ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

67 ఏళ్లుగా నో ఎంట్రీ.. మొత్తానికి బీజేపీ బోణి కొట్టిందిగా..!

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ కంచుకోట. 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ విజయం సాధించింది. 1957 నుంచి 1984 వరకు కాంగ్రెస్ హవా కొనసాగింది. ఆ తర్వాత టీడీపీ ప్రభంజనంతో హస్తం గూటి నేతలు చల్లబడ్డారు. 1984-89 కాలానికి టీడీపీ అభ్యర్థి ఎంపీగా వ్యవహరించారు. 1989-91 సమయంలో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.

ఇక 1991 నుంచి 2004 వరకు టీడీపీ అభ్యర్థుల హవానే కొనసాగింది. ఇక 2004 నుంచి 2019 వరకు రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవగా.. ఒక్కసారి టీడీపీ.. మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇంత సుదీర్ఘ కాలంలో బీజేపీ హవా నడవలేదు. తొలిసారిగా ఈసారి ఆదిలాబాద్ ఇలాకాలో బీజేపీ జెండా రెపరెపలాడింది.


కేసీఆర్ వల్ల ఆ మూడు చోట్ల గెలుపు..! పెద్దపల్లి విషయంలో బీజేపీ తప్పటడుగు

మొదట్లో కాంగ్రెస్ కంచుకోట

మొదట్లో కాంగ్రెస్ కంచుకోట

ఆదిలాబాద్ ఇలాకాలో టీఆర్ఎస్ రాకముందు వరకు కాంగ్రెస్, టీడీపీ రాజ్యమేలాయి. ఆదిలాబాద్ లోక్‌సభను ఆ రెండు పార్టీలే షేర్ చేసుకున్నాయి. 1952లో ఆదిలాబాద్ లోక్‌సభ ప్రస్థానం మొదలు ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థుల ప్రాతినిధ్యమే లేదు. ఈసారి మాత్రం అనూహ్యంగా ఆదిలాబాద్ గడ్డపై బీజేపీ జెండా రెపరెపలాడింది. ఆ పార్టీ నుంచి పోటీచేసిన సోయం బాపురావు 58 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఎక్కడా చూసినా కారు జోరు కొనసాగింది. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టిదెబ్బ తగిలింది. అదే క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఊహించని షాక్ తగిలింది. సారు..కారు..పదహారు అంటూ క్లీన్ స్వీప్‌పై ఆశలు పెట్టుకున్న గులాబీ నేతల ఆశలు ఆవిరయ్యాయి. కేవలం తొమ్మిది స్థానాలకే టీఆర్ఎస్ విజయం పరిమితమైంది.

 టీడీపీ వచ్చాక సైకిలుదే హవా

టీడీపీ వచ్చాక సైకిలుదే హవా

ఆదిలాబాద్ లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కనిపించింది. ఈ మూడు పార్టీల అభ్యర్థులకు 3 లక్షలకు పైగా ఓట్లు రావడం గమనార్హం. చివరకు ఆదిలాబాద్‌లో గులాబీ కోటకు బీటలు వారి కమలం వికసించింది. సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని టీఆర్ఎస్ చేజార్చుకుంది. అనూహ్యంగా బీజేపీ బోణి కొట్టింది. టీఆర్ఎస్ రెండో స్థానానికి, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమయ్యాయి.

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒకరు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. హస్తం గుర్తుపై గెలిచిన ఆత్రం సక్కు కూడా టీఆర్ఎస్‌లోకి రావడంతో పార్లమెంటరీ నియోజకవర్గంలో గులాబీ వనానికి ఏడుగురి ఎమ్మెల్యేల బలం ఉంది. అయినప్పటికీ ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో విజయం సాధించలేకపోయింది.

67 సంవత్సరాల చరిత్ర తిరగరాస్తూ బీజేపీ బోణి

67 సంవత్సరాల చరిత్ర తిరగరాస్తూ బీజేపీ బోణి

ఆదిలాబాద్ పార్లమెంటరీ స్థానంలో 67 సంవత్సరాల చరిత్రను తిరగరాస్తూ బీజేపీ తొలి బోణి కొట్టింది. కమలం గుర్తుపై పోటీచేసిన సోయం బాపురావు విజయకేతనం ఎగురవేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్యంగా బీజేపీలో చేరిన సోయం బాపురావుకు అంతే అనూహ్యంగా విజయం దక్కడం చర్చానీయాంశమైంది.

2004లో టీఆర్ఎస్ నుంచి బోథ్ ఎమ్మెల్యేగా గెలిచిన బాపురావుకు తదనంతరం రాజకీయాలు కలిసిరాలేదని చెప్పొచ్చు. డిసెంబర్ నెలలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి కేవలం 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి కమల తీర్థం పుచ్చుకున్నారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న సోయం బాపురావు ఈసారి బీజేపీ ఎంపీగా ఘన విజయం సాధించారు.

ఆదిలాబాద్‌లో బీజేపీ బోణి.. పార్టీశ్రేణుల్లో ఆనందం

ఆదిలాబాద్‌లో బీజేపీ బోణి.. పార్టీశ్రేణుల్లో ఆనందం

ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో హిస్టరీని షేక్ చేసి బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీశ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 1952 నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రస్థానం మొదలు ఇప్పటివరకు ఆదిలాబాద్ ఇలాకాలో బీజేపీ ఖాతా తెరవలేదు. కానీ, ఈసారి అనూహ్యంగా బీజేపీ బోణి కొట్టడంతో కమలనాథుల సంతోషం అంతా ఇంతా కాదు.

ఆదిలాబాద్, నిర్మల్, ముథోలో నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. ఆదిలాబాద్ పార్లమెంటరీ స్థానంలో ఇదివరకు చాలాసార్లు బీజేపీ పోటీచేసినా గెలుపు అవకాశాలు తలుపు తట్టలేదు. కానీ, ఈసారి మాత్రం టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీపై సోయం బాపురావు విజయం సాధించడంతో
ఆ పార్టీశ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నికల వేళ కరీంనగర్ సభలో సీఎం కేసీఆర్ హిందుగాళ్లు బొందుగాళ్లు అంటూ వ్యాఖ్యానించడం ఆ పార్టీకి పెద్ద మైనస్ అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ దెబ్బతో అటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్.. వరుసగా మూడు స్థానాల్లో బీజేపీ విజయఢంకా మోగించిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

గులాబీకి కలిసొచ్చిన కరీంనగర్‌లో ఏమైంది.. కారు ఎందుకు పల్టీ కొట్టింది...!గులాబీకి కలిసొచ్చిన కరీంనగర్‌లో ఏమైంది.. కారు ఎందుకు పల్టీ కొట్టింది...!

English summary
Since 1952 to 2019, there is no BJP candidates won in Adilabad Lok Sabha Constituency. In 2019 Lok Sabha Elections, First Time BJP Candidate Won In Adilabad Lok Sabha Segment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X