హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐదుగురి ఆత్మహత్యలో కొత్తకోణం: సెల్‌ఫోన్లు మాయం, ప్రభాకర్ ఇంట్లో పోలీసుల సోదాలు

కొల్లూరు అవుటర్ రింగ్ రోడ్డు పక్కన మంగళవారం చోటు చేసుకున్న ఐదుగురు కుటుంబసభ్యుల ఆత్మహత్యల కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. ప్రభాకర్‌రెడ్డితో సహ మృతులందరి సెల్‌ఫోన్లు మాయమైనట్లుగా పోలీసులు గుర్తించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొల్లూరు అవుటర్ రింగ్ రోడ్డు పక్కన మంగళవారం చోటు చేసుకున్న ఐదుగురు కుటుంబసభ్యుల ఆత్మహత్యల కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. ప్రభాకర్‌రెడ్డితో సహ మృతులందరి సెల్‌ఫోన్లు మాయమైనట్లుగా పోలీసులు గుర్తించారు.

సెల్‌ఫోన్లు ఏమయ్యాయి?

సెల్‌ఫోన్లు ఏమయ్యాయి?

మృతదేహాలు పడివున్న చోట పోలీసులకు వీరి సెల్‌ఫోన్లు దొరక్కపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. అయితే, సెల్‌ఫోన్ల డేటా బయటకి రాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభాకర్‌రెడ్డే ఫోన్లు మాయం చేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
అయితే, ఎవరైనా ఎత్తుకెళ్లారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతదేహాలపై బంగారు నగలు అలాగే ఉన్నాయని, కేవలం సెల్‌ఫోన్లు మాత్రమే కనిపించకుండా పోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆర్థిక ఇబ్బందుల్లేవు, అనుమానాల్లేవు: రవీందర్ రెడ్డి, కేక్‌లో విషం కలుపుకొని ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందుల్లేవు, అనుమానాల్లేవు: రవీందర్ రెడ్డి, కేక్‌లో విషం కలుపుకొని ఆత్మహత్య

ప్రభాకర్ ఇంట్లో సోదాలు..

ప్రభాకర్ ఇంట్లో సోదాలు..

కాగా, బుధవారం రామచంద్రపురంలోని ప్రభాకర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు నార్సింగి పోలీసులు. ఆత్మహత్యకు సంబంధించిన ఆధారాలు ఏమైనా లభిస్తాయనే ఉద్దేశంతో పోలీసులు నిర్వహించారు. ఏదైనా సూసైడ్ నోట్ రాసిపెట్టారా? అని ప్రభకార్ బంధువుల సమక్షంలోనే సోదాలు చేశారు.

ఐదు మృతదేహాలు.. అనేక ట్విస్టులు: అసలేం జరిగింది?, ప్రభాకర్ రెడ్డి జీవితమిలా.. ఐదు మృతదేహాలు.. అనేక ట్విస్టులు: అసలేం జరిగింది?, ప్రభాకర్ రెడ్డి జీవితమిలా..

డిండికి వెళ్తామని.. ఆత్మహత్యలు..

డిండికి వెళ్తామని.. ఆత్మహత్యలు..

ప్రభాకర్ ఆత్మహత్యకు ముందు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారానే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు డిండికి వెళ్తామని వెళ్లిన ప్రభాకర్.. అక్కడికి వెళ్లకుండా.. కుటుంబసభ్యులకు విషం కలిపిన కేక్ పెట్టి.. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలకు తావిస్తోంది. కుటుంబం ఆత్మహత్యకు ప్రాథమికంగా ఆర్థిక ఇబ్బందులే కారణమని భావించినప్పటికీ.. వారి బంధువుల మాత్రం వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెబుతుండటం గమనార్హం.

మిస్టరీగానే ప్రభాకర్ కుటుంబం ఆత్మహత్య

మిస్టరీగానే ప్రభాకర్ కుటుంబం ఆత్మహత్య

ఈ నేపథ్యంలో ప్రభాకర్ కుటుంబం ఆత్మహత్య మిస్టరీగా మారింది. ఈ క్రమంలోనే ప్రభాకర్ రెడ్డి ఇంటితోపాటు మియాపూర్‌లోగల ప్రభాకర్‌రెడ్డి కార్యాలయంలో సోదాలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయంచారు. ఒకవేళ ప్రభాకర్ కుటుంబసభ్యుల సెల్‌ఫోన్లు లభ్యమైతే వారి కాల్ రికార్డులను పరిశీలించడం ద్వారా మరింత సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

English summary
The bodies of five members of a family were found under a bridge near the Outer Ring Road(ORR) at Narsingi in Cyberabad police limits on Tuesday. While the bodies of a man and a two-year-old child were found inside a locked car on the ORR, those of three women were found in bushes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X