వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం: భారీ పేలుడు: లోపలే 9 మంది: రెస్క్యూనకు ఆటంకం

|
Google Oneindia TeluguNews

నాగర్ కర్నూలు: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో సంఘటనా స్థలంలో 19 మంది ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. తొలుత భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. అనంతరం దట్టమైన పొగ థర్మల్ కేంద్రాన్ని చుట్టుముట్టింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 10 మందిని వెలుపలికి తీసుకొచ్చారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

Recommended Video

Srisailam Hydroelectric Power Station లో భారీ అగ్నిప్రమాదం! లోపలే చిక్కుకున్న 9 మంది ఉద్యోగులు...!!
 తెలంగాణ పరిధిలోని

తెలంగాణ పరిధిలోని

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం తెలంగాణ పరిధిలోకి వస్తుంది. తెలంగాణ జెన్‌కో ఆధీనంలో ఇది పని చేస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం పరిధిలోకి వచ్చే ప్రాంతం అది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. థర్మల్ కేంద్రంలోని నాలుగో టెర్మినల్ మొదటి యూనిట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్యానెల్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని, ఆ తరువాత మంటలు చెలరేగాయని చెబుతున్నారు. భారీ పేలుడుతో ఈ ప్యానెల్ బోర్డు పేలిపోయిందని, ఆ వెంటనే దట్టమైన పొగతో అగ్నికీలలు వ్యాపించాయని విధి నిర్వహణలో ఉన్న కొందరు ఉద్యోగులు పేర్కొన్నారు.

ప్యానెల్‌లో భారీ పేలుడు..

శ్రీశైలం రిజర్వాయర్‌లో గరిష్ఠస్థాయి నీటిమట్టం ఉన్నందున..జలవిద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతోంది. మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు నిరంతరాయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్యానెల్‌లో పేలి ఉంటుందని అనుమానిస్తున్నారు. భారీ పేలుడుతో ప్యానెల్ బోర్డు పేలిపోయిన వెంటనే దట్టమైన పొగ మొత్తం జలవిద్యుత్ కేంద్రం నాలుగో టెర్మినల్‌ మొత్తాన్ని వ్యాపించింది. మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

లోపల చిక్కుకున్న వారు వీరే..


సహాయక కార్యక్రమాలను చేపట్టారు. 10 మంది ఉద్యోగులను బయటికి తీసుకుని వచ్చారు. వారిని ఆసుపత్రికి తరలించారు. యూనిట్ లోపలే చిక్కుకున్న ఉద్యోగుల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రమాదం సంభవించిన తరువాత గంట వరకు కూడా వారు ఫోన్‌లో అందుబాటులో ఉన్నారని సురక్షితంగా బయటపడిన ఉద్యోగులు వెల్లడించారు. లోపల చిక్కుకున్న వారిని డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజినీర్లు, వెంకట్రావ్, ఫాతిమా, మోహన్, సుష్మా, కుమార్, సుందర్, కిరణ్, రాంబాబుగా గుర్తించారు.

పరామర్శించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి..

పరామర్శించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి..

ప్రమాదం వివరాలు అందుకున్న వెంటనే తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. దట్టమైన పొగ వ్యాపించడం వల్ల సహాయక సిబ్బంది లోనికి వెళ్లలేకపోతున్నారని జగదీశ్వర్ రెడ్డి చెప్పారు.ఆక్సిజన్ మాస్కులను ధరించినప్పటికీ.. లోనికి వెళ్లడం సాధ్యం కాలేదని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఉద్యోగులను జగదీశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రావు పరామర్శించారు. సంఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

English summary
Fire Accident at Srisailam left bank Hydel Power Generation Station early morning of Friday. The Hydel power Station under control by the Telangana State Genco.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X