హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో తొలి ఆధార్ సేవా కేంద్రం: మరిన్ని కొత్త సేవలు, ప్రాసెస్ ఇలా..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-యూఏడీఏఐ తన తొలి ఆధార్ సేవా కేంద్రాన్ని తెలంగాణలో ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. పౌరులకు ఈ కేంద్రం ఆధార్ సంబంధించిన సేవలను అందించనుంది. ఇప్పటికే వున్న ఆధార్ సెంటర్లతోపాటు ఆధార్ సేవా కేంద్రం పౌరులకు సేవలు అందంచనుంది.

దేశ వ్యాప్తంగా...

దేశ వ్యాప్తంగా...

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ఆధార్ కేంద్రాలు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. స్థానికంగా అందించే ఆధార్ సెంటర్లతోపాటు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) దేశ వ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యేకంగా ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

ఏపీలో విజయవాడ.. తెలంగాణలో హైదరాబాద్

ఏపీలో విజయవాడ.. తెలంగాణలో హైదరాబాద్

కాగా, ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో హైదరాబాద్‌లో కూడా ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని మాదాపూర్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో స్థానికంగా ఉండే ఆధార్ సెంటర్లతోపాటు 236 బ్యాంకులు, పోస్టాఫీసులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలో, బీఎస్ఎన్ఎల్ కేంద్రంల్లో పౌరులకు ఆధార సేవలు లభిస్తున్నాయి.

ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి..

ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి..

మాదాపూర్‌లోని విఠల్ రావునగర్‌లో రిలయన్స్ సైబర్ విల్లాలో ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించింది యఏడీఏఐ, వారంలో 7 రోజులుల ఈ ఆధార్ సేవా కేంద్రం పనిచేస్తుండటం గమనార్హం. రోజుకు 1000 మంది సేవలు పొందొచ్చు. ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఆధార్ సేవా కేంద్రం పనిచేస్తుంది.

ఈ ఆధార్ సేవా కేంద్రంలో సేవలు పొందాలనుకునేవారు ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. https://ask.uidai.gov.in వెబ్‌సైట్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.

ఆధార్ సేవా కేంద్రాల్లో మరిన్ని కొత్త సేవలు

ఆధార్ సేవా కేంద్రాల్లో మరిన్ని కొత్త సేవలు

పాస్ పోర్ట్ ఆఫీసుల తరహాలో ఆధార్ సేవలు అందించాలన్న ఉద్దేశంతో యూఐడీఏ
ఏఐ ఆధార్ సేవా కేంద్రాలను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది. ఆధార్ సెంటర్లతో పోలిస్తే ఆధార్ సేవా కేంద్రాల్లోనే సేవలు ఎక్కువగా, వేగంగా లభిస్తాయి. 2019 డిసెంబర్ నాటికి దేశంలోని 53 నగరాల్లో 114 ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడమే యూఐడీఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు కోసం రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. కాగా, ఇప్పటి వరకు భారతదేశంోల 17 ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తెలుగు రాష్ట్రంలో విజయవాడలో ఒకటి, హైదరాబాద్‌లో మరోటి ఉంది.

English summary
First Aadhaar Seva Kendra launched in Hyderabad in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X