వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్ఫ్‌లో మగ్గిన కార్మికులకు విముక్తి : స్వదేశం చేరిన తెలంగాణ వాసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పొట్ట చేత పట్టుకొని .. ఉన్న వారిని, కన్నవారిని వదిలివెళ్లి గల్ఫ్‌లో మగ్గుతున్న 39 మందికి విముక్తి కలిగింది. దాదాపు ఏడాదిన్నర నుంచి జైల్లో ఉంటున్న వారికి ఎట్టకేలకు విడుదలయ్యారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతోనే తమకు విముక్తి కలిగిందని వారు చెప్తున్నారు.

ఎట్టకేలకు విముక్తి ..
సౌదీ అరేబియాలోని జే అండ్ పీ కంపెనీలో 39 మంది కార్మికులు బందించబడ్డ వారికి ఎట్టకేలకు స్వేచ్చ వాయువులు పీల్చగలిగారు. దాదాపు ఏడాదిన్నర నుంచి పని చేయించుకుంటున్న వేతనం ఇవ్వడం లేదు. అంతేకాదు సరైన ఆహారాన్ని కూడా అందించకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం కేటీఆర్‌కు తెలియడంతో విదేశాంగ శాఖ విన్నవించారు. దీంతో ఆ కంపెనీలో ఉన్న వారిని విడుదల చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం అంగీకరించి .. రిలీజ్ చేసింది.

finally labours come to telangana

హమ్మయ్య ..
సౌదీ అరేబియా నుంచి సోమవారం కార్మికులు హైదరాబాద్ చేరుకున్నారు. కార్మికులు అంతా కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారే. వీరితోపాటు 60 మంది వరకు వెళ్లారు. కానీ మిగతావారి కొంచెం మంచి కంపెనీలో ఉపాధి రావడంతో వారు అక్కడే ఉన్నారు. హైదరాబాద్ చేరుకున్న వీరికి తెలంగాణ ప్రభుత్వం బస్సు చార్జీల కోసం తలా వెయ్యి రూపాయలు అందజేసింది. గల్ఫ్‌లో ఉన్న కార్మికులు తమ సమస్యను ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు తెలియజేశారు. దీంతో కార్మికుల సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కేటీఆర్ కోరారు. దీంతో ఆయన కేంద్ర విదేశాంగ అధికారుల సహాయం తీసుకొని వారు స్వదేశం వచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. వారి కృషి ఫలించి .. కార్మికులు స్వదేశానికి చేరుకున్నారు.

English summary
J&P Company in Saudi Arabia, 39 workers were finally able to release. Working for almost a year and a half does not pay. The government of the country has agreed to release those who are in the company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X