హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రెజిల్ కరెన్సీతో మోసానికి యత్నం: పోలీసులకు ఇలా చిక్కారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్రెజిల్ దేశానికి చెందిన చలామణిలోని లేని కరెన్సీని అమాయకులకు అంటగట్టేందుకు ప్రయత్నించిన ఐదుగురు నిందితులను హైదరాబాదులోని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఏసీపీ కార్యాలయంలో పంజాగుట్ట ఏసీపీ ఎం.వెంకటేశ్వర్లు అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

కరీంనగర్ జిల్లా రామగూండంకు చెందిన మారాల మహేశ్ (36), వరంగల్ జిల్లా జనగాం మండలానికి చెందిన బొర్ర భానుచందర్ (25), అదే జిల్లాలోని హసన్‌పర్తి మండలానికి చెందిన గంటా యాదగిరి రెడ్డి మిత్రులు. హైదరాబాదు నగరంలోని హస్మత్‌పేట్, ఉప్పల్, చంపాపేట్‌లో నివాసముంటున్న వీరు ముఠాగా ఏర్పాడ్డారు.

తక్కువ వ్యవధిలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ముంబాయిలో ఓ వ్యాపారి వద్ద రూ.30వేలు చెల్లించి బ్రెజిల్ దేశానికి చెందిన ప్రస్తుతం చెలామణి లేని మిల్ క్రుజడాస్(కరెన్సీ) 490 నోట్లను కొనుగోలు చేశారు. వీటిని విక్రయించేందుకు ఓ రింగ్‌ను ఏర్పాటు చేశారు.

ఇలా ఎంపిక

ఇలా ఎంపిక

చెలమాణిలో లేని బ్రెజిల్ కరెన్సీని విక్రయించేందుకు మధ్యవర్తులుగా గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన పిన్నింటి రాధాకృష్ణ (24), కాకినాడకు చెందిన సాపి రెడ్డి భవాని ప్రవీణ్ (26) ఎంపిక చేసుకున్నారు.

విక్రయించే క్రమంలో...

విక్రయించే క్రమంలో...

చెల్లని కరెన్సీని అమీర్‌పేట్ బిగ్‌బజార్ వద్ద ఓ వ్యక్తికి విక్రయించే క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు వీరిని అరెస్టు చేశారు.

సెల్ ఫోన్లు స్వాధీనం

సెల్ ఫోన్లు స్వాధీనం

నిందితుడి నుంచి 490 నోట్ల బండిళ్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో నోటు భారత కరెన్సీలో 23,966 విలువ పలుకుతుందని, రూ.1,17,43,340కు విక్రయించేందుకు విఫల యత్నం చేశారన్నారు.

సమయస్ఫూర్తి..

సమయస్ఫూర్తి..

నిందితులను పట్టుకోవడం సమయస్పూర్తిని ప్రదర్శించిన పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ మోహన్ కుమార్, డీఐ బి.లక్ష్మీనారాయణరెడ్డి, డీఎస్సైలు జి.వెంకట్ రెడ్డి, ఎం.శివకుమార్‌లను ఏసీపీ అభినందించారు.

త్వరగా సంపాదించాలని....

త్వరగా సంపాదించాలని....

త్వరగా డబ్బులు సంపాదించాలనే కక్కుర్తితో యువకులు చెలామణిలో లేని కరెన్సీని అమాయకులకు అంటగట్టడానికి ప్రయత్నించారు.

ఆదిలోనే పట్టుబడ్డారు...

ఆదిలోనే పట్టుబడ్డారు...

పోలీసులు సమయస్ఫూర్తిగా వ్య.వహరించి, పట్టుకోవడంతో భారీ మోసానికి ఆదిలోనే అడ్డుకట్ట పడింది. ఈ విషయంలో పోలీసులు సమర్థంగా వ్యవహరించారు.

English summary
A gang has been nabbed by Hyderabad Punjagutta police, while trying to supply fake currency
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X