• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఉద్యోగాలంటూ షేక్‌లకు సెక్స్ బానిసలు చేస్తారు: మహిళల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

|

హైదరాబాద్: నగరంలో మహిళల అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టయింది. అరబ్‌ దేశాల్లో ఉద్యోగాల పేరిట అమాయక మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతూ..వారిని అరబ్‌షేకుల వ్యభిచార గృహాల్లో బందీలుగా మారుస్తున్న ఐదుగురిని రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం అరెస్టుచేశారు.

రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ శుక్రవారం నిందితుల వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండల పరిధి కొమరగిరి పట్నం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పోతుల శ్రీనుబాబు అలియాస్‌ దుబాయ్‌ శ్రీను(35) ఇంతకుముందు నగరంలోని జీడిమెట్ల సమీపంలోని చింతల్‌లో ఉండేవాడు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న అతను ఓ ఏజెన్సీ ఏర్పాటుచేసి పదుల సంఖ్యలో ఏజెంట్ల ముఠాలను ఏర్పాటు చేసుకున్నాడు.

అమాయక మహిళలే టార్గెట్

అమాయక మహిళలే టార్గెట్

ఆ ముఠాల సభ్యుల సాయంతో దుబాయ్‌, మస్కట్‌, కువైట్‌, ఖతార్‌లలో అరబ్‌షేక్‌ల ఇళ్లలో పనిమనుషులుగా ఉద్యోగాలిప్పిస్తామంటూ తెలుగు రాష్ట్రాల్లో అమాయక గ్రామీణ మహిళలకు ఎర వేసేవాడు. వారి నుంచి రూ.4 లక్షలు వరకు వసూలుచేసి, పర్యాటక వీసాతో అక్కడికి రప్పించేవాడు. అక్కడికి వెళ్లగానే అక్కడున్న అతని ఏజెంట్లు వారి పాస్‌పోర్టులు లాగేసుకుని అరబ్‌ షేకులకు బానిసలుగా అమ్మేసేవారు.

షేక్‌ల నుంచి లక్షలు దండుకుంటాడు

షేక్‌ల నుంచి లక్షలు దండుకుంటాడు

షేకుల లైంగిక వాంఛలను తీర్చకుంటే.. వీసాల్లేని కారణంగా ఇక్కడి చట్ట ప్రకారం జైళ్లలో మగ్గాల్సి వస్తుందని భయభ్రాంతులకు గురిచేసేవాడు. అందుకుగాను షేక్‌ల నుంచి నుంచి రూ.లక్షల్లో దండుకునేవాడు ఈ దుబాయ్ శ్రీను.

వెలుగులోకి ఇలా..

వెలుగులోకి ఇలా..

ఇదే తరహాలో బందీగా మారిన ఓ మహిళ అక్కడి తెలుగువారి సాయంతో ఇటీవలే నగరానికి చేరుకుంది. ఆమె భర్త కూడా వీసా లేని కారణంగా దుబాయ్‌లో మరోచోట చిక్కుకున్న క్రమంలో.. అతన్ని విడిపించుకునేందుకు తొలుత ఘట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసింది. ఈ విషయం తెలుసుకున్న దుబాయ్‌శ్రీను ఆమె భర్తను నగరానికి పంపించేశాడు. ఇటీవల వారిరువురూ ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రజాదర్బార్‌లో రాచకొండ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఆయన ఆదేశానుసారం ప్రత్యేక దర్యాప్తు బృందం ఉభయ రాష్ట్రాల్లో ఏజెంట్లుగా చలామణి అవుతూ మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేసింది.

నిందితులు వీరే..

నిందితులు వీరే..

తూర్పుగోదావరి అల్లవరం మండలానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు ఉప్పే త్రిమూర్తులు అలియాస్‌ మూర్తి(32), పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్‌ మండలానికి చెందిన ఎలక్ట్రీషియన్‌ మడికి తాతాజీ అలియాస్‌ నాని(26), అదే జిల్లా పోడూరు మండలానికి చెందిన రైతు గోగనమంద రామారావు(40), నగరంలోని చింతల్‌లో ఉంటున్న అల్లవరం వాసి పోతుల దాసు(30), కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన సాల మురళి(37) అరెస్టయిన వారిలో ఉన్నారని సీపీ తెలిపారు. నిందితుల నుంచి రూ.1.60 లక్షల నగదు, వీసా పత్రాలు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

100మందిని అక్రమంగా తరలించిన శ్రీను ముఠా

100మందిని అక్రమంగా తరలించిన శ్రీను ముఠా

దుబాయ్‌ శ్రీను(35), మస్కట్‌లో ఉంటున్న మరియమ్మ(35), కరీమ్‌, దుబాయ్‌లో ఉండే ఆల్పా శ్రీను, సత్యవతి, లక్ష్మి, శ్రీనివాస్‌గౌడ్‌లపైనా కేసులు నమోదుచేసినట్లు సీపీ తెలిపారు. ఈ ముఠా గత పదేళ్లుగా సుమారు 100 మందిని అక్రమంగా అరబ్‌దేశాలకు పంపినట్లు తెలిసిందని సీపీ మహేష్ భగవత్ వివరించారు. ఈ సందర్భంగా ఏజెంట్లుగా మారి అమాయక మహిళల అక్రమ రవాణాతోపాటు..వారిని వ్యభిచార కూపంలోకి దింపుతున్న 33 మంది జాబితానూ విడుదల చేశారు. ఇలాంటి అక్రమ ఏజెంట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

English summary
The Rachakonda police on Friday arrested five persons on charges of human trafficking and sexual exploitation. ₹1.60 lakh, copies of visa documents and other materials were seized from their possession.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X