ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాణాసంచా పేలుడు: ఇద్దరు సజీవ దహనం

|
Google Oneindia TeluguNews

నల్గొండ: జిల్లాలో జరిగిన బాణాసంచా పేలుళ్ల ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. భువనగిరిలో మంగళవారం రాత్రి 12 గంటలు తర్వాత ఆర్‌బీనగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆర్‌బీనగర్‌కు చెందిన బుస్సా శ్రీనివాస్‌ బాణాసంచా వ్యాపారం చేస్తున్నాడు. విక్రయాల కోసం భారీగా తెచ్చిన సామగ్రిని ఇంట్లో నిల్వ చేసి అమ్ముతున్నాడు.

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఛార్జింగ్‌ లైట్‌కు స్పార్క్‌ రావడంతో బాణాసంచాకు నిప్పులు తగిలాయి. దీంతో మంటలు లేచి ఇల్లంతా వ్యాపించాయి. ఈ సమయంలో అక్కడికి కొనుగోలుకు వచ్చిన రావుల నాగేశ్వరరావు(55), సాయి కల్యాణ్‌(20) భయంతో ఇంట్లోకి వెళ్లగా, దుకాణ యజమాని, భార్య, పిల్లలు బయటకు పరుగు తీశారు.
ఇంట్లోకి వెళ్లిన నాగేశ్వరరావు, కళ్యాణ్‌లు బాణాసంచా పేలుడుకు అక్కడికక్కడే మృతి చెందారు.

అసిఫాబాద్‌లో అగ్నిప్రమాదం

Fireworks blast in Nalgonda

మరో ఘటనలో ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జడ్పీ క్రీడా మైదానంలో దీపావళి పండగ కోసం ఏర్పాటు చేసిన 12 టపాసుల దుకాణాలు నిప్పంటుకుని అగ్నికి ఆహుతి అయ్యాయి. క్రీడా మైదానంలో 12 దుకాణాలు ఏర్పాటు చేశారు.

టపాసుల దుకాణాల సమీపంలో కొనుగోలుదారులు చైనా పిస్టల్‌ను పరీక్షిస్తుండగా నిప్పు రవ్వలు దుకాణాలపై పడడంతో టపాసులు అంటుకున్నాయి. చూస్తుండగానే 12 దుకాణాలు అగ్నికి ఆహూతయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ.24 లక్షల విలువ చేసే టపాసులు, రూ.6 లక్షల నగదు, అయిదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

డిసిఎం ఢీకొని ఒకరు మృతి

డిసిఎం ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం దేవరకొండ మండలం కొండఢీమనపల్లి పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. డిండి మండలం చెర్కుపల్లి పంచాయతీ పరిధిలోని గజరాలతండాకు చెందిన మూఢావత్ వాల్య(25), మూఢావత్ హన్మలు ద్విచక్ర వాహనంపై దేవరకొండ నుంచి వెళ్తుండగా.. కొండభీమనపల్లి వైపు నుంచి దేవరకొండకు వస్తున్న డిసిఎం వీరి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూఢావత్ వాల్య అక్కడికక్కడే మృతి చెందగా, హన్మకు తీవ్రగాయాలయ్యాయి.

English summary
Fireworks blast occurred at Bhuvanagiri, in Nalgonda district on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X