల్పించి, సీనియర్ నేతను పక్కనపెట్టడంపై రకరకాల ఊహాగానాలు గుప్పుమన్నాయి. దీంతో తేగేవరకు లాగడం ఎందుకు అనుకుందో ఏమో టీఆర్ఎస్ అధిష్టానం .. హరీశ్ కు కూడా చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది.

కేటీఆర్‌కు ప్రమోషన్ ..? మరి హరీశ్ సంగతేంటీ

కేటీఆర్‌కు ప్రమోషన్ ..? మరి హరీశ్ సంగతేంటీ

అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పార్టీలో హరీశ్‌రావు భవిష్యత్‌తో నీలినీడలు కమ్ముకున్నాయి. దానికి తగ్గట్టు పార్టీకి అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు హరీశ్. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా మొండిచేయి చూపడంతో అసలు ఏం జరుగుతుందోననే చర్చకు దారితీసింది. హరీశ్ రావే స్వయంగా .. కేసీఆర్ ఆదేశాలను శిరసా వహిస్తానని చెప్పినా .. నిగూఢార్థం ఏముందోనని గుసగుసలు వినిపించాయి. దీనికి తగ్గట్టు టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన పార్లమెంట్ ఎన్నికల ముఖ్య ప్రచారకర్తల్లో చోటు దక్కకపోవడం అనుమానాలను మరింత ఊతమిచ్చింది.

అంతరార్థం ఇదేనా ?

అంతరార్థం ఇదేనా ?

ఇదివరకు పార్టీలో హరీశ్ కీ రోల్ పోషించేవారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీశ్ పేర్లే వినిపించాయి. కానీ గత కొన్నాళ్ల నుంచి ట్రబుల్ షూటర్ పేరు మాయమైపోతోంది. టికెట్లు దక్కించుకున్న నేతలు కూడా గతంలో లాగా కేటీఆర్, హరీశ్‌ను కాక .. కేటీఆర్ కవితను కలిసి వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాలతో హరీశ్ భవిష్యత్ ఏంటనే చర్చ జరిగింది. అందుకు తగ్గట్టే తొలుత లిస్ట్‌లో చోటు కల్పించలేదు.

అసెంబ్లీకి ఓకే .. మరి లోక్‌సభ

అసెంబ్లీకి ఓకే .. మరి లోక్‌సభ

గత అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ కాలుకి బలపం కట్టుకొని తిరిగారు. తమ అభ్యర్థుల గెలుపుకోసం శ్రమించారు. కేసీఆర్ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చారు. కానీ లోక్‌సభకు వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పార్టీలో జరుగుతోన్న పరిణామాలు ఫోర్ట్ ఎస్టేట్ కడిగేయడంతో .. దిగొచ్చి హరీశ్‌కు స్థానం ఇచ్చి .. కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ గతంలో మాదిరిగా విలువ ఇవ్వడంలేదని రాజకీయాలు తెలిసినా ప్రతి ఒక్కరిటీ అర్థమవుతోంది.

ఇత్తడైన బంగారం ?

ఇత్తడైన బంగారం ?

ఒకప్పుడు పార్టీలో హరీశ్‌రావు అంటే నిండు పున్నమి వెలుగు. కానీ నేడు కటిక అమవాస్యలా మారింది. గతంలో సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో హరీశ్‌ను బంగారంగా అభివర్ణించిన సీఎం కేసీఆర్ .. కొన్నాళ్లకే ఎందుకు దూరం పెడుతున్నారనే ప్రశ్న సామాన్యుడిని తొలచివేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేటీఆర్‌కు పట్టాభిషేకం చేసి .. హరీశ్‌ను మాత్రం విముక్తుడిని చేసే యత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడం కూడా దీనికి కారణమనే ప్రచారం జరుగుతోంది.

English summary
Finally, Harish rao got the TRS Star campainer List. he has been abandoned in a recently announced 20 list. The news was reported in various media. The TRS responded to this and corrected. Harish was replaced by MP Santosh kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X