వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మాక్షి చెరువు: చేపల ఉసురు తీస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్

By Narsimha
|
Google Oneindia TeluguNews

వరంగల్: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేపల ప్రాణాలను తీసింది. వందల చేపలు మృతిచెంది నీటిలో తేలియాడుతున్న ఘటన వరంగల్ లో చోటుచేసుకొంది. విషపూరితమైన రసాయనాల కారణంగానే చేపలు చనిపోయాయని చెబుతున్నారు స్థానికులు.

వరంగల్ నగరంలోని పద్మాక్షి చెరువులో వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ విగ్రహాలన్నీ కూడ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసినవి.దీంతో చెరువులో నీళ్ళు విషపూరితంగా మారాయి.మట్టితో చేసిన వినాయక విగ్రహాలనే పూజించాలని స్వచ్చందసంస్థలు, ప్రభుత్వం కోరినా పెడచెవిన పెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకొంది.

 fish died because of water pollution ..at padmakshi tank

వినాయక విగ్రహాల నిమజ్జనం పద్మాక్షి చెరువులో ఉండదని తొలుత జిల్లా యంత్రాంగం ప్రకటించింది.కాని, ఇదే చివరి నిమిషంలో ఇదే చెరువులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు.వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేయడం వల్ల ఈ నీరు కలుషితమైంది. ఈ విషపూరితమైన నీటిలో ప్రాణాలను నిలుపుకోలేకపోయాయి. చనిపోయి నీటిలో తేలియాడుతున్న చేపలే కన్సిస్తున్నాయి.,ేపల పెంపకం కోసం కాంట్రాక్టర్ నష్టపోయినట్టు చెబుతున్నారు.

ఈ చెరువలో వినాయక విగ్రహాల నిమజ్జనం ఉండదని జిల్లా యంత్రాంగం చెప్పడంతో ఈ చెరువులో చేపల పెంపకానికి పూనుకొన్నట్టు కాంట్రాక్టర్ కట్టయ్య చెప్పారు. 5 లక్షల విలువైన చేపలను పెంచేందుకు ఏర్పాట్లు చేసుకొంటే ....విషపూరితమైన నీటి కారణంగా చేపలన్నీ చనిపోయాయని కాంట్రాక్టర్ చెబుతున్నారు.తనకు నష్టం కల్గిందని..పరిహారం చెల్లించాలని ఆయన కోరుతున్నారు.

మరోవైపు ఈ తరహా సంఘటనలు మరో సారి జరగకుండా చర్యలు తీసుకోవాలని వనసేవా సంస్థ ప్రతినిధి నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాదితుడికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

English summary
fish died because of pollution water at warangal tank, recently ganesh idols immersion this padmakshi tank. ganesh idols made plaster of paris , so water polluted , one contractor name kattaiah lease for fishfarm.fish died beacause of water pollution, he wamts compansation from governament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X