వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంగార్డుల‌కు ఆర్థిక సాయం...! విత‌ర‌ణ చాటుకున్న పోలీస్ ఉన్న‌తాదికారి..!!

|
Google Oneindia TeluguNews

సిరిసిల్ల‌/హైద‌రాబాద్ : పోలీసు ఉన్న‌తాదికారులు క్రింది స్థాయి సిబ్బందిని ఇబ్బందుల‌కు గురిచేస్తూ వారివారి వ్య‌క్తిగ‌త ప‌నులు చేయించుకుంటార‌ని ఓ అవాదు ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంది. కాని రోజులు మారుతున్నాయి. పోలీసు ఉన్న‌తాదికారులు కూడా మ‌న‌సున్న మారాజులుగా ముద్ర వేసుకుంటున్నారు. క్రింది స్థాయి ఉద్యోగుల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి చూస్తూ వారి క‌ష్టాల‌ను, క‌న్నీళ్ల‌ను అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ లో ఓ పోలీసు ఉన్న‌తాదికారి త‌న వ‌ద్ద ప‌నిచేసే హోం గార్డుల‌కు ఆర్థిక సాయం చేసి త‌న విత‌ర‌ణ చాటుకున్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా: హోం గార్డులకు వడ్డీ లేని రుణాలను అందించాడో పోలీసు ఉన్నతాధికారి. వివరాల్లోకి వెళ్తే... రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న హోమ్ గార్డులకు వడ్డీ లేని రుణాలను జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే అందించారు.

Financial aid to the home guards...! Police official kind heart. !!

జిల్లాలో పలు విధులలో ఉన్న హోమ్ గార్డులు వారి కుటుంబ ఆర్థిక అవసరాల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న దాదాపు 30 మందికి ఒక్కొకరికి 20 వేళా రూపాయలు మొత్తం 6,00,000/- ఆరు లక్షల రూపాయల చెక్కు ని అందజేశారు. ఈ నగదు ని జిల్లా హోమ్ గార్డు వెల్ఫేర్ ఫండ్ నుండి అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా రుణం పొందిన వారు ఎలాంటీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. వడ్డీ అనేదే లేకుండా ప్రతి నెల వారి జీతం నుండి 2000 రూపాయల చొప్పున రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా హోం గార్డుల విధులు అన్ని విధుల కన్నా భిన్నం అని, విధుల్లో ఒత్తిడిని జయించాలన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రమణ్యం నాయుడు ఆర్ ఐ, రవీందర్ హెడ్ కానిస్టేబుల్, దేవరాజు, రవి స్వరూప లు, హోం గార్డుల కుటుంబాలు పాల్గొన్నాయి.

English summary
District SP Shri Rahul Hegde has provided interest free loans for home guards working in Sirisila district. The home guards in various duties in the district handed over Rs 6,00,000 / - six lakh checks to each of the 30 applicants for their family's financial needs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X