హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొంపముంచిన అత్యుత్సాహం: దీపాల వేళ..అగ్నిప్రమాదాలు: హైదరాబాద్‌లో బైక్: కరోనా దిష్టిబొమ్మ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా వైరస్‌పై పోరాటం కొనసాగిస్తోన్న వేళ.. దేశవ్యాప్తంగా పలుచోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. హైదరాబాద్ సహా దేశంలోని ఇతర నగరాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల వల్ల ప్రాణాపాయం తప్పినప్పటికీ.. కొన్ని చోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం.. బాణాసంచా కాల్చడమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీపాలన ముట్టించాల్సిన సమయంలో కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, భారీగా పటాసులను పేల్చారని, ఫలితంగా ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రధానమంత్రికి కరోనా తీవ్రం: హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు: హోమ్ క్వారంటైన్‌లో గడిపి..ప్రధానమంత్రికి కరోనా తీవ్రం: హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు: హోమ్ క్వారంటైన్‌లో గడిపి..

అగ్నిప్రమాదాలకు కారణమైన అత్యుత్సాహం..

హైదరాబాద్ సహా రాజస్థాన్ రాజధాని జైపూర్, మహారాష్ట్రలోని షోలాపూర్, బిహార్‌ రాజధాని పాట్నాలల్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కరోనాపై పోరాటాన్ని కొనసాగించడంలో భాగంగా రాత్రి 9 గంటలకు ప్రతి ఇంట్లో లైట్లను ఆర్పివేసి, దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. బాణాసంచాను పేల్చారు. తారాజువ్వలను వదిలారు. వాటి ఫలితంగా ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు.

అగ్నిప్రమాదాలకు కారణమైన అత్యుత్సాహం..

హైదరాబాద్ సహా రాజస్థాన్ రాజధాని జైపూర్, మహారాష్ట్రలోని షోలాపూర్, బిహార్‌ రాజధాని పాట్నాలల్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కరోనాపై పోరాటాన్ని కొనసాగించడంలో భాగంగా రాత్రి 9 గంటలకు ప్రతి ఇంట్లో లైట్లను ఆర్పివేసి, దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. బాణాసంచాను పేల్చారు. తారాజువ్వలను వదిలారు. వాటి ఫలితంగా ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు.

హైదరాబాద్‌లో బైక్ దగ్ధం..

హైదరాబాద్‌లో బైక్ దగ్ధం..

హైదరాబాద్‌లో అమీర్‌పేట్, మెహదీపట్నం వంటి చోట్ల స్వల్పంగా అగ్నిప్రమాదాలు నమోదైనట్లు తెలుస్తోంది. మెహదీపట్నంలో ఓ బైక్ దగ్ధమైంది. జైపూర్‌లో నిప్పురవ్వలు పడటం వల్ల ఓ ఇంటి డాబామీద మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్ని మంటలను ఆర్పివేశాయి. మహారాష్ట్రలోని షోలాపూర్ విమానాశ్రయంలో భారీగా మంటలు చెలరేగాయి. తారాజువ్వలు పడటం వల్ల రన్‌వే పక్కన ఉన్న ఎండు గడ్డి మంటలకు అంటుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వాటిని వ్యాపించకుండా ఆర్పివేశారు.

గుంపులుగా.. కరోనా దిష్టిబొమ్మ దగ్ధం..

పాట్నా సమీపంలోని రామకృష్ణా నగర్‌లో బాణాసంచా పేల్చడం వల్ల మంటలు వ్యాపించాయి. కొన్ని దుకాణ సముదాయాలు మంటల బారిన పడ్డాయి. స్థానికులు అప్రమత్తం అయ్యేసరికి జరాగాల్సిన నష్టం జరిగిపోయింది. కొన్ని దుకాణాలు కాలిపోయాయి. మహారాష్ట్రలోని ఓ పట్టణంలో స్థానికులు కరోనా వైరస్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం కనిపించింది. గుంపులు గుంపులుగా వెళ్లిన జనం.. పట్టణం నడి మధ్యలో కరోనా వైరస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

English summary
Fire incidents reported in Hyderabad after crackers bursting on Sunday night. The incidents were reported to took place in Ameerpet, Mehdipatnam and different cities across the country. People light candles, diyas to mark fight against COVID-19. Firecrackers burst by some people while responding to Prime Minister
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X